నేటి తాజా వార్తలు-౦౪/౧౪

నేటి తాజా వార్తలు 04/14
*భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. దళితులు, మహిళలు, కార్మికుల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు.
*దివ్యాంగుల క్రికెట్ టోర్నీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 5లక్షల విరాళాన్ని ప్రకటించారు.
*దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ చదువుతున్న అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 దూరవిద్యా కేంద్రాల నుంచి 56,303 మంది అభ్యర్థులు పదో తరగతి పరీక్షలకు, 58,765 మంది ఇంటర్‌ తరగతులకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పదో తరగతి కోసం 211, ఇంటర్‌ కోసం 216 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని దూరవిద్యా కేంద్రాల్లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
* రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై భాజపా ప్రత్యేకంగా ఓ పుస్తకాన్ని ముద్రిస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధికి సహకారం లభించడంలేదని తెదేపా మండిపడుతున్న నేపథ్యంలో గడిచిన 4 సంవత్సరాల్లో కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయాన్ని ఆ పుస్తకంలో వివరించనుంది. ఆదివారం పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు హరిబాబు ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.
*ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 22న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ నెల 14న జరగాల్సిన కార్యక్రమం అంబేద్కర్‌ జయంతి కారణంగా వాయిదా పడింది. తిరిగి దీన్ని ఈ నెల 22న నిర్వహించాలని నిర్ణయించామని ఏపీ, తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శులు పి.వి.రాంబాబు, బి.ఆర్‌.మధుసూదన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.
* రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఇన్‌ఛార్జి జిల్లా పంచాయతీ అధికారుల(డీపీఓ)ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డివిజినల్‌ పంచాయతీ అధికారుల(డీఎల్‌పీవో)కు తాత్కాలిక పద్ధతిలో పదోన్నతి కల్పించి ఇన్‌ఛార్జి డీపీఓలుగా నియమిస్తున్నట్లు సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొంది.
*ప్రత్యేక హోదా సాధన కోసం రాజకీయ పార్టీలు ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు 16న జరగాల్సిన గణితం పరీక్షను 17వ తేదీకి మారుస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 17న ఉదయం 6, 7, 8 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు అదే రోజు ఉదయం పేపర్‌-1, మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలకు 16 నుంచి 19 వరకు జరపాల్సిన పరీక్షలను 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది. 17న తెలుగు, 18న ఆంగ్లం, 19న గణితం, 20న పరిసరాల విజ్ఞానం పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది.
*ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటీ(ఏపీసెక్‌) ఆధ్వర్యంలో ఈ నెల 25న తిరుపతిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రజా సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 22న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ నెల 14న జరగాల్సిన కార్యక్రమం అంబేద్కర్‌ జయంతి కారణంగా వాయిదా పడింది. తిరిగి దీన్ని ఈ నెల 22న నిర్వహించాలని నిర్ణయించామని ఏపీ, తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శులు పి.వి.రాంబాబు, బి.ఆర్‌.మధుసూదన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.
*సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని రాఘవపూర్‌-హుమ్నాపూర్‌ గ్రామాల శివారులోని మంజీరా నది తీరాన ఈ నెల 14 నుంచి 25 వరకు మంజీరా కుంభమేళా జరుగనుంది. గరుడగంగగా పిలుచుకునే మంజీరా నది తీరాన ఉన్న 80 ఎకరాల స్థలం పంచవటేశ్వర్‌ వద్ద ఈ ఉత్సవం నిర్వహిస్తారు. తెలంగాణతోపాటు సమీపంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాలకు చెందిన మఠ, పీఠాధిపతులు ఇందులో పాల్గొననున్నారు. అందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆశ్రమ పీఠాధిపతి శ్రీకాశీనాథ్‌బాబా, జిల్లా పాలనాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం వెల్లడించారు. 12 రోజులపాటు ఉదయం ప్రత్యేక స్నానాలు, బోనాల ఊరేగింపు, లింగార్చన తదితర పూజాధికాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 14, 16, 18, 20, 23, 25వ తేదీల్లో నాగ, దిగంబర సాధువులు అమృత స్నానం చేస్తారని వెల్లడించారు.
* అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఐనవోలులో నిర్మించబోతున్న అంబేద్కర్ స్మృతివనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు.
* టీటీడీలో అన్యమతస్థ ఉద్యోగులు పనిచేయడం మంచి సంప్రదాయం కాదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. అటువంటి వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. అన్యమతస్థులు వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేనివారన్నారు. టీటీడీలో పనిచేసే ప్రతీ ఉద్యోగికి, తిరుమలకు వచ్చే ప్రతీ భక్తుడికి వెంకన్నపై విశ్వాసం ఉండాలని… అలాంటి వారకే ఏడుకొండలపై అడుగుపెట్టే అధికారం ఉంటుందని తెలిపారు. శనివారం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసింది.
* జంతు పునరావాస కేంద్రం (ఏఆర్‌సీ)లో శుక్రవారం ఆడ సింహం అనారోగ్యంతో మృతి చెందింది. ఇక్కడ 16 సంవత్సరాల 3 నెలల వయసు గల ‘లత’ అనే ఆడ సింహం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.
*కేంద్రంలో ఎన్డీయే నుంచి తెదేపా బయటకు వచ్చేసరికి ప్రధాని నరేంద్ర మోదీకి నిరాహారదీక్ష చేసే పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్తు శాఖమంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు.
* భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 127వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను ‘విశ్వ మానవుడి’గా అభివర్ణించారు. పీడిత ప్రజలు తమ సమస్యలు లేవనెత్తేందుకు, హక్కులను సాధించుకునేందుకు అంబేద్కర్‌ వారికి గొంతుక నిచ్చాడని మోదీ పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టితో, మేధో సంపత్తితో అంబేద్కర్‌ పేదలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేశారని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. వారి సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కే. చంద్రఖరరావు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
* అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రవీంద్రభారతిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడడానికి లేవగా ఓ వ్యక్తి ఆయన ప్రసంగానికి అడ్డుతగిలాడు. అంబేద్కర్‌కు ఎందుకు పూల దండ వేయలేదన్నాడు. మంత్రి జగదీశ్‌రెడ్డి జ్యోతిరావు పూలేకు నివాళులర్పించి.. ఇప్పుడెందుకు అంబేద్కర్‌కు నివాళులర్పించలేదని అడగాడు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆందోళన చేస్తున్న వ్యక్తితో మాట్లాడాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవిని కేటీఆర్ ఆదేశించారు.
* టీటీడీలో అన్యమస్థులు పనిచేయడం మంచి పద్దతి కాదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. అటువంటి వారు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలన్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. ‘‘శ్రీవారిపైన భక్తిమార్గం లేని వారు ఇక్కడ ఉద్యోగాలుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది మంచి సంప్రదాయం కాదు. తిరుమలలో పనిచేసే ప్రతి ఉద్యోగి హిందుమతం పట్ల విశ్వాసం ఉండాలి. ఆధ్యాత్మికమైన భావచింతన ఉన్నటు వంటి వాళ్లకు మాత్రమే ఏడుకొండలపై అడుగుపెట్టే అధికారం ఉంది’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com