నేటి తాజా వార్తలు

*ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో తనకు అవమానం జరిగిందని విలపిస్తూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన పదవికి రాజీనామాకు ప్రయత్నించడం తెదేపాలో కలకలం రేపింది.
*వై.ఎస్.జగన్ చేస్తున్న ప్రజ సంకల్ప యాత్ర బుధవారం నాటికి 200కిలో మీటర్లు పూర్తయింది.
*మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు తెదేపా జాతీయ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.
*ముఖ్యంత్రి చంద్రబాబు ఈ నెల 26వ తేదీ ఉదయం 5:17గంటలకు శంకుస్తాపన చేస్తారు.
*ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం నాడు పుట్టపర్తికి చేరుకున్నారు. సత్యసాయిబాబా జన్మదిన వేడుకల్లో అయన పాల్గొంటారు.
*కృష్ణాజిల్లా కొండపల్లి అటవీ ప్రాంతం నుండి ఒక చిరుత పులి బయటకు వచ్చి బుధవారం నాడు కలకలం రేపింది.
*ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవాంకా ట్రంప్ దర్శనమిస్తోంది. బంగారు రంగు జుట్టుతో సినీ కవులు వర్ణనలో చెప్పాలంటే కోటేరు లాంటి ముక్కు కోలా కళ్ళు తో తెలుగు ప్రజల పేస్ బుక్ ట్విట్టర్ ఖాతాల్లో తెగ కనిపిస్తోంది. ఆమెను ఆహ్వానిస్తూ కొందరూ, రుసరుసలడురూ మరికొందరు రుసరుసలాడుతున్నారు. మరికొందరు ఆరాధనతో కవితలల్లుతూ ఇంకొందరు తమ పేస్ బుక్ వాల్ లను నిపెస్తున్నారు.ఇవాంకా రాక సందర్భంగా తెలంగాణా కట్టుదిట్టమైన భద్రతా కల్పిస్తున్నారు. గ్లోబల్ ఎంటర్ ప్రై న్యుర్ సమ్మిట్ కోసం వస్తున్న ఆమె బస చేసే హోటల్, సదస్సు జరిగే ప్రాంతం, తెలంగాణా ప్రభుత్వం ఆమెకు విందు ఇచ్చే ఫలక్ నుమా ప్యాలెస్ ప్రాంతాల్లో రోడ్ల రూపురేకలు మార్చేస్తున్నారు. ఆమె వచ్చే మార్గంలో ప్లై ఓవర్కు ముస్తాబు చేస్తున్నారు. ఆమె తిరిగే చోట చుట్టుపక్కల ఎక్కడా దోమ కూడా కనిపించకుండా పిచికరీలు చేస్తున్నారు.
*భాజాపా ఎంపి సాక్షి మహారాజ్ పేరు ఓటర్ల జాబితా నుంచి గల్లంతు అయింది. యుపీ స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు గదన్ ఖేడా పోలింగ్ బూట్ కు వెళ్ళిన సాక్షి మహాజన్ తన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో ఓటు వేయకుండానే అక్కడి నుంచి వెనుతిరిగారు.
*డిసెంబర్ 15నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
*వివాదాస్పద ఆద్యాత్మిక గురువు నిత్యానంద మరిన్ని చిక్కులు తప్పేల లేవు. తన అనుంగు శిష్యురాలు రంజితతో కలిసి సన్నిహితంగా విడియో టేపులను ఉన్నది స్వామి నిత్యానదేనని దిల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్తం చేసింది.
*భారతీయ జనతాపార్తికి చెందిన సీనియర్ నాయకులను ప్రముఖ ముఖ్యమంత్రులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి. జైషే ఏ మహమ్మద్ చీప్ మౌలాల మసూద్ అజర్ ఈ కుట్ర వెనుక ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
*తెలంగాణా విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని రాజ్ భవన్ గర్వర్నార్ నరసింహన్ ని భాజాపా నేతలు కిషన్ కిషన్ రెడ్డి చింతల రామచంద్ర రెడ్డి కల్సిఆరు. భేటి అనతరం లక్ష్మన్ మాట్లాడుతూ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలని ఇప్పటికి పద్దెనిమిది సార్లు గవర్నర్లను కలిసామని తెలిపారు.
*ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ బహిరంగ సభలో o ముస్లీం మహిళా కార్యకర్తకు చేదు అనుభవం ఎదురైంది. సభకు హాజరైన ఆ మహిళ బుర్ఖాను తొలగించామని పోలీసులు ఆదేశించారు. దీనికి సంబందించిన o విడియో కూడా బయటకు వచ్చింది. ఈ ఘటన పై బాలియా ఎస్పీ అనిల్ కుమార్ స్పందించారు. అయితే మహిళను బుర్ఖా తొలగించరన్న ఈ ఘటన పై విచారణ చేపట్టి సరైన చర్యలు తీసుకుంటామన్నారు.
* ప్రముఖ దర్శక నిర్మాత బీ. అశోక్ కుమార్ ఆర్ధిక బాధలతో ఆత్మహత్యకు పాల్పడాడు.
*ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఇంకా ఖరారు కాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్స్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై డిల్లి హై కోర్టులో నమోదైన ఒక కేసులో బుధవారం కొట్టివేశారు. రాహుల్ ఎస్.పీ.జీ భద్రతను సరిగా వినియోగించునే విధంగా చూడాలని శిరీష కు కోర్టు తీర్పు ఇచింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com