నేటి తాజా వార్తలు -07/13

*పెళ్లి పై ఇంకా పెదవి విప్పని ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా.
*ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యారని వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి తెదేపా డైరెక్షన్ లో పని చేస్తున్నారని ఆరోపించారు.
* కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు చివరి వారంలో ప్రారంభిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గుత్తేదారులు, అధికారులతో కలిసి శుక్రవారం ఆయన ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించారు.
* వరంగల్ రూరల్‌జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లోని టీటీడబ్ల్యూఆర్‌ఎస్(తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్) పరిధిలో ఏర్పాటుచేస్తున్న గిరిజన సైనిక్‌స్కూల్‌ను ఆగస్టు15 నుంచి ప్రారంభించనున్నట్టు కర్నల్ సీఎన్‌రెడ్డి తెలిపారు. ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సైనిక్‌స్కూల్‌ను పరిశీలించారు. గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం సైనిక్‌స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నదని, త్వరలోనే డైరెక్టర్, మిలటరీ అధికారులు అందుబాటులోకి వస్తారని కర్నల్ తెలిపారు.
* ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రామదర్శిని కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈనెల 16 నుంచి గ్రామదర్శిని కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి గ్రామ దర్శిని.. పార్టీ నిర్వహించే కార్యక్రమానికి గ్రామ వికాసం పేర్లు ఖరారు చేశారు.
* గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది అందరికీ ప్రభుత్వమే ప్రత్యేక గ్రాంటు ద్వారా వేతనాలను చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) విజ్ఞప్తి చేసింది. వివిధ డిమాండ్లను నెరవేర్చాలంటూ 2015లో 44 రోజుల పాటు సమ్మె చేసినపుడు ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన వాటిలో ఒక్కటీ నెరవేరలేదని వాపోయింది. సమస్యల సాధనకు ఈనెల 23వతేదీ నుంచి సమ్మెను చేపడుతున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌కు నోటీసును అందజేసినట్లు ఐకాస ప్రతినిధి యజ్ఞనారాయణ తెలిపారు.
* సిరిసిల్ల రాజన్న జిల్లా కేంద్రంలో నెలకొల్పనున్న నర్సింగ్‌ కళాశాలలో పొరుగు సేవల్లో నియమించుకోవడానికి 41 కొత్త పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది.
*తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 1 నుంచి రెరా కార్యక్రమాలు ప్రారంభించడానికి పురపాలకశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ చట్టం పరిధిలో కీలకమైన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆ వెంటనే రెరా పనిచేయడం ప్రారంభమైనట్లే అని పురపాలకశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
*చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల 27న కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీరామచంద్రమూర్తి సోమవారం తెలిపారు. గ్రహణం రోజు ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు సర్వదర్శనం, నిత్య అభిషేకాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయంతో పాటు ఉపాలయాలైన సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు.
* పోలీసు ఉద్యోగాల రాత పరీక్షలకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తేదీలు ప్రకటించింది. ఆగస్టు 26 నుంచి రాత పరీక్షలను నిర్వహించనుంది.
* కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ నెల 11న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు రానున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెప్పారు. ప్రాజెక్టు పనులను సోమవారం మంత్రి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్పిల్‌వేలో అంతర్భాగం అయిన గ్యాలరీలో నడకకు సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.
*దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల ఛైర్మన్ల సదస్సు విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్టు విశాఖ నౌకాశ్రయ ఛైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు వెల్లడించారు. సోమవారం విశాఖలోని పోర్టు అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
*నిషిద్ధ భూములు, చుక్కల భూముల పరిష్కారం కోసం తలపెట్టిన గ్రామ సభల నిర్వహణను ఈ నెల 20వరకు పొడిగించారు. తొలుత నిర్ణయించిన ప్రకారం గతనెల 20 నుంచి మొదలై ఈ నెల 5తో సభలు ముగిశాయి.
*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వివిధ ట్రస్టులకు సోమవారం రూ.1.38 కోట్ల విరాళాలు వచ్చాయి. ప్రాణదానం ట్రస్టుకు రూ.53.69 లక్షలు, సర్వశ్రేయ ట్రస్టుకు రూ.12 లక్షలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.66 లక్షలు, గోసంరక్షణకు రూ.2 లక్షలు, విద్యాదానం ట్రస్టుకు రూ.3.5 లక్షలు, బర్డ్‌కు రూ.లక్ష వంతున విరాళాలు డిపాజిట్‌ అయ్యాయి. 12 మంది భక్తులు విరాళాలు సమర్పించారు. తిరుమలలోని తితిదే దాతల విభాగంలో అధికారులను కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను యాత్రికులు సమర్పించారు. దాతలను తితిదే అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
*ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లాలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉన్నత విద్యలో ప్రపంచంలో వస్తున్న మార్పులపై విద్యార్థులతో సీఎం ముచ్చటించనున్నారు.
* చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల 27న కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీరామచంద్రమూర్తి సోమవారం తెలిపారు. గ్రహణం రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళ వాయిద్యాలు, 4కు సుప్రభాత సేవ, 5కు మంగళ హారతులు, ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు సర్వదర్శనం, నిత్య అభిషేకాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు.
* క్రీడా కోటా వైద్య సీట్ల కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా మరో కొత్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం రెండు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఎల్‌బీ స్టేడియంలోనూ, అటు వరంగల్‌లో ఉంటున్న తెలంగాణ జూడో అసోసియేషన్‌ సెక్రటరీ కైలాస్‌ యాదవ్‌ ఇంట్లోనూ సోదాలు జరిపారు.
* జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ రవితేజ మృతి చెందాడు. టెన్త్‌ విద్యార్థినికి లవ్‌ లెటర్‌ ఇవ్వడానికి నిరాకరించాడని, రవితేజపై ఇంటర్‌ విద్యార్థి రంజిత్‌ పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో జీజీహెచ్‌కు తరలించారు. ఈనెల 7న ఘటన, చికిత్స పొందుతూ రవితేజ మృతి చెందాడు. రవితేజ ప్రకాశం జిల్లా అర్దవీడులో ఏడో తరగతి చదువుతున్నాడు.
* చట్టాలు కఠినంగా ఉన్నప్పుడే మతంపై, సంస్కృతిపై ఇష్టారాజ్యంగా దాడులు జరగవని కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఆయన శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు, అధికారులు స్వామిజీకి సాదర స్వాగతం పలికారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com