నేటి తాజా వార్తలు -07/10

* వాజేడు మండలం, పీకుపల్లి అటవి ప్రాంతంలోని బొగత జలపాతం పకృతి ప్రేములను కనువిందు చేస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరదనీటి ఉధృతి పెరగడంతో బొగత జలపాతం ఎగిసిపడుతోంది.
* అమరనాథ్ యాత్రలో ఏపీ వాసి దుర్మరణం పాలైయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామానికి చెందిన గన్నమని కోటేశ్వరరావు గుండెపోటుతో చనిపోయాడు. ఐదు రోజుల కిృతం స్నేహితులతో కలిసి అమరనాథ్ యాత్రకు వెళ్లారు. దర్శనం అనంతరం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలో గుండెపోటు రావడంతో కోటేశ్వరరావు మృతి చెందాడు. పార్థివ దేహం మంగళవారం రాత్రి విశాఖపట్నం చేరుకుంటుందని, బుధవారం ఉదయానికి అతని స్వగ్రామానికి చేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరరావు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
*తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 1 నుంచి రెరా కార్యక్రమాలు ప్రారంభించడానికి పురపాలకశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ చట్టం పరిధిలో కీలకమైన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆ వెంటనే రెరా పనిచేయడం ప్రారంభమైనట్లే అని పురపాలకశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
*చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల 27న కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీరామచంద్రమూర్తి సోమవారం తెలిపారు. గ్రహణం రోజు ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు సర్వదర్శనం, నిత్య అభిషేకాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయంతో పాటు ఉపాలయాలైన సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు.
* పోలీసు ఉద్యోగాల రాత పరీక్షలకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తేదీలు ప్రకటించింది. ఆగస్టు 26 నుంచి రాత పరీక్షలను నిర్వహించనుంది.
* కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 11న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు రానున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెప్పారు. ప్రాజెక్టు పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్పిల్‌వేలో అంతర్భాగం అయిన గ్యాలరీలో నడకకు సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.
*దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల ఛైర్మన్ల సదస్సు విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్టు విశాఖ నౌకాశ్రయ ఛైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు వెల్లడించారు. సోమవారం విశాఖలోని పోర్టు అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
*నిషిద్ధ భూములు, చుక్కల భూముల పరిష్కారం కోసం తలపెట్టిన గ్రామ సభల నిర్వహణను ఈ నెల 20వరకు పొడిగించారు. తొలుత నిర్ణయించిన ప్రకారం గతనెల 20 నుంచి మొదలై ఈ నెల 5తో సభలు ముగిశాయి.
*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వివిధ ట్రస్టులకు సోమవారం రూ.1.38 కోట్ల విరాళాలు వచ్చాయి. ప్రాణదానం ట్రస్టుకు రూ.53.69 లక్షలు, సర్వశ్రేయ ట్రస్టుకు రూ.12 లక్షలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.66 లక్షలు, గోసంరక్షణకు రూ.2 లక్షలు, విద్యాదానం ట్రస్టుకు రూ.3.5 లక్షలు, బర్డ్‌కు రూ.లక్ష వంతున విరాళాలు డిపాజిట్‌ అయ్యాయి. 12 మంది భక్తులు విరాళాలు సమర్పించారు. తిరుమలలోని తితిదే దాతల విభాగంలో అధికారులను కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను యాత్రికులు సమర్పించారు. దాతలను తితిదే అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లాలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉన్నత విద్యలో ప్రపంచంలో వస్తున్న మార్పులపై విద్యార్థులతో సీఎం ముచ్చటించనున్నారు.
* చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల 27న కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీరామచంద్రమూర్తి సోమవారం తెలిపారు. గ్రహణం రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళ వాయిద్యాలు, 4కు సుప్రభాత సేవ, 5కు మంగళ హారతులు, ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు సర్వదర్శనం, నిత్య అభిషేకాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు.
* కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం తెలుగుదేశం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఎంపీలు నిరసన తెలియజేయనున్నారు. వీరికి మద్దతుగా కడప జిల్లా నుంచి అఖిలపక్ష బృందం ఈ నెల 23న దిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవనుంది. లోక్‌సభలో పార్టీ ఎంపీలు ఉక్కు పరిశ్రమ కోసం పట్టుబట్టనుండగా, వీరికి మద్దతుగా దిల్లీలో అఖిలపక్షం ఆధ్వర్యంలోనూ తెలుగుదేశం నిరసన చేపట్టాలని భావిస్తోంది.
* తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున స్వామివారికి సుప్రభాతం నిర్వహించిన అనంతరం మూలవిరాట్‌ను పట్టు పరదాతో పూర్తిగా కప్పివేశారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి, ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజా సామాగ్రి తదితర వస్తువులను అర్చకులు, ఆలయ సిబ్బంది శుభ్రం చేశారు.
* ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద నీరు అధికంగా రావడంతో.. భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. ఇవాళ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 26.3 అడుగులకు చేరింది. గోదావరిలోకి ప్రజలు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరు కూడా గోదావరిలో కలిసిపోతుంది. దీంతో గోదావరికి వరద ప్రవాహం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు.
* సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కొచ్చాడయాన్ సినిమాకు సంబంధంచిన కర్నాటకలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది.
* రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల అంశంపై అదనపు అడ్వకేట్ జనరల్, అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది.
* హుస్నాబాద్ పురపాలక సంఘం ఏఈ రాజేశం.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. గుత్తేదారు లక్ష్మీనారాయణ నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రాజేశంను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజేశం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
* విజయవాడ నుంచి ముంబయి ప్రయాణిస్తున్న విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి బయల్దేరిన ఎయిర్‌ ఇండియా ఎక్స్ ప్రెస్‌ IX 213 విమానం మధ్యాహ్నం 2.51 నిమిషాలకు ముంబయి విమానాశ్రయంలో రన్‌వేపై దిగింది. ఈ క్రమంలో విమానం అదుపు తప్పి రన్‌వేపై జారింది.
* రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు అకస్మాత్తుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఈ రోజు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రామగుండం మేయర్‌ అవిశ్వాస తీర్మానం, రాజకీయాల నుంచి తాను తప్పుకొనే అంశాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే, రాజకీయాల్లో తనకు ఉన్న ఇబ్బందులు, సమస్యలను కూడా ఆయన కేటీఆర్‌కు వివరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com