నేటి తాజా వార్తలు-౦౪/౧౬

* ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న నిరసన దీక్షకు మద్దతుగా 175నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నియోజకవర్గ దీక్షల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్ లు పాల్గొననున్నారు.
*తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) బృందం ఈ నెల 17, 18 తేదీల్లో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ నేతృత్వంలో రాష్ట్ర కమిటీతో పాటు.. 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు ఇందులో పాల్గొంటారు. 17న ఉదయం ఏడు గంటలకు తెలంగాణ భవన్‌ నుంచి ఈ బృందం బయల్దేరుతుంది. మంత్రి హరీశ్‌రావు యాత్రను ప్రారంభించనున్నారు.
*తెలంగాణలోనే మొట్టమొదటిసారి ఆదివారం కరీంనగర్‌లో చేపట్టిన మల్లికార్జునస్వామి వెయ్యినూటపదహారు పట్నాల మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలైన కొమురవెల్లి, ఐనవోలు, ఓదెలు, పర్వతాల, నిర్మల్‌, కౌటాల, గట్టు తదితరచోట్ల నుంచి తరలివచ్చిన 1116 మంది ఒగ్గు పూజారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ హాజరయ్యారు.
*బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 22 వరకు బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌ షిప్‌లోని బ్రహ్మకుమారీస్‌ సేవల కేంద్రం టెంపుల్‌ కాంప్లెక్స్‌లో సంపూర్ణ ఆరోగ్య మెడిటేషన్‌, పర్స్‌నాలిటీ డెవల్‌పమెంట్‌ పలు రకాల విలువలతో కూడిన కార్యక్రమాలు నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు వారికి స్పెషల్‌ చిల్డ్రన్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. ఉచితంగా నిర్వహించే ఈ క్యాంప్‌లో పాల్గొనాలనుకొనేవారు 9391304556ను సంప్రదించగలరు.
*భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని గుంటూరుజిల్లా బాపట్లలో ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ఏర్పాటు చేశారు. అంబేద్కర్‌ 127వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని మంత్రులు ఆనందబాబు, ప్రత్తిపాటి, బాపట్ల ఎంపీ శ్రీరామ్‌మాల్యాద్రి ఆదివారం ఆవిష్కరించారు.
*2016-17లో ఉత్తమ పనితీరును కనబరిచిన రాష్ట్రంలోని 11 గ్రామీణ స్థానిక సంస్థలకు జాతీయ పురస్కారాలు దక్కాయి. దీన్‌దయాళ్‌ ఉపాఽధ్యాయ పంచాయత్‌ స్వశక్తీకరణ్‌ పురస్కార్‌ -2018 కింద రాష్ట్రంలో 10 గ్రామీణ స్థానిక సంస్థలు, నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కార్‌- 2018 కింద ఒక గ్రామ పంచాయతీ ఎంపికైంది. దీన్‌దయాళ్‌ పురస్కార్‌ కింద జిల్లా పరిషత్‌లలో కృష్ణా జిల్లాకు ఈ పురస్కారం దక్కింది.
*మంజీర నది తీరంలో జరిగే కుంభమేళకు భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. దక్షిణ భారతదేశంలో తొలి కుంభమేళను సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రాఘవపూర్ వద్ద నిర్వహిస్తున్నారు. మంజీర నదిలో గరుడ గంగ కుంభమేళ ప్రారంభమైంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎండీ ఫరీదుద్దీన్, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కుంభమేళలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మేళను కాశీనాథ్ బాబా పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.
*విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, విశ్వ పరిరక్షణ కోసం యాదాద్రిలో ఈ నెల 18న 27 కుండములతో అక్షయ సువర్ణ లక్ష్మీనారాయణ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు యాదాద్రి అఖండ నామ ఆశ్రమ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకృష్ణదాస్ ప్రభూజీ విలేకరులకు తెలిపారు. 27 సాదువులు, పీఠాధిపతుల ఆధ్వర్యంలో వారి దివ్యాశీస్సులతో లక్ష్మీనారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏడాదికోసారి వచ్చే అక్షయ తృతీయ రోజు యజ్ఞం నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పాల్గొన్న వారికి పాపాలు, దుఃఖాలు, జన్మ, కర్మ, గ్రహ, కాల, పితృదోషాలు పరిహారమవుతాయని చెప్పారు.
*చిత్రదుర్గంలోని శ్రీ మురుఘ రాజేంద్ర బృహన్మఠం ఏటా అందించే బసవశ్రీ పురస్కారాన్ని 2017కు సంబంధించి గొర్రెల కాపరి కామేగౌడకు ఆదివారం ప్రదానం చేశారు. ఈ పురస్కారం కింద జ్ఞాపిక, పురస్కార పత్రం, రూ.5లక్షల చెక్కు అందజేశారు.
* ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఈ నెల 23 నుంచి 30వతేదీ వరకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలతోపాటు తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఒకటో తరగతి నుంచి ఏర్పాటు చేస్తున్న ఆంగ్ల మాధ్యమ విభాగాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఐదేళ్లు నిండిన పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించాలని, బడిబయట పిల్లలపైనా ప్రత్యేక దృష్టిసారించాలని సూచించింది.
*పాలిసెట్‌-2018 దరఖాస్తుల గడువును పెంచుతున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ప్రకటించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 14తో దరఖాస్తుల గడువు ముగిసింది. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును 20వరకు పొడిగించినట్లు వెల్లడించింది.
* రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిరాహార దీక్ష చేయనున్నారు. ఉదయం 9 గంటలకు దీక్ష మొదలవుతుంది. దీక్ష ముగిశాక అదే రోజు సాయంత్రం మున్సిపల్‌ స్టేడియంలోనే తెదేపా-దళితతేజం విజయోత్సవ సభను నిర్వహిస్తారు.
*తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్వీ) బృందం ఈ నెల 17, 18 తేదీల్లో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ నేతృత్వంలో రాష్ట్ర కమిటీతో పాటు.. 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు ఇందులో పాల్గొంటారు. 17న ఉదయం ఏడు గంటలకు తెలంగాణ భవన్‌ నుంచి ఈ బృందం బయల్దేరుతుంది. మంత్రి హరీశ్‌రావు యాత్రను ప్రారంభించనున్నారు.
*కర్ణాటక శానససభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఎంఐఎం ప్రకటించింది. జేడీఎస్‌కు మద్దతు ఇచ్చి ప్రచారంలో పాల్గొంటామని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. కాంగ్రెస్‌, భాజపా పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు మద్దతుగా ఈనెల 19న స్పీకర్ కోడెల శివప్రసాద్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు కోడెల సైకిల్‌ యాత్ర సాగనుంది. అనంతరం 20న స్పీకర్‌ కోడెల దీక్ష చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా పుట్టిన రోజు నాడు(20వ తేదీ) సీఎం నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ దీక్ష ప్రజల మధ్య జరిగితే ఫలితం ఉంటుందని భావించిన చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా దీక్ష చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
* ప్రముఖ నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్‌ నటుడు రాఘవయ్య(86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ ప్రముఖుల సందర్శనాంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్‌కు తరలించి నిన్న మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా సోమవారం సినీ నటుడు చిరంజీవి బెనర్జీ నివాసానికి వెళ్లారు. తండ్రిపోయిన బాధలో ఉన్న బెనర్జీని, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. రాఘవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com