నేటి తాజా వార్తలు -07/09

*కేంద్ర ప్రభుత్వ కుట్ర రాజకీయాలపై తెదేపా పోరాటంలో భాగంగా ఈ నెల 11న పార్టీ ఎంపీలు అనంతపురంలో దీక్ష చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.
* తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పపాలెం వద్ద సోమవారం ఉదయం ఓఎన్‌జీసీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీకయింది. కేశనపల్లి జీసీఎస్‌ సమీపంలోని 15వ నెంబరు బావికి చెందిన పైపులైన్‌ నుంచి గ్యాస్‌ బయటకు రావడంలో స్థానికులు భయాందోళన చెందారు.
* దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణాల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఆహారం. ఏ రైల్లో ఎలాంటి వంటకాలు ఉంటాయో తెలియదు. అల్పాహారం, భోజనం అందించాక కేటరింగ్‌ సిబ్బంది అధిక ధరలు వసూలు చేస్తున్నారేమో అన్న సందేహం మరోవైపు ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ భారతీయ రైల్వే, ఐఆర్‌సీటీసీ కలిసి ప్రత్యేక యాప్‌ తీసుకువచ్చాయి. ‘మెనూ ఆన్‌ రైల్స్‌’ యాప్‌తో రైళ్ల వారీగా అందించే వంటకాలు, వాటి ధరలను తెలుసుకోవచ్చు. సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మొదలుకుని రాజధాని, దురంతో, శతాబ్ది, హమ్‌సఫర్‌, గటిమాన్‌, తేజస్‌ వంటి అత్యాధునిక రైళ్లలో లభించే వంటకాల మెనూ వివరాలు ఈ యాప్‌లో ఉన్నాయి.
*ఆంధ్రప్రదేశ్‌ సర్వే ఉద్యోగుల సంఘ ఎన్నికల ప్రక్రియను జులై, ఆగస్టు నెలల్లో నిర్వహించనున్నట్లు సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.చిరంజీవిరావు తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఎన్నికల ప్రకటన జారీ చేస్తారు.
*రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 16న రెండో జాబితా విడుదల చేయనున్నట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం కన్వీనర్‌ ఎస్‌.ఎస్‌.వి.గోపాల్‌రాజు తెలిపారు.
*డీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 11 నుంచి 14 వరకూ వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని డీసెట్‌ కన్వీనర్‌ పి.పార్వతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీట్ల కేటాయింపు ఈ నెల 16 నుంచి 18 తేదీల్లో చేపట్టనున్నామని, 19న కేటాయింపు పత్రాలను విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. ధ్రువపత్రాల పరీశీలన ప్రభుత్వ డైట్‌ కళాశాలల్లో ఈ నెల 20 నుంచి 23 మధ్య ఉంటుందని పేర్కొన్నారు.
*భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. 13న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. షా పర్యటనను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ భాజపా ముఖ్యనేతలు ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
*నవ్యాంధ్రప్రదేశ్‌, రాజధాని అమరావతి నిర్మాణంలో తమకు సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌ వేదికగా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. అత్యుత్తమ జీవన ప్రమాణాల కేంద్రంగా, సంతోష సూచీలో అగ్రగామిగా, ఆర్థిక కార్యకలాపాలకు వేదికగా దీన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
*టీఎస్‌ ఈసెట్‌-2018 తుదిదశ కౌన్సెలింగ్‌ ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. అభ్యర్థులు 12 నుంచి 13వ తేదీ వరకు ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసి, ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ రుసుము చెల్లించాలి. 13న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
*బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని దేవాలయాలకు ఆర్థిక సాయం అందిస్తామని, నిర్వాహక కమిటీల వారు ఈనెల 12లోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్పవ కమిటీ ఛైర్మన్‌, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. శనివారం సచివాలయంలో ఆయన బోనాలపై సమీక్ష నిర్వహించారు.
*ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఈనెల 18న ఈవెంట్లు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఉదయం 5 గంటలకు శామీర్‌పేట నుంచి మునీరాబాద్‌ అవుటర్‌ రింగురోడ్డుకు చేరుకోవాలని పేర్కొంది. అర్హులైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచామని వివరించింది.
*పశువైద్య సహాయకుల పోస్టుల రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల విద్యార్హతల అసలు ధ్రువీకరణ పత్రాల పరిశీలనను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తామని పశుసంవర్థకశాఖ సంచాలకుడు డాక్టర్‌ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పశువైద్య పాలిటెక్నిక్‌ కోర్సు అభ్యర్థులకు ఈ నెల 9న, ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సువారి పత్రాలను 10న పరిశీలిస్తామన్నారు.
* వైద్య విధాన పరిషత్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ (సీఏఎస్‌) స్పెషలిస్టులు, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (డీఏఎస్‌) పోస్టులకు ఈనెల 12, 13 తేదీల్లో మూడోవిడత ధ్రువ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10గం.లకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని పేర్కొంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచామని సూచించింది.
*పశువైద్య సహాయకుల పోస్టుల రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల విద్యార్హతల అసలు ధ్రువీకరణ పత్రాల పరిశీలనను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తామని పశుసంవర్థకశాఖ సంచాలకుడు డాక్టర్‌ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పశువైద్య పాలిటెక్నిక్‌ కోర్సు అభ్యర్థులకు ఈ నెల 9న, ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సువారి పత్రాలను 10న పరిశీలిస్తామన్నారు.
*టీఎస్‌ ఈసెట్‌-2018 తుదిదశ కౌన్సెలింగ్‌ ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. అభ్యర్థులు 12 నుంచి 13వ తేదీ వరకు ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసి, ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ రుసుము చెల్లించాలి. 13న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఐచ్ఛికాలను 15లోగా నమోదు చేసుకోవాలి. 17న సీట్లు కేటాయించి, వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 19లోగా బోధనా రుసుము చెల్లించి, వెబ్‌సైట్‌ ద్వారా రిపోర్ట్‌ చేయాలి.ఇంతకు ముందు కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా కోర్సులో చేరడానికి ఆసక్తి చూపనివారు, ధ్రువపత్రాల పరిశీలన పూర్తై సీటు రానివారు, ఐచ్ఛికాలు నమోదు చేసుకోనివారు, సీటు పొందినా మెరుగైన కళాశాలలో ప్రవేశం ఆశిస్తున్నవారు కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చు. పూర్తి వివరాలకు https://tsecet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఈసెట్ కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ సూచించారు.
*తెలుగు రాష్ర్టాల్లోని ఎంపిక చేసిన ఆలయాల్లో ‘మనగుడి’ కార్యక్రమాన్ని ఆగస్టు 23నుంచి 26వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. శనివారం తిరుపతి శ్రీపద్మావతి అతిథి గృహంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలతో ఎస్వీబీసీలో ధర్మపరిచయం కార్యక్రమం ద్వారా ప్రవచనాలు చేయించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కాగా.. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 10నుంచి ఆగస్టు 9వరకు ఇక్కడ మరమ్మతులు జరుగనున్నాయి.
*శ్రీ సింహవాహినీ మహంకాళి (లాల్ దర్వాజ) బోనాల జాతర సందర్భంగా హైరదాబాద్ పాతనగర రచయితల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈనెల 17న కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఆ సంఘం కో ఆర్డినేటర్లు జి.మహేష్ గౌడ్, చింతపట్ల సుదర్శన్ తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన సా యంత్రం 4 గంటలకు ఈ కవి సమ్మేళనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కవిసమ్మేళనంలో ప్రముఖ కవులు నెల్లుట్ల రమాదే వి, శోభా పేరిందేవి, చీదెళ్ల సీతాలక్ష్మి, దూర విజయలక్ష్మి, సుమి త్రాదేవి, చింతపట్ల కె. హరనాథ్, కన్నోజు లక్ష్మీకాంతం,తదితరులు కవిత్వ పఠనం చేస్తారని పేర్కొన్నారు.
* బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
*జమిలి ఎన్నికలకు తెరాస పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. జమిలి ఎన్నికలపై సాధ్యాసాధ్యాలపై జాతీయ లా కమిషన్‌ వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈమేరకు తెరాస పార్టీ ప్రతినిధిగా వినోద్‌ కుమార్‌ ఈ రోజు లా కమిషన్‌ ముందు హాజరై పార్టీ అభిప్రాయాన్ని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ‘‘2019 నుంచి జమిలి ఎన్నికలకు తెరాస అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదలు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అన్న క్యాంటిన్లు ఈ నెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. 13 జిల్లాల్లోని 38 పురపాలక, నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా వంద క్యాంటిన్లను 11న ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
*తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేశ్‌ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
* ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక(అట్రాసిటీ) చట్టాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 21న రాజధానిలోని నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మంగళగిరి వరకు వేలాది మందితో మిలియన్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ తెలిపారు. దళితులకు రక్షణ కవచంలా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భాజపా అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com