నేటి తాజా సంక్షిప్త వార్తలు-౧౧/౨౯

*పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల మంగళవారం సాయంత్రం నిలిపివేశారు. ఈ ఏడాది జూన్‌ 19న నీటి విడుదలను ప్రారంభించినట్లు ఎత్తిపోతల పథకం పర్యవేక్షణ చీఫ్‌ ఇంజినీరు ఎన్‌.రమేష్‌బాబు చెప్పారు. మొత్తం 24 పంపులు ద్వారా కృష్ణా నదికి 105.80 టీఎంసీల నీరు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. 163 రోజులకు 161 రోజులు పంపులు తిరిగాయని, మిగిలిన రెండు రోజులు కృష్ణా జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా నిలిపివేసినట్లు సీఈ తెలిపారు. విద్యుత్తు బిల్లు సుమారు రూ.167 కోట్ల వరకూ రావొచ్చని, బిల్లు రావాల్సి ఉందన్నారు.
*రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గత ఆరు నెలల్లో 4,067 రకాల అనుమతులను నిర్ణీత గడువులోగా ఇచ్చామని పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ వెల్లడించారు. అన్ని జిల్లాల జనరల్‌ మేనేజర్లతో మంగళవారం సమీక్షించారు.
*విశ్వవిద్యాలయాల్లో నియామకాలు, కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెల 2న సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్ణయించారు. సచివాలయంలో మంగళవారం ఆయన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు.
*లోక్‌సభ నూతన సెక్రెటరీ జనరల్‌గా ప్రప్రథమంగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మధ్యప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్నేహలతా శ్రీవాస్తవ డిసెంబరు ఒకటిన బాధ్యతలు స్వీకరిస్తారు. ఏడాది కాలం ఆ పదవిలో కొనసాగుతారు. ఆమె గతంలో రాజ్యసభకూ తొలి మహిళా సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు.
*‘మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఎమ్‌ఐఎమ్‌)’ కోర్సులను అందిస్తోన్న అత్యుత్తమ 50 విశ్వవిద్యాలయాల జాబితాలో.. భారత్‌కు చెందిన మూడు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్‌, కోల్‌కతాలోని ఐఐఎమ్‌లు వరుసగా 22, 23, 46వ స్థానాల్లో నిలిచాయి.
*ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రజతం సాధించింది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరుగుతున్న టోర్నీలో జ్యోతి.. అభిషేక్‌ వర్మతో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో జ్యోతి-అభిషేక్‌ జోడీ 153-157తో కొరియా చేతిలో పోరాడి ఓడింది.
*రంజీ ట్రోఫీ 2017-18 సీజన్‌లో హైదరాబాద్‌, ఆంధ్రలకు నిరాశే మిగిలింది. రెండు జట్లకు నాకౌట్‌ బెర్తులు దక్కలేదు. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, దిల్లీ జట్ల మధ్య గ్రూప్‌-ఎ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
*శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టీ20 సిరీస్‌లోనూ ఆడేది అనుమానమే. టీ20 సిరీస్‌లో ఆడటంపై అతడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘‘డిసెంబరు 12 వరకు కోహ్లికి వ్యక్తిగత పనులున్నాయి.
*‘జెర్సీ నంబర్‌ 10’కు బీసీసీఐ ఇక అనధికారికంగా వీడ్కోలు పలికినట్టే! క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ పదో నంబర్‌ జెర్సీని ధరించేవాడన్న సంగతి అందరికీ తెలిసిందే. తిరుగులేని రికార్డులను నెలకొల్పిన ఆయనను అభిమానులు ఎంతగానో ఆరాధిస్తారు. ఆయన గౌరవ సూచకంగా పదో నంబర్‌ జెర్సీని ఇక ఎవరికీ కేటాయించమని బీసీసీఐ అనధికారికంగా స్పష్టం చేసింది. అనవసర వివాదాల జోలికి పోవద్దనే ఉద్దేశంతో ఇలా చేసింది. శార్దూల్‌ ఠాకూర్‌ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో పదో నంబర్‌ జెర్సీని తీసుకున్న సంగతి విమర్శలకు దారితీసింది.
*విద్యా సంస్థల్లో తీవ్ర ఒత్తిడి ఉంటున్న మాట వాస్తవమేనని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిబంధనలు పాటించని పలు జిల్లాల్లోని నారాయణ, చైతన్య కాలేజీలకు రూ. 50 లక్షల చొప్పున జరిమానా విధించామని.. తగిన చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని కళాశాలల్లో పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు చేస్తామన్నారు. లోటు బడ్జెట్‌లోనూ విద్యారంగానికి అధిక నిధులు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.
*కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఏపీ మోడల్‌ స్కూల్స్‌ గెస్ట్‌ టీచర్లు కలిశారు. జిల్లాలోని 1300 పీజీటీ, టీజీటీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రం అందజేశారు.
*తెలుగుభాషకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తెలుగు భాషపై తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ శాసనసభలో ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై ఆయన మాట్లాడారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. తెలుగువాళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా ప్రత్యేకమైన స్థానం వచ్చేలా ప్రయత్నం చేస్తానన్నారు. న్యాయ పాలనలో తెలుగు అమలు స్వతర చర్యలు తీసుకోవాలన్నారు.
*హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ‘క్రీడా పరిశ్రమలో వ్యాపార విజయం’ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ చర్చలో టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, క్రికెటర్‌ మిథాలీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చకు ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షాబోగ్లే వ్యవహరించారు. ఈ సందర్భంగా వక్తలు తమ అభిప్రాయాలను వేదికపై పంచుకున్నారు.
* భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై నాలుగేళ్లు దాటిన అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
* ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని రెండు రోజుల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు.
* డిసెంబర్ 1 నుంచి 4 వరకు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్ నిర్వహించనున్నట్లు చలన చిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ రామ్మోహన్ రావు తెలిపారు. ఇండీవుడ్ థర్డ్ ఎడిషన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఈ ఎడిషన్‌కు సుమారు 50 వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్న ఆయన.. 5 వేల మంది వ్యాపారవేత్తలు, 500 మంది పెట్టుబడిదారులు హాజరవుతారని చెప్పారు. 300 ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. గతేడాది ఫిలిం సిటీలో జరిగిన రెండో ఎడిషన్ ఇండీవుడ్ కార్నివాల్ విజయవంతమైందని రామ్మోహన్‌రావు గుర్తు చేశారు.
మూడో ఎడిషన్ మరింత పెద్ద ఎత్తున జరగబోతుందని రాష్ట్ర సమాచార కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరుగుతుందని తెలిపారు. గేమింగ్ వీఎస్‌ఎస్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. హైదరాబాద్ సినిమా రంగానికి రాజధానిగా మారబోతుందన్నారు.
* టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చేదు అనుభవం ఎదురైంది. ఈ మిస్టర్ కూల్ ఈ మధ్యే జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఉత్తర కశ్మీర్‌లో ఆర్మీ స్పాన్సర్ చేస్తున్న క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో ధోనీ వెళ్లాడు. అయితే ఈ సందర్భంగా అక్కడి యువత ధోనీని అవమానించేలా వ్యవహరించారు.
* చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యతపై జీఈఎస్ వేదిక వద్ద మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మహిళలకు 33 శాతం బిల్లును పార్లమెంట్‌లో పెడితే తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
* హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ వీ10ను చైనాలో తాజాగా విడుదల చేసింది. త్వరలోనే ఈ ఫోన్ భారత్‌లోనూ లభ్యం కానుంది. 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.26,350, రూ.29,280 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.
* మ్యాగీ మరోసారి వార్తల్లో నిలిచింది. తమ నూడుల్స్‌లో సీసం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఐదు నెలల పాటు దేశంలో నిషేధానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఈ నూడుల్స్‌లో మోతాదుకు మించి బూడిద నమూనాలు ఉన్నాయంటూ షాజహాన్‌పూర్ కోర్టు ఒకటి నెస్ట్‌లేకు రూ.62 లక్షల జరిమానా విధించింది.
* వర్ధన్నపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
* టీ హబ్ వల్ల రాష్ర్టానికి అపార లబ్ధి చేకూరిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరగడం సంతోషంగా ఉందన్నారు. అరుదుగా వచ్చిన ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నామని కేటీఆర్ తెలిపారు.
*గ్లోబల్ ఎంటర్ ప్రేన్యుర్ సమ్మిట్ 2017కోసం నగరానికి వచ్చిన అతిధి ఇవాంకా కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ o ప్రత్యేక బహుమతిని అందించారు. ఈ చెక్క పెట్టెను ఇవాంకా కు బహుకరిచ్న్హారు. అది సాదాసీదా పెట్టె కాదు సూరత్ కళ సదేలి హస్త కళ సదేలి తో కూడుకునది. వివిధ ఆకృతుల్లో పెట్టె పై అల్లికలు ఉండటమే ఈ కళ ప్రత్యేకం.
*నవ్యంద్ర ఫిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేసినట్టు కామర్స్ అద్యక్షుడు వీ.ఎన్ రావు చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com