నేటి నుండి అంతర్జాలంలో భద్రాద్రి రామయ్య కళ్యాణం టికెట్లు

శ్రీరాముడు అవతరించిన విశేష సంవత్సరం(విళంబి) కావడంతో ఈ సారి జరిగే శ్రీసీతారామచంద్రుల కల్యాణోత్సవానికి భద్రాద్రిలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి అంతర్జాలంలో అన్ని రకాల టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. వచ్చే నెల 18 నుంచి ఏప్రిల్‌ 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 26న జరిగే సీతారాముల కల్యాణానికి, 27న జరిగే పట్టాభిషేకానికి మిథిలా మండపం ప్రాంగణంలో ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులోకి ప్రవేశించేందుకు 18,807 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.
**నేటి నుంచి విక్రయాలు
కల్యాణానికి 5 వేలు (ఇద్దరికి), రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 టిక్కెట్‌లను సోమవారం నుంచి విక్రయిస్తామని దేవాలయ వర్గాలు తెలిపాయి. రూ.250, రూ.100 టిక్కెట్‌లను తీసుకున్న వారు పట్టాభిషేకాన్ని నేరుగా వీక్షించవచ్చు. రూ.5 వేల టికెట్‌లను అంతర్జాలంతో పాటు ఆలయ కార్యాలయం వద్ద విక్రయిస్తారు. దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. మిగతా అన్ని టికెట్‌లపై ఒక్కరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. టిక్కెట్ల కోసం అంతర్జాల చిరునామా www.bhadrachalamonline.com ను సంప్రదించాలని ఆలయ వర్గాలు తెలిపాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com