నేటి తాజా వార్తలు-౦౩/౩౧

*డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రీయ ఏప్రిల్ ఒకటి నుంచి మరింత సులభతరం కానుంది.
*గ్రామీణ నేపద్యం ఉన్న 45 రైల్వే స్టేషన్లు వైపే సదుపాయం కల్పించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈమేరకు రైల్వే బోర్డు ఆదేశాలు జరీ చేసింది.
*రామయ్య ఐఐటీ కోచింగ్ సెంటర్ లో ప్రవేశాలకు ఏప్రిల్ ఒకటివ తేదీన దరఖాస్తులు విక్రయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
* ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై దేశవ్యాప్తంగా దళితులు విచారం వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయమై కేంద్రం పార్లమెంటులో చర్చ జరపాలని ఆల్‌ ఇండియా డిఫెన్స్‌ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, అణగారిన ప్రజల హక్కుల పోరాట సమితి, తెలంగాణ షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ సంఘాలు డిమాండ్‌ చేశాయి. శుక్రవారం ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని అంబేద్కర్‌ స్ఫూర్తి భవన్‌లో సంఘాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ తీర్పుపై ప్రత్యేక సమావేశం నిర్వహించాయి. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సంఘాల అధ్యక్షులు శంకర్‌, బి.అమృతరావు, సుధాకర్‌లు మాట్లాడారు. అట్రాసిటీ కేసులపై పూర్తి విచారణ చేసిన అనంతరమే కేసు నమోదు చేస్తే అప్పటి వరకు దోషులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని భీమ్‌ ఆర్మీ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్‌ 2వ తేదీన భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజున అన్ని అంబేద్కర్‌ విగ్రహాల కూడళ్ల వద్ద నిరసన ప్రదర్శన చేసి బంద్‌ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ప్రతినిధులు ఎం.నర్సింగ్‌రావు, మేడి పాపయ్య మాదిగ, ఏబీ కిరణ్‌, శ్రీరాములు, సైదులు, విద్యాసాగర్‌ పాల్గొన్నారు.
*గుంటూరు అరండల్ పేట పదిహేనవ లైను లో నూతనంగా ఏర్పాటు ఏర్పాటు చేసిన ఇంతీరియాల్ రివలేక్షన్ హెచ్ డీ యువీ వాల్ పేపర్స్ ప్రింట్ శాప్ ను ప్రారంభించిన మంత్రి నక్కా ఆనందబాబు.
* పదో తరగతి పరీక్షలు రాసి ఇంటర్‌లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు విద్యా సంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌, నీట్‌ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు హాజరయ్యే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుమలరావు కోరారు.
* తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రెండో గంట అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి స్వర్ణరథాన్ని అధిరోహించారు. భక్తులను అనుగ్రహిస్తూ తిరువీధుల్లో వైభవంగా ఊరేగారు. ఉత్సవంలో వేలాది మంది పాల్గొని గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. అనంతరం ఆలయం ఎదుటకు చేరుకుని బంగారు పల్లకిని అధిరోహించి వసంత మండపానికి చేరుకున్నారు. శ్రీవారికి ఆరాధన, అభిషేకాదులు, నివేదనలు, కొలువు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులు తిరువీధుల్లో ప్రదక్షిణంగా ఊరేగుతూ ఆలయం చేరుకోవడంతో రెండో రోజు ఉత్సవం పరిసమాప్తమైంది. శనివారంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉదయం 8 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, శ్రీసీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు వసంత మండపానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడో రోజు ఉత్సవం జరుగుతుంది.
* భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భజనలు కీర్తనలతో కోవెల రామ నామాలతో మార్మోగి అంతా రామమయమైంది. సుప్రభాతం పలికి నామార్చనలు చేసిన అర్చకులు ప్రధాన ఆలయంలో కొలువైన మూలమూర్తులను బంగారు కవచాలతో అలంకరించడంతో భక్తులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రివేళ ఊంజల్‌ సేవను ఘనంగా నిర్వహించారు. బేడా మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో స్వామివారిని ఉంచి పూజలు చేశారు. కల్యాణం తర్వాత జరిగే సంబరాలలో ఇది అతి ముఖ్యమైన ఉత్సవమని పండితులు పేర్కొన్నారు. శనివారం బంగారు తులసి పూజలు ఉంటాయని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. ఏప్రిల్‌ ఒకటిన చక్రతీర్థం నిర్వహించి ఈ ఉత్సవాలకు పూర్ణాహుతి పలకనున్నారు.
* తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రెండో గంట అనంతరం శ్రీమలయప్పస్వామి స్వర్ణరథాన్ని అధిరోహించారు. భక్తులను అనుగ్రహిస్తూ తిరువీధుల్లో వైభవంగా ఊరేగారు. ఉత్సవంలో వేలాది మంది పాల్గొని గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. అనంతరం ఆలయం ఎదుటకు చేరుకుని బంగారు పల్లకిని అధిరోహించి శ్రీవారు వసంత మండపానికి చేరుకున్నారు. శ్రీవారికి ఆరాధన, అభిషేకాదులు, నివేదనలు, కొలువు శాస్త్రోక్తంగా జరిగాయి. శనివారంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
* ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేసి ఇంటర్‌లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు.. జేఈఈ మొయిన్స్‌, అడ్వాన్స్డ్‌తో పాటు నీట్‌పై అవగాహన కలిగించేందుకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో ఏప్రిల్‌ ఒకటో తేదీ(ఆదివారం)న సదస్సు నిర్వహిస్తున్నట్టు విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సుకు హాజరైన వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పించామని ఆయన తెలిపారు.
* ప్రైవేటు విద్యాసంస్థల పరిరక్షణ, వివిధ డిమాండ్ల సాధనకు ఏప్రిల్‌ 7న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే సభకు తరలిరావాలని నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ అలయన్స్‌(నిసా) కోశాధికారి మధుసూదన్‌ కోరారు.
* తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం హనుమాన్‌ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనెల 29 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. శనివారం నిర్వహించిన చిన్న జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది హనుమాన్‌ దీక్షాపరులు తరలివచ్చారు. వారు స్వామి వారికి ముడుపులు చెల్లించి, మాల విరమణ చేసి అంజన్నను దర్శించుకొన్నారు. ఈసందర్భంగా ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com