నేటి తాజా వార్తలు -07/12

* తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ తన కార్యకలాపాలను ఈ నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌ డ్రగ్‌ కంట్రోల్‌ కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించనుంది. ఈ మేరకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ పోల నాగరాజు, కౌన్సిల్‌ ఇన్‌ఛార్జి ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రవిశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
* గ్రామ పంచాయతీ ఉద్యోగులుకార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక జేఏసీ నిర్ణయించింది.
* విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఈ విభాగం డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఏ.ఆర్‌.అనూరాధ నుంచి ఈ బాధ్యతలు స్వీకరించారు.
* దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తే దీ నుంచి లారీల నిరవధిక బంద్‌ చేపట్టనున్నట్లు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు తెలిపారు.
*బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రేపు నగరానికి రానున్నారు. ఈ క్రమంలో అమిత్ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. రేపు ఉదయం ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో అమిత్‌షా సమావేశమవుతారని చెప్పారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్కోర్ కమిటీకార్యకర్తల సమావేశాలలో అమిత్ పాల్గొంటారని తెలిపారు. కార్యకర్తలకు అమిత్‌షా దిశానిర్ధేశం చేస్తారని ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు.
* వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ప్రియుడితో కలిసి ఏకంగా కన్నతండ్రినే మట్టుపెట్టిన దారుణాన్ని పోలీసులు బయటపెట్టారు. నూజివీడులో హత్య చేసి వంద కిలోమీటర్లు దూరం తీసుకొచ్చి నిమ్మగడ్డ వద్ద మృతదేహాన్ని పడేసి ప్రమాదంగా సృష్టించాలని చేసిన ప్రయత్నాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పట్టించింది. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌కు నిందితులు అడ్డంగా దొరికిపోయారు.
*కాంగ్రెస్‌ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఆవుల సీతారామయ్య(57) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఈ నెల 6వ తేదిన విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వైపు ద్విచ క్రవాహనంపై మరొక వ్యక్తితో కలిసి వస్తుండగా హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భవానిపురం దర్గా వద్ద వరాహాంను ఢీ కొని అదుపు తప్పి కింద పడిపోయా డు
*తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 1 నుంచి రెరా కార్యక్రమాలు ప్రారంభించడానికి పురపాలకశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ చట్టం పరిధిలో కీలకమైన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆ వెంటనే రెరా పనిచేయడం ప్రారంభమైనట్లే అని పురపాలకశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
*చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల 27న కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీరామచంద్రమూర్తి సోమవారం తెలిపారు. గ్రహణం రోజు ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు సర్వదర్శనం, నిత్య అభిషేకాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయంతో పాటు ఉపాలయాలైన సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు.
* పోలీసు ఉద్యోగాల రాత పరీక్షలకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తేదీలు ప్రకటించింది. ఆగస్టు 26 నుంచి రాత పరీక్షలను నిర్వహించనుంది.
* కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 11న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు రానున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెప్పారు. ప్రాజెక్టు పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్పిల్‌వేలో అంతర్భాగం అయిన గ్యాలరీలో నడకకు సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.
*దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల ఛైర్మన్ల సదస్సు విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్టు విశాఖ నౌకాశ్రయ ఛైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు వెల్లడించారు. సోమవారం విశాఖలోని పోర్టు అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
*నిషిద్ధ భూములు, చుక్కల భూముల పరిష్కారం కోసం తలపెట్టిన గ్రామ సభల నిర్వహణను ఈ నెల 20వరకు పొడిగించారు. తొలుత నిర్ణయించిన ప్రకారం గతనెల 20 నుంచి మొదలై ఈ నెల 5తో సభలు ముగిశాయి.
*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వివిధ ట్రస్టులకు సోమవారం రూ.1.38 కోట్ల విరాళాలు వచ్చాయి. ప్రాణదానం ట్రస్టుకు రూ.53.69 లక్షలు, సర్వశ్రేయ ట్రస్టుకు రూ.12 లక్షలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.66 లక్షలు, గోసంరక్షణకు రూ.2 లక్షలు, విద్యాదానం ట్రస్టుకు రూ.3.5 లక్షలు, బర్డ్‌కు రూ.లక్ష వంతున విరాళాలు డిపాజిట్‌ అయ్యాయి. 12 మంది భక్తులు విరాళాలు సమర్పించారు. తిరుమలలోని తితిదే దాతల విభాగంలో అధికారులను కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను యాత్రికులు సమర్పించారు. దాతలను తితిదే అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లాలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉన్నత విద్యలో ప్రపంచంలో వస్తున్న మార్పులపై విద్యార్థులతో సీఎం ముచ్చటించనున్నారు.
* చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల 27న కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీరామచంద్రమూర్తి సోమవారం తెలిపారు. గ్రహణం రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళ వాయిద్యాలు, 4కు సుప్రభాత సేవ, 5కు మంగళ హారతులు, ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు సర్వదర్శనం, నిత్య అభిషేకాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు.
* రాష్ట్రవ్యాప్తంగా 16,781 మంది విద్యావాలంటీర్ల నియామకానికి 13 నుంచి 16 వరకు దరఖాస్తుల ప్రక్రియ సాగనుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు విజయ్‌కుమార్‌ డీఈఓలను ఆదేశించారు. cdse.telangana.gov.inవెబ్‌సైట్‌ ద్వారా ఎంఈఓలకు దరఖాస్తు చేసుకోవాలి.
* ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఈ నెల 17వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. 17న గేట్‌, జీప్యాట్‌ ర్యాంకర్లు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావొచ్చు. పీజీఈసెట్‌ ర్యాంకర్లకు 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
* తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ తన కార్యకలాపాలను ఈ నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌ డ్రగ్‌ కంట్రోల్‌ కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించనుంది.
* రైల్వే శాఖ యాత్రికుల కోసం శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌ను నడపనుంది. నవంబరు 14 నుంచి ప్రారంభం కానున్న ఈ రైలు రామాయణ ఇతిహాస ముఖ్యప్రాంతాలను చుట్టివస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com