నేటి తాజా వార్తలు -07/04

*గుంటూరు జిల్లా యడ్లపాడులో మండలం ఉన్నావా గ్రామంకు చెందిన వంద వైకాపా కుటుంబాల వారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెదేపాలో చేరారు.
* కృష్ణా జిల్లాలోని నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పీపీపీ విధానంలో రూ. కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. డయాలసిస్ చేయించుకున్న వారికి ఉచిత మందులు, నెలకు రూ. 2500 పింఛన్ అందిస్తామని మంత్రి ప్రకటించారు.
* ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఈనెల 7న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయిస్తా+రు. ఈ కార్యక్రమ నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అతిథులకు ఆహ్వానం, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత, అలంకరణలు తదితర అంశాలపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
* బెంగళూరు పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామిని కలిశారు. ఈ ఉదయం భేటీలో భాగంగా ఇరువురు కలిసి అల్పాహారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాలను మంత్రిఈ సందర్భంగా వివరించారు. సీఎం కుమారస్వామి వినయం, సాధారణంగా ఉండే తత్వం తనను ఆకట్టుకున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
* చందనసీమకు చెందిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, సాహితీవేత్త హంసలేఖను, ప్రఖ్యాత నాటకరంగ కళాకారిణి అరుంధతినాగ్‌లను 2018 సంవత్సరానికి గాను ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాలకోసం ఎంపిక చేశారు. 6వతేదీన వారికి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
* నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహరికోట నుండి ప్రయోగించే రాకెట్లు విజయవంతం కావాలంటూ ఆలయంలో పూజలు చేశారు. నూతన సాంకేతిక వ్యవస్థను చేజిక్కించు కోవడమే ప్రధాన ఉద్దేశంతో రేపు శ్రీహరికోటలో ఇస్రో కొత్త ప్రయోగ వ్యవస్థపై పరిశోధన చేపట్టనుంది.
* చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 27న సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ వేకువజామున 4.15 గంటల వరకు మూసివేయనున్నట్లు తితిదే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రోజు రాత్రి 11.54 గంటల నుంచి 28న తెల్లవారు జామున 3.49 గంటల వరకు చంద్రగ్రహణం ఘడియలు ఉంటాయి. గ్రహణం పట్టే సమయానికి 6 గంటల ముందుగానే ఆలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీ. గ్రహణం అనంతరం వేకువ జామున 4.15 గంటలకు మందిరం తలుపులు తెరిచి సుప్రభాత సేవ అనంతరం శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. తర్వాత తోమాల, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా పూర్తి చేస్తారు. 28న స్వామివారికి ఉదయపు సేవలు పూర్తయ్యాక ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. 27న శ్రీవారికి కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, గరుడవాహన సేవలను తితిదే రద్దు చేసింది.
* కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్ము-కశ్మీరులో ఈనెల 4 నుంచి రెండురోజుల పాటు పర్యటిస్తారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొబాల్‌ కూడా రాజ్‌నాథ్‌ సింగ్‌ వెంట కశ్మీరుకు వెళతారు. ఆ రాష్ట్రంలో భద్రతా పరిస్థితిని శ్రీనగర్‌లో జరిగే అత్యున్నత స్థాయి సమావేశంలో హోంమంత్రి సమీక్షిస్తారు. అమర్‌నాథ్‌ యాత్రపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు.
*ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటకల మధ్య సరిహద్దులను ఈ నెల 27 కల్లా తేల్చాలని సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
* జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి జులై 15వ తేదీలోపు కేంద్ర మానవ వనరుల శాఖకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌ అధర్‌ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. 2017 సంవత్సర పురస్కారాలకు www.mhrd.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
* తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వి.నిరంజన్‌రావు పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాదికి పొడిగించింది. ఆయన పదవీకాలం ఈ ఏడాది జూన్‌తోముగిసింది. దీంతో పదవీ కాలాన్ని ఏడాది పొడిగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అనుమతి కోరింది. అందుకు హైకోర్టు సానుకూలంగా స్పందించడంతో సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
* వంశపారంపర్య అర్చకుల పేర్ల నమోదు కార్యక్రమం ఈ నెల 6 నుంచి చేపట్టనున్నారని, దీనికోసం దేవదాయశాఖ ఏర్పాట్లు చేసిందని ఏపీ అర్చక సమాఖ్య కార్యదర్శి జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి సోమవారం గుంటూరులో తెలిపారు.
*తెలంగాణలోని ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లు తమకు బకాయిలు చెల్లించనందుకు ఆ 2 కంపెనీలు దివాలా తీసినట్లుగా ప్రకటించాలని కోరుతూ ఏపీ జెన్‌కో వేసిన పిటిషన్‌పై ఈనెల 23న నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్సీఎల్టీ) హైదరాబాద్‌ బెంచ్‌ తుది వాదనలు విననుంది.
*లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు లా కమిషన్‌ సిద్ధమవుతోంది. ఈ వారంలో అన్ని ప్రధాన పార్టీలతో రెండు రోజుల పాటు సంప్రదింపులు జరపనుంది. ఈ మేరకు ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న సమావేశానికి రావాలని ఏడు జాతీయ పార్టీలకు, 59 ప్రాంతీయ పార్టీలకు లేఖ రాసింది. లా కమిషన్‌ నుంచి తమకు ఆహ్వానం అందిందని కాంగ్రెస్‌ వర్గాలు ధ్రువీకరించాయి.
*ఈనెల 5వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్‌ నూతన గృహప్రవేశ మహోత్సవం నిర్వహిస్తామని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన సోమవారం ఆర్డీవోలు, స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఎన్టీఆర్‌ నూతన గృహప్రవేశ మహోత్సవం ఫేస్‌-2 కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి హాజరవుతారని, జిల్లాలో 20,109 ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తారని కలెక్టర్‌ తెలిపారు.
*ఈనెల 6న డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు, కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. ఆయనతోపాటు ఏఐసీసీ కార్యదర్శులు క్రిస్టఫర్‌, మరియప్పన్‌, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పర్యటిస్తారని ఏపీసీసీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు తదితర అంశాలపై ఊమెన్‌చాందీ సమీక్షించనున్నారు.
*ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు, కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు.
*మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బీచ్‌రోడ్డులో ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు బుధవారం నివాళులర్పించారు. మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, ఎంపీ అవంతి శ్రీనివాస్‌, ఎంవీఎస్‌ మూర్తి, సుబ్బారాయుడు అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
* రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ మంగళవారం ధర్నా నిర్వహించింది. గురువారం(5న) విద్యాసంస్థల బంద్‌ను పురస్కరించుకుని బషీర్‌బాగ్‌లోని డీఈవో కార్యాలయం ఎదుట ఈ ధర్నా చేపట్టారు. విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో జావేద్‌, అంజి(ఎస్‌ఎఫ్‌ఐ), చాణిక్య(ఏఐఎస్‌ఎఫ్‌), ఎం.సత్యనారాయణ(ఏఐడీఎస్‌వో), నాగరాజు, రియాజ్‌, స్వాతి(పీడీఎస్‌యూ) పాల్గొన్నారు.
*టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.
*ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఈ నెల 7న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్‌ ఎస్‌కే జోషి మంగళవారం ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది జనవరిలో కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు ఇటీవల ఆమోదం తెలిపిన కేంద్రం ఫైల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వద్దకు పంపింది. ఆ ఫైల్‌పై ఆదివారం రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు.
*రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జాతీయ పురస్కారానికి ప్రముఖ వయొలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామిని ఎంపిక చే సినట్లు శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు.
* భువనగిరి పురపాలక ఛైర్‌పర్సన్‌ లావణ్యపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు బుధవారం అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు.
*విశాఖ సీతమ్మ దారలో జనసేన నూచర్యలు తీసుకోవాలని తన కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్.
*తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణల పై కటిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యు శాఖా మంత్రి కృష్ణమూర్తి ఆదేశించారు.
*అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రాష్ట్ర రహదారుల, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు బీచ్ రోడ్ లోని పార్క్ హోటల్ కు ఎదురుగా ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
*రామచంద్రా పురం నియోజకవర్గం కుయ్యేరు నుండి ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర.
* ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో రూ. 6 లక్షలతో ఏర్పాటు చేసిన మాడల్ కిచన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ప్రారంభించారు. కార్పోరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్‌గౌడ్, ఆలయ ఈఓ అన్నపూర్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. అమ్మవారికి సొంత నిధులతో డైమండ్‌తో కూడిన ఖడ్గం, ముక్కుపుడక, బొట్టు సమర్పిస్తామని తెలిపారు. అదేవిధంగా 250 కిలోల వెండితో గర్భగుడికి వెండి తాపడం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సారి జాతరను ఘనంగా నిర్వహించనునున్నట్లు.. అమ్మవారికి బంగారం బోనం సమర్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
* పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమం రసాభాసగా ముగిసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రిని ప్రారంభించేందుకు మంత్రి అమర్ నాథ్ రెడ్డి వచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ సరస్వతి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా కూడా పాల్గొన్నారు. అయితే కొందరు టీడీపీ కార్యకర్తలు జై ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఇందుకు పోటీగా వైసీపీ కార్యకర్తలు జై రోజా అంటూ నినాదాలు చేశారు. చివరికి నేతలు సర్ది చెప్పడంతో ఈ కార్యక్రమం ముగిసింది.
* విభజన చట్టం హామీల్లో ఒకటైన రైల్వేజోన్ కోసం టీడీపీ ఎంపీలు ఒక రోజు దీక్ష దిగారు. విశాఖలో ఎంపీలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్ష చేపట్టారు. రైల్వేస్టేషన్‌లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ పోరాటంతో రైల్వే జోన్ అంశంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని టీడీపీ భావిస్తోంది
* నెల్లూరు జిల్లాకు పోర్టు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కావలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ గ్రామస్థాయిలో జరిగే అభివృద్ధికి ప్రతి పైసా కేంద్రం ఇస్తుంటే… పేరుమాత్రం రాష్ట్రానిదా అంటూ ప్రశ్నించారు.
* రైతన్నలకు శుభవార్త. వరి సహా ఖరీప్ పంటల కనీస మద్దతు ధరను పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్‌ వరిపై మద్దతు ధర రూ.200 వరకు పెరిగింది. మొత్తం 14 ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధరను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
* దేశ రాజధాని దిల్లీలో గత మూడేళ్లుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ప్రభుత్వం మధ్య తలెత్తిన అధికారాల వివాదంలో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే నిజమైన అధికారమని తేల్చింది.
* అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ బాగా పెరగడంతో ఈరోజు పసిడి ధర పెరిగింది. నేటి బులియన్‌ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.210 పెరిగి రూ.31,570గా ఉంది. దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి.
* కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తన భార్య సునంద పుష్కర్‌ మృతి కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ కోరిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. అయితే శశిథరూర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే ఆయన దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని విచారణ సందర్భంగా దిల్లీ పోలీసులు కోర్టును కోరారు. వాదోపవాదాలు విన్న అనంతరం ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ తీర్పును రిజర్వ్‌లో పెట్టారు. దీనిపై గురువారం తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com