నేటి తాజా వార్తలు-05/24

* మంత్రి కేటీఆర్ ఇవాళ బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అడ్వాన్స్డ్ బోన్ మ్యారో యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు, బసవతారకం ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
* అవినీతికి పాల్పడుతూ నల్లగొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ సీఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సీఐ వెంకటేశ్వర్లు రూ. 9600 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. పెద్దఅడిశర్లపల్లికి చెందిన గీతకార్మికుల నుంచి సీఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు
* పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష చేపట్టారు. జూన్ 10 నాటికి పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు తెలిపారు. రిజర్వ్ సర్పంచ్ స్థానాల సంఖ్యను జిల్లాలవారీగా పంచాయతీరాజ్ కమిషనర్ ప్రకటించనున్నారు. జిల్లాస్థాయిలో రిజర్వ్ వార్డు మెంబర్ల సంఖ్యను కలెక్టర్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
* జూన్ 10 నాటికి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్దమవుతున్నది. ఈ నెలాఖరులోగా బీసీ ఓటర్ల గణనను పూర్తి చేసి… వచ్చే నెల 10 లోపు సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.
* భూమిని అమ్ముకున్నవాళ్లు చెడిపోయారు కాని.. భూమిని నమ్ముకున్నవాళ్లు ఎప్పుడూ చెడిపోలేదని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మంత్రి ‘విత్తన మేళా 2018’ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు, రైతులు పాల్గొన్నారు.
* పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష చేపట్టారు. జూన్ 10 నాటికి పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు తెలిపారు. రిజర్వ్ సర్పంచ్ స్థానాల సంఖ్యను జిల్లాలవారీగా పంచాయతీరాజ్ కమిషనర్ ప్రకటించనున్నారు. జిల్లాస్థాయిలో రిజర్వ్ వార్డు మెంబర్ల సంఖ్యను కలెక్టర్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
* 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందని తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జాతీయ రాజకీయాల్లో తెదేపా కీలక పాత్ర పోషిస్తుందని, తెదేపాను కాదని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. తనకు ప్రధాని పదవి అవసరం లేదని, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమన్నారు.
* అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ విద్యుత్ ఉప కేంద్రానికి భూమి పూజచేసేందుకు వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది.
* తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయడంలేదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ మండిపడ్డారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా గన్మెన్లను కేటాయించాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
* తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో ఇసుక దుమారం రేగింది. జిల్లాలో ఇసుక తవ్వకాలపై వైకాపా సభ్యులు లేవనెత్తిన అంశం గొడవకు దారితీసింది. జిల్లాలో ఉచిత ఇసుక అమలు కావడం లేదని.. ప్రవేటు సంస్థలకు ఇసుకను ధారదత్తం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్ లేవనెత్తారు.
* ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. తెదేపా పుట్టిన నాటి నుంచి బడుగుల అభివృద్ది కోసమే పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న మహానాడులో రమణ ప్రసంగించారు.
* స్వేచ్ఛామాత పుట్టిన నేల శ్రీకాకుళం అని, భరతమాతకు గుడి ఉన్న ఏకైక నేల శ్రీకాకుళం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సైనికుడు కనబడతాడని, జైహింద్ అంటాడని తెలిపారు.
* తెలంగాణ తెదేపా మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ సమాధి వద్ద తెలంగాణ తెదేపా నాయకులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందని పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
* తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జేఎన్డీయూ-హెచ్ ప్రాంగణంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య టి. పాపిరెడ్డి విడుదల చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 9న ఈ సెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 76 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.
* గవర్నర్ నరసింహన్ దంపతులు మూడ్రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్ అధికారులతో చర్చించారు. నిధులు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలంటూ ఆదేశించారు.
* తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన బి.కరుణాకరరెడ్డి రూ.కోటి విరాళాన్ని బుధవారం సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మందిరంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజును కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను కుటుంబసభ్యులతో కలిసి అందచేశారు. ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర విద్యాదానం ట్రస్టు కింద డిపాజిట్ చేయాలని దాత సూచించారు.
* కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. రాంనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్ దత్తాత్రేయను కలిశారు. నిన్న బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.
* పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నిట్టనిలువునా ముంచిన నీరవ్‌మోదీపై ఈడీ తొలిఛార్జిషీట్ను దాఖలు చేసింది. నీరవ్‌తోపాటు ఆయన సహచరుల పేర్లను కూడా దీనిలో చేర్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 12 వేల పేజీల ఛార్జిషీట్‌ను ఈడీ నేడు కోర్టుకు అందజేసింది.
* హైదరాబాద్ నగరంలో గాలి, వాన బీభత్సం సృష్టించింది. దీంతో మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో పలు చోట్ల గాలి తీవ్ర దుమారం రేపింది. కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో భారీ వర్షంతో పాటు గాలి బలంగా వీయడంతో కూకట్‌పల్లిలో ఓ ఫ్లెక్సీ ఎగిరిపడి మెట్రో విద్యుత్ తీగల మీద పడింది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మియాపూర్-అమీర్‌పేట మధ్య మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
* కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సగటు మనిషిపై కేంద్రం భారం మోపిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి ప్రజల బాగోగులు పట్టడం లేదని దుయ్యబట్టారు. పన్నుల పేరుతో కేంద్రం దోచుకుంటోందని పంచుమర్తి అనురాధ విమర్శించారు.
* తిరుమల తిరుపతి దేవస్థానంపై రాజకీయ విమర్శలు సరికావని టీడీపీ ఎంపీ మురళీమోహన్ హితవు పలికారు. గతంలో ఏడు కొండలు వద్దని.. రెండు చాలన్న వ్యక్తి పంచభూతాల సాక్షిగా గాల్లో కలిసిపోయాడన్నారు. తిరుమల జోలికి వస్తే మోదీకి అదే గతి పడుతుందని మురళీమోహన్ హెచ్చరించారు
* తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో విభేదాల కారణంగా సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులకు రావడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి ఆదేశాలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
* తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో విభేదాల కారణంగా సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులకు రావడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యానించారు.
* టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. నల్లగొండ నియోజకవర్గం ఇరుగంటి పల్లి, తంగళ్లవారి గూడెంకు చెందిన సుమారు 200మంది కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ktr-ntr-basavatarakam-tnilive

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com