నేటి తాజా వార్తలు – 05/12

*శ్రీకాకుళం జిల్లా కలిగిరి మండలం సరుబుజిలిలో లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన డిప్యుటీ తహసిల్దారు.
*ఈనెల 19న ఆత్మకూరులో మినీ మహానాడు.
* సొంత క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టే యోచనలో ఫేస్‌బుక్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కొత్త బ్లాక్ ‌చైన్‌ డివిజన్‌ను ప్రవేశపెట్టిన అనంతరం క్రిప్టో కరెన్సీ ఆలోచన దిశగా ఆ సంస్థ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
* ఓ పక్క ఏసీబీ అధికారుల దాడులు విస్తృతంగా జరుగుతున్నా అధికారులు లంచాలు తీసుకోవడం మానడం లేదు. తమను ఎవరు పట్టిస్తారులే అని మొండిగా వ్యవహరించి చిన్న పనికీ డబ్బులు గుంజుతుండడంతో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు.
* ఐపీఎల్‌-11లో భాగంగా శనివారం సాయంత్రం 4గంటలకు ఇండోర్‌ వేదికగా పంజాబ్‌, కోల్‌కతా మధ్య మ్యాచ్‌ జరగనుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా కోల్‌కతా 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. రాత్రి 8గంటలకు దిల్లీ వేదికగా బెంగళూరు, దిల్లీ తలపడనున్నాయి. ఈ ఇరుజట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి.
* గోదావరి కళకళలాడుతోంది. సామర్థ్యం కంటే ఎక్కువ నీరు రావడంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి నిండు కుండలా ఉంది. ఇరిగేషన్‌ అధికారులు సముద్రంలోకి కొంత నీటిని వదులుతున్నారు.
* 2018 టీఎస్ పాలీసెట్‌లో క్వాలిఫై అయిన విద్యార్థిని,విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కొరకు ఈ నెల 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 21 వరకు ఆప్షన్ల నమోదు, 23న సీట్ల కేటాయింపు, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
* భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. శనివారం మోదీ ముక్తినాథ్‌ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలతో, నాయలకులతో ముచ్చటించారు. అనంతరం కాఠ్‌మాండూ చేరుకొని అక్కడి పశుపతినాథ్‌ ఆలయాన్ని సందర్శించారు.
* తెలంగాణలో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. కర్ణాటక నుంచి లక్షద్వీప్‌ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రం, బంగాళఖాతం నుంచి వస్తున్న తేమతో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
* తెలంగాణలో ‘రైతుబంధు’ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అచ్యుతాపురంలో మంత్రులు మహమూద్‌ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రైసస ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో రైతులకు సభాపతి మధుసూదనాచారి చెక్కులు అందజేశారు.
* తిరుపతిలో అమిత్‌షా వాహనశ్రేణిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా నేత సోము వీర్రాజు తెలిపారు. దాడి చేస్తున్నప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, అమిత్‌షాకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి ఆనంద్‌బాబు స్పందిస్తూ.. తిరుపతి ఘటనను భాజపా నేతలు చిలువలు పలువలు చేస్తున్నారని విమర్శించారు.
* ఏపీ ఐసెట్‌-2018 ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను ప్రకటించారు. ఫలితాలను రియల్‌టైం గవర్నెన్స్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. పీపుల్స్‌ ఫస్ట్‌ మొబైల్‌యాప్‌, సీఎం కనెక్ట్‌ కైజాలా యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ వినియోగదారులు కూడా తమ టీవీ తెరపై ఫలితాలను పొందవచ్చు.
* యావత్‌ భారతంలో ఆసక్తిగా మారిన కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు పెద్దఎత్తున పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం నేపాల్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా కర్ణాటక ఎన్నికలపై స్పందించారు.
*ఉద్యోగుల భవిష్యనిధిపై రుణాలు మంజూరు చేయనందుకు నిరసనగా.. ఈ నెల 12, 13 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ముందు ధర్నా చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయుల సమాఖ్య (ఏపీటీఎఫ్‌) ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు తెలిపారు.
*ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బుద్దా అరుణారెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. శుక్రవారం ఆమె తన తల్లిదండ్రులతో కలసి ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. పిల్లలు చక్కగా ఆడుతున్నారని, ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు.
*ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఫలితాలను శుక్రవారం పరిపాలనాధికారి డాక్టర్‌ అమరేంద్రకుమార్‌ విడుదల చేశారు. విద్యార్థులకు ఏప్రిల్‌ 24 నుంచి మే 3 వరకు వార్షిక పరీక్షలు జరిగాయి. ఫలితాలను ’results.rguktrkv.ac.in అనే వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులకు జూన్‌ 1 నుంచి సమ్మర్‌ సెమిస్టర్‌ కోర్సులు ఉంటాయని, విద్యార్థులంతా అదే రోజు కోర్సుల కోసం తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
*తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,20,549 మంది హాజరుకానున్నారు. వారిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులే 2,68,753 (అనుత్తీర్ణులు 1,42,793, మార్కుల వృద్ధికి 1,25,960)మంది ఉండటం గమనార్హం. ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనున్న పరీక్షల నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ శుక్రవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉదయం 9-12 గంటల వరకు మొదటి ఏడాది, మధ్యాహ్నం 2.30- 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
*రుతుపవనాలు ఈనెల 25కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత వాతావరణ శాఖ పరిశీలిస్తున్న వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
*గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని 144వ సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్టు పరిధిలో 55 రోజుల పాటు జూలై నాలుగో తేదీ వరకు 144వ సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. పైన తెలిపిన ప్రదేశంలో 250 మీటర్ల దూరం వరకు ఐదుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది జనం గుమి గూడరాదన్నారు. నిబంధనలు అతిక్ర మించిన వారిపై చర్యలు తీసుకుంటా మని ఆయన హెచ్చరించారు.
*సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 16న మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో జరగనుంది. వంద గజాల్లోపు స్థలాలు ఆక్రమించి, ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్నవారికి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసే అంశంతో పాటు భూ కేటాయింపులు, ఇతర అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.
*ఏడీ సచివాలయంలో 11 మంది ఎస్‌వోలను ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. వీరిలో నలుగురు జేవిభాగానికి చెందిన అధికారులే ఉండటం విశేషం. బదిలీ అయిన వారి స్థానంలో ప్రభుత్వం నలుగురు ఎస్‌వోలను జేఏడీకి బదిలీ చేసింది. హోంశాఖ నుంచి ముగ్గురు, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌, ప్లానింగ్‌, డబ్ల్యూసీడీ అండ్‌ ఎస్సీ నుంచి ఒక్కొక్కరి చొపున ఇతర శాఖలకు బదిలీ చేశారు. ఈ మేరకు సీఎస్‌ ఎస్‌కే జోషి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
*బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మెబాట పట్టారు. వేతన పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 30 నుంచి 31 వరకు రెండు రోజులపాటు సమ్మె చేయనున్నట్లు బ్యాంక్ ఉద్యోగుల సంఘ ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. దీంతో బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ నెల 5న యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్(యూఎఫ్‌బీయూ)కు యాజమాన్య సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలంకావడంతో సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధి ఒకరు తెలిపారు.
* రాష్ట్ర దేవాదాయశాఖ మాజీ మంత్రిఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు కారులో బాంబు ఉందంటూ శుక్రవారం తాడేపల్లిగూడెంలో కలకలం రేగింది. బాంబు ఉందంటూ కొందరు మీడియా ప్రతినిధులు చెప్పడంతో పట్టణ పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎ్‌సఎన్‌ మూర్తిఎస్‌ఐ కేవి రమణ తనిఖీలు చేశారు. చివరకు బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ,ఏపీలో వేర్వేరుగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బార్ కౌన్సిల్‌కు ఎన్నిక జరగడం ఇదే తొలిసారి నామినేషన్ల స్వీకరణ జరగనుంది.
*ఏపీ ఐసెట్ ఫలితాలు శనివారం మంత్రి ఘంటా శ్రీనివాసరావు విడుదల చేసారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com