నేటి తాజా వార్తలు-౦౨/౧౫

*కృష్ణా, గోదావరి నదీ పర్యవేక్షణ బోర్డు సమీక్ష దిల్లీలో ముగిసింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యు.పి.సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, హరీశ్‌రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*గుంటూరు జిల్లా వసంతరాయ పురం లో మంత్రి నక్కా ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎంపీఈవో అగ్రికల్చరల్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన మంత్రి.
*అమరావతి సచివాలయంలోని కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో సమావేశం లో మంత్రి పరిటాల సునీత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*ఈనెల 17న జరుగునున్న ముఖ్యమంత్రి పర్యటన ఎరాప్ట్లను పరిశీలించిన ఇన్.చార్జి కలెక్టర్ వెంకటేశ్వరావు.
*ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన రేపు చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొంటారు.
*కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిప్యుటీ సిఎంను కే.ఈ.కృష్ణమూర్తిని నిలదీసిన న్యాయమూర్తులు.
*సచివాలయం రెండవ బ్లాక్ లో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అద్యక్షతన పౌర సరఫరాల శాఖ ప్రీ బడ్జెట్ సమావేశం.
*ముఖ్యమంత్రి చంద్రబాబు అద్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
*గుంటూరు జీజీహెచ్ లో సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్ చేసిన ఘటన పై డీ.ఎం.ఈ ని విచారణకు ఆదేశించిన ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్.
*కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్ గడ్కరితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.
*ఈనెల 24,25,26 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు.
*గుంటూరు లోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 2017-18 ఆర్ధిక సంవత్సరం కింద బ్యాంక్ లింక్డ్ పధకం ద్వారా ఎస్సి లబ్దిదారులకు పధకములు నిర్వహణ పై అవగాహనా సదసులో పాల్గొన్నమంత్రి ఆనందబాబు .
*శ్రిపోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేనమాలలో మహిళలతో వైకాపా అధినేత ముఖాముఖి.
*ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగు యువత కార్యక్రమం జరిగింది.
*కర్నూలుజిల్లా శ్రీశైలం లో వంద పడకల ఆయుర్వేద ఆసుపత్రి ఎరాప్టు కోసం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంషేమం లో ఉప విభాగం అయిన ఆయుష్ వైద్య విభాగం నాకు 10వ తేదీన పది కోట్ల రూపాయలు మజూరు అయ్యాయి.
*రాష్ట్రవ్యాప్తంగా 33 పురపాలిక(మున్సిపాలిటీ)ల్లో జూన్‌ 2న 200 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఇందుకోసం ఆయా పురపాలికల్లో స్థలాల ఎంపిక పూర్తయిందన్నారు.
*తెలంగాణకు సంబంధించిన సమస్త అంశాల సమాహారంగా కరదీపికలాంటి పుస్తకాన్ని ముద్రించి, ఉగాది పర్వదినమైన మార్చి 18 నుంచి ఇంటింటికీ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌, సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు.
*ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ) హాల్‌టికెట్లు ఈ నెల 19 నుంచి అందుబాటులోకి వస్తాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఎ.వాణిప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
* గురువారం నుంచి వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి వివాహ సెలవుపై వెళ్తున్నారు. మార్చి 8న వస్తారు.
*ముంబయిలో ఈనెల 10, 11 తేదీల్లో జరిగిన ఆసియా అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకులాల విద్యార్థినులు ప్రతిభ చూపారు.
*రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 22న జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అమరావతి నిర్మాణం, బడ్జెట్‌ సమావేశాలు, భూ కేటాయింపులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి.
*పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాలను ఈ నెల 16వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28వ తేదీన శ్రీ జలదుర్గ అమ్మ వారికి, గోకర్ణపురంలోని గోకర్ణేశ్వర స్వామికి వైభవంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉత్సవాల 15 రోజుల పాటు పెద్దింట్లమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సర్కార్‌ కాల్వ వంతెన వద్ద అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన వాచ్‌ టవర్‌ నుంచి చూస్తే కొల్లేరు సోయగాలు కనవిందు చేస్తాయి. పెద్దింటి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు.
*దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మను బుధవారం రాత్రి ఉత్తరాది మఠానికి చెందిన సత్యార్ధ తీర్థస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు, పలువురు సభ్యులు, ఆలయ అర్చకులు, పీఆర్వో స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి సన్నిధికి తోడ్కొని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆశీర్వచన మండపంలో వేదపండితులు సత్యార్ధ తీర్థస్వామికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయ పాలక మండలి చైర్మన్‌ వై.గౌరంగబాబు, అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం బహుకరించారు.
* ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను ఈ నెల 17న హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. భారీ కేక్ కటింగ్‌తోపాటు మెగా రక్తదానశిబిరం, వికలాంగులకు ట్రై సైకిళ్లు, అంధులకు చేతికర్రలు, వృద్ధ మహిళలకు చీరెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు.
*హజ్‌ – 2018 యాత్రకు ఎంపికైన యాత్రికులకు ఫిబ్రవరి 18న శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్‌ ఎస్‌ఎ.షుకూర్‌ తెలిపారు. ఓల్డ్‌ మలక్‌పేట వాహెద్‌నగర్‌లో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించనున్నారు.
*దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత పార్టీపై, పాలనపై పట్టు సాధించి ఇక కొద్ది రోజుల్లో సీఎం సీటులో కూర్చుంటానని కలలు కన్న శశికళ ఆశలన్నీ అడియాసలుగా మారిన రోజు ఇది. అక్రమార్జన కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువడి ఏడాది పూర్తయ్యింది.
*నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి ప్రధానిగా కెపి ఓలి నియమించనున్నట్టు సమాచారం. కెపి ఓలి 2015 అక్టోబర్ నుంచి 2016 ఆగష్టు వరకు నేపాల్ కు ప్రధానిగా పనిచేశారు. ఓలి 30 రోజుల్లోగా తన బలాన్ని పార్లమెంటులో నిరూపించుకోవాలి. దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి తన రాజీనామా పత్రాన్ని దేవ్ బా అందజేశారు.
*రాష్ట్రంలో ఈ ఏడాది జూన్‌ 2న 200 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి పి.నారాయణ వెల్లడించారు. తొలివిడత లక్ష జనాభా పైబడిన 33 మునిసిపాలిటీల్లో, కూలీలు, కార్మికులకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
*దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్‌ జుమా గురువారం తన పదవికి రాజీనామా చేశారు. పదవి నుంచి తప్పుకోకపోతే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తొలగింపజేస్తామని అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్(ఏఎన్‌సీ)‌ పార్టీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా సమర్పించారు.
*పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఫోన్ చేశారు. పవన్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్‌సీ)కి రూపకల్పన జరుగుతోంది. అయితే.. జేఎఫ్‌సీకి మద్దతు కోరుతూ పవన్‌కల్యాణ్ రఘువీరారెడ్డికి ఫోన్ చేశారు. రేపు హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో జరిగే జేఎఫ్‌సీ సమావేశానికి రావాలని రఘువీరాను పవన్ ఆహ్వానించారు. అయితే.. ఈ సమావేశానికి తమ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజుఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జంగా గౌతమ్ హ‌జ‌రు అవుతార‌ని పవన్‌కల్యాణ్‌కు రఘువీరా తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com