నేటి తాజా వార్తలు-౧౨/౨౨

*ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి-నర్సాపురం రైలు మార్గం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ప్రధాని మోదీని కలిసిన ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల బృందం ఈ రైలుమార్గం మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. శంకుస్థాపనకు రావాలని కోరగా.. వీలు చూసుకుని ఎప్పుడొచ్చేది సమాచారం ఇస్తామని మోదీ వారికి చెప్పారు.
*ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 4, చింతపల్లిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. కాగా కొద్ది రోజులుగా ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
*మూడో కంటికి తెలియకుండా భారీగా అక్రమాస్తులు పోగేస్తున్న మరో అవినీతి తిమింగలం గుట్టు రట్టయింది. నెల్లూరులో రవాణా శాఖ పరిపాలనా అధికారి (ఏవో), ఇన్‌ఛార్జి ఆర్టీవోగా పనిచేస్తున్న బొల్లాపల్లి శేషాద్రి కృష్ణకిశోర్‌, ఆయన బంధువుల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఏక కాలంలో నెల్లూరు, గుంటూరు జిలాల్లోని నరసరావుపేట, పిడుగురాళ్ల, ఒంగోలు, విశాఖపట్నం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి పెద్దఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.2.5కోట్ల విలువైన చర, స్థిర ఆస్తులను గుర్తించారు.
*నూతన సంవత్సరం కోసం తితిదే రూపొందించిన దైనందిని(డైరీలు), కాలమానిని(క్యాలెండర్ల) ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దిల్లీ, ముంబయి, విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా ముద్రిస్తున్న 12 పుటల క్యాలెండరు దర రూ. 90, వివిధ సైజుల్లోని డైరీలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఈ నెల 7 నుంచి అందుబాటులో ఉంచింది. పెద్ద డైరీ ధర రూ.120గా ఖరారు చేసింది.
*స్వరమాంత్రికుడి మధురగానం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర జనాన్ని మంత్రముగ్ద్ధులను చేసింది. ఆధునిక సాంకేతికతను మేళవించి ఆలపించిన వైవిధ్య గీతాలతో అభిమానులు ఉర్రూతలూగారు. ఎన్టీఆర్‌ బీచ్‌ ఫెస్టివల్‌లో చివరి రోజైన గురువారం రాత్రి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ సంగీత విభావరి ఆద్యంతం అలరించింది. సంగీత ప్రపంచంలోకి వచ్చి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా రెహమాన్‌ ప్రస్థానంతో ప్రారంభమైన పాటల సందడి కడలి అలల రీతిలో ఎగసిపడింది.
*ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 27 నుంచి ఏప్రిల్‌ 20 వరకు 82 రోజులపాటు ‘పల్లెపల్లెకు నేతలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు తెలిపారు.
*కృష్ణా జిల్లాలో చంద్రన్న క్రిస్మస్‌ కానుకగా 14 శాతం మందికి అందించి రాష్ట్రంలో మొదటి స్థానంలో జిల్లా నిలిచిందని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రన్నకానుక పంపిణీలో భాగంగా గురువారం నాటికి 1 లక్షా 63 వేల 242 కార్డుదారులకు చంద్రన్న కానుకను అందించామని కలెక్టర్‌ తెలియజేశారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా చంద్రన్న కానుక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
*నెల్లూరు రావాణాశాఖ కార్యాలయ పరిపాలనాధికారి కృష్ణకిషోర్‌పై ఏసీబీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కృష్ణకిషోర్‌ సోదరుడైన రాము ఇంటిపై కూడా గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ప్రకాశ్‌నగర్‌లోని 60అడుగుల రోడ్డులోని శ్రీనివాస అపార్ట్‌మెంట్‌లో కృష్ణకిషోర్‌ సోదరుడు రాము ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వివిధ ఆస్తులకు సంబంధించిన పత్రాలను, భారీగా ఉన్న పొల్యూషన్‌ సర్టిఫెకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సీఐ ఫిరోజ్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
వ పాశురం పఠించారు. నాటికి మొత్తం ల పాశురాలు పూర్తయ్యాయి. కాగా వైకుంఠ అధ్యయన మహోత్సవాలలో స్వామివారికి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వరాహ అవతారం గావించారు. భాజా భజంత్రీలుసన్నాయిమేళాల నడుమ స్వామివారిని పల్లకిలో ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.*భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తొలుత ప్రాకార మండపంలో ఆండాళ్ అమ్మవారికి
*మహారాష్ట్రలోని పడ్ఘా పోలీసుస్టేషన్‌ పరిధిలో మూడు టన్నుల పశుమాంసాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. థానె నుంచి ముంబైకి పశుమాంసం లోడుతో వస్తున్న టెంపోను బుధవారం ఆజ్రోలి చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేసి సోదా చేశారు. టెంపోలోని పాత సామాన్ల అడుగున దాచి పెట్టిన బీఫ్‌ను వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు. దానిని లాబోరేటరీకి పంపి పరీక్షించగా పశుమాంసమేనని తేలింది. ఈ ఘటనలో టెంపో డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అరెస్టు చేశారు.
*తిరుమల శ్రీవారి లడ్డూలు అదనం గా కావాలనే భక్తులకు టీటీడీ చేదువార్త అందించిం ది. ఉచిత, సర్వదర్శనం భక్తులకు అందజేసే లడ్డూల ధరల్లో మార్పు చేయని టీటీడీ అదనంగా లడ్డూలు కావాలనే వారికి మాత్రం రెట్టింపు ధరలు చెల్లించి కోరినన్ని లడ్డూలు పొందే సౌకర్యాన్ని కల్పించింది.రూ.25 ధరతో విక్రయించే చిన్న లడ్డూ (175 గ్రాము లు)రూ.50కి, కల్యాణోత్సవం లడ్డూ రూ.100 నుంచి రూ.200, వడప్రసాదం రూ.25 నుంచి రూ.100కి పెంచారు. ఈ ధరలు గురువారం నుంచి అమలు చేశారు. తిరుమల ఆలయం వెలుపల జరిగే కల్యాణో త్సవాల్లో అదనపు లడ్డూలు, వడలు కావాలనే వారికి మాత్రమే ధరలు పెంచుతామని గతంలో టీటీడీ అధి కారులు చెప్పారు. అయితే, శ్రీవారి ఆలయంలో అద నపు లడ్డూలు, వడలు కావాలనే వారికి కూడా అదే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావటం గమనార్హం.
*ఆంధ్రప్రదేశ్‌ వైద్య విద్య ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్బారావు నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని వైద్య విద్య డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, జనరల్‌ ఆసుపత్రి (బోధన) సూపరింటెండెంట్లుగా బోధన సిబ్బంది (టీచింగ్‌ స్టాఫ్‌) నుంచి వచ్చిన వారిని మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది.
* ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 27 నుంచి ఏప్రిల్‌ 20 వరకు 82 రోజులపాటు ‘పల్లెపల్లెకు నేతలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు తెలిపారు. గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి దళిత నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
*పాఠశాల విద్యాశాఖలో నిర్లక్ష్యం రాజ్యమేలుతూనే ఉంది. గురువారం మధ్యాహ్నం 8, 9 తరగతుల విద్యార్థులకు జరిగిన నేచురల్‌ సైన్స్‌(ఎన్‌ఎస్‌) సమ్మెటివ్‌ పరీక్ష ప్రశ్న పత్రం కట్ట (బండిల్‌) ఒకటి బుధవారం రాత్రి గుంటూరులో రహదారిపై జారిపడింది. అదృష్టవశాత్తు అది పోలీసు అధికారికి చేజిక్కటంతో దాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నారు.
*కఠినమైన యోయో ఫిట్‌నెస్‌ పరీక్షను సీనియర్‌ క్రికెటర్లు ఒక్కొక్కరుగా అధిగమించేస్తున్నారు. ముందు ఆశిష్‌ నెహ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఆపై యువరాజ్‌ సింగ్‌ ఈ పరీక్షలో పాసవ్వగా.. ఇప్పుడు సురేశ్‌ రైనా కూడా ఈ జాబితాలో చేరాడు.
*టీమ్‌ఇండియా అత్యుత్తమ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తుందని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. ‘‘దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న భారత అత్యుత్తమ బౌలింగ్‌ విభాగం ఇదే. ఉమేశ్‌, షమిలు 140 కిమీ వేగంతో బంతులు వేస్తూ స్వింగ్‌ చేస్తున్నారు.
*ప్రస్తుతం మన జీవనం కార్పొరేట్‌ రంగం నియంత్రణలోనే కొనసాగుతోందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభిప్రాయపడ్డారు. మనం తీసుకునే ఆహారం, విద్య చివరికి వైద్యం ఇలా అన్నింటికీ కార్పొరేట్‌ రంగంపైనే ఆధారపడుతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1.28 లక్షల కంపెనీలు నమోదయ్యాయని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు.
*భారత్‌తో శాంతిచర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వానికి మద్దతిస్తామని పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఖ్వామర్‌ జావేద్‌ బజ్వా పేర్కొన్నారు.
*ప్రముఖ రచయిత దేవిప్రియ రచించిన ‘గాలి రంగు’ కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది. అనువాదం తెలుగు విభాగంలో వెన్న వల్లభరావు రచించిన ‘విరామమెరుగని పయనం’ ఎంపికైంది. గురువారమిక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 24 మందిని ఎంపిక చేశారు. అందులో ఇద్దరు మన తెలుగువారు. ఏడు నవలలు, ఐదు కవితాసంపుటిలు, ఐదు చిన్న కథలు, ఐదు విమర్శన పుస్తకాలకు అవార్డుల దక్కాయని ఆయన తెలిపారు.
*రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల పోస్ట్‌మెట్రిక్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
*సైబరాబాద్‌ పరిధిలో ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందని సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్యా తెలిపారు. ఏడాదిలో మొత్తం 2600 కేసులు నమోదయ్యాయని.. గతేడాదితో పోలిస్తే 800 కేసులు పెరిగాయన్నారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ..’ సైబరాబాద్‌ పరిధిలో 729కి మందికి ఓ పోలీస్‌ చొప్పున భద్రత పర్యవేక్షిస్తున్నారు. నగరంలో అన్ని పండుగలు శాంతియుతంగా జరిగేలా పోలీసులు పనిచేశారు. అంతే కాకుండా 35 జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు భారీ భద్రత కల్పించాం. సైబరాబాద్‌ పరిధిలోని షీ టీమ్స్‌180 కౌన్సిలింగ్‌ సెషన్స్‌ నిర్వహించి, 70 వేల మంది మహిళలకు అవగాహన కల్పించారు.
*సన్నీ నైట్‌ షోపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ.. పోలీసులు అనుమతి నిరాకరించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సన్నీ షోను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బెంగళూర్‌ పోలీసులను ప్రశ్నించింది.
* దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్‌ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నిచ్చెలి శశికళ, అపోలో గ్రూప్‌ ఆసుపత్రుల చైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డికి కమిషన్‌ సమన్లు ఇచ్చింది. 15 రోజుల్లోగా నేరుగా విచారణకు హాజరు కావాలని కమిషన్‌ ఆదేశించింది. కాగా అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే.
* పోలవరం విషయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు శుక్రవారం సమావేశం అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2019 నాటికి కేంద్ర ప్రభుత్వమే పోలవరాన్ని పూర్తి చేయాలని వారు ఈ సందర్భంగా గడ్కరీని కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com