నేటి నేరాలు ఘోరాలు-౦౨/౦౨

* దెందులూరు మండలం మిథునరావుపాలెంలో కోడిపంద్యాలు ఆడుతున్న వారిపై దాడి చేసి 8మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై శీలం శంకర్‌ తెలిపారు.
* పండుగపూట పెద్దపల్లి జిల్లాలో విషాదం అలుముకుంది. సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంట గ్రామంలోని సబ్‌స్టేషన్‌ సమీపంలో జాతరకు వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ మ హిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 12 మంది గాయపడ్డారు.
* * వ్యాయామ కళాశాలలో ఫిజికల్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా సర్వాయిపేట గ్రామానికి చెందిన కృష్ణవేణి హైద్రాబాద్ దోమలగూడలోని వ్యాయమ కళాశాలలో అభ్యసిస్తోంది. కళాశాలలోని హాస్టల్ గదిలో ఈరోజు ఉదయం ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
* క్యూబా విప్లవకారుడు, మాజీ దేశాధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో పెద్ద కుమారుడు డియాజ్‌ బలర్ట్‌(68) ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నబలర్ట్‌ గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల పట్ల కనీసం శ్రద్ధ లేకుండా పోయింది. సర్కార్ దవాఖానాల్లో పురుడు పోసుకోవడం అంటేనే ప్రజలు భయపడి పోతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైన విషయం గుర్తుండే ఉంటుంది. రోజుల చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన దుర్ఘటనను ఎవరు మర్చిపోతారు. అలాంటి దుర్ఘటనే జిల్లాలోని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది. మార్చురీ గదిలో మూడు నెలల పాప మృతదేహాన్ని ఎలుకలు కొరికితిన్నాయి. విషయం బయటపడటంతో ఆసుపత్రి సిబ్బంది హడావిడిగా చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కౌడిపల్లి మండలం బతుకమ్మతండాకు పంపిన సిబ్బంది.
*సినీనటుడు సామ్రాట్‌రెడ్డి అలియాస్‌ జీవీఎస్‌రెడ్డి గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. సామ్రాట్‌రెడ్డి భార్య హర్షితరెడ్డి ఇంట్లో దొంగతనం చేశాడనే అభియోగంపై జైలుకు వచ్చిన విషయం విదితమే.
* 400 మంది భక్తులు, మద్దతుదారుల వృషణాలను బలవంతంగా తొలగించారనే నేరారోపణలపై డేరా సచ్చా సౌధా అధ్యక్షుడు గుర్మీత్‌ రామ్‌ రహీంసింగ్‌తో పాటు ఇద్దరు వైద్యులపై సీబీఐ గురువారం అభియోగపత్రం దాఖలు చేసింది. పంజాబ్‌, హరియాణా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఈకేసులో దర్యాప్తు జరిపింది.
*వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ గెడ్డాపు లక్ష్మీప్రసాద్‌కు అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అతణ్ని బుధవారం అరెస్టు చేయగా గురువారం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.
*గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు తాఖీదులు పంపనున్నామని సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ రఘువీర్‌ గురువారం తెలిపారు.
*రాజధానిలోని చిలుకానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడు నెలల చిన్నారి తలను కోసుకొచ్చి భవనంపై పడేశారు. గుర్తుతెలియని ఆ చిన్నారి మొండెం ఆచూకీ లేదు. హృదయ విదారకమైన ఈ ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
*చౌకగా బంగారం ఇస్తామని నమ్మించి రూ.4 లక్షలు కాజేసిన సంఘటన గోకవరంలో చోటుచేసుకోగా దీనిపై బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఉమామహేశ్వరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* ఇద్దరి మహిళా శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తు్న్న డేరా సచ్చా సౌధ చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.
*హీరోయిన్లపై లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం నటి అమలాపాల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యాపారవేత్తను చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది సద్దుమణుగక ముందే నటి సనూషా అత్యాచార వేధిపులకు గురైంది. మలయాళ నటి అయిన ఈమె తమిళంలో రేణిగుంట, భీమ చిత్రాల్లో నటించిది. ఇటీవల శశికుమార్‌ చిత్రం కొడివీరన్‌లోనూ నటించింది. బుధవారం రాత్రి కున్నూర్‌ నుంచి తిరువనంతపురం రైలులో ప్రయాణం చేస్తుండగా ఆంటోబోస్‌ అనే వ్యక్తి నిద్రిస్తున్న సనూషపై లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు. దీనిపై సనూష టీటీఈకి ఫిర్యాదు చేసింది. వెంటనే రైల్వే పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. అంటోబోస్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తిగా సమాచారం.
*రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెంఆరు. సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి సమీపంలో అదుపుతప్పిన బైక్.. ఎండ్ల బండిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోని ఇందారం రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అంజిరెడ్డి అనే వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో మృతిచెందినట్లుగా సమాచారం.
*ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మల్లెంకొండ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించిన పోలీసులు మూడు కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, ఆరుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు.
*జనగామ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఘునాథ్‌పల్లి మండలం వెంకటాయపాలెం స్టేజీ వద్ద ఓ టూరిస్టు బస్సు- కారు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీపీ సుధీర్ బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
*ప.గో జిల్లా ఏలూరు సమీపంలో శుక్రవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వట్లూరు గురుకుల పాఠశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
*జడ్చర్లలోని అక్షరశ్రీ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ప్రార్థనకు వెళుతున్న విద్యార్థులపై కారు దూసుకువెళ్లటంతో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయలు కాగా అందులో ఒకరు మృతి చెందారు.
* కర్నూలులోని ఆత్మకూరులో వీధికుక్కులు స్వైరవిహారం చేశాయి. కొత్తపేట, ఇస్లాంపేట కాలనీల్లో కుక్కలు దాడి చేయడంతో 24మంది గాయపడ్డారు. వారిని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
* ఓ ప్రేమ జంటపై నాలుగు రోజుల క్రితం పంపనూరు పరిసర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గురువారం రహస్యంగా బాధితుల కుటుంబ సభ్యులు అనంతపురం డీఎస్పీకి ఫిర్యాదు చేయటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
* రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ పారిశ్రామిక వేత్త మృతి చెందారు. కొల్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారు అదుపుతప్పి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇమ్రాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌ నుంచి జహీరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఇమ్రాన్‌ను గోబల్ డెవలపర్‌ చైర్మన్‌గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇమ్రాన్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుప్రతికి తరలించారు.
* దివంగత కమ్యూనిస్టు నేత, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడు ఫిడెల్ క్యాస్ట్రో డియాజ్‌ బలార్ట్‌ (68) బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు.
* దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట దొంగల ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాంజీనగర్ ముఠాకు చెందిన నలుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగల వద్ద నుంచి రూ.25 లక్షల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాంజీనగర్ ముఠా దేశవ్యాప్తంగా చోరీలకు పాల్పడిందని ఖమ్మం సీపీ ఇక్బాల్ తెలిపారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ వెల్లడించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న సిబ్బందిని సీపీ ఇక్బాల్ అభినందించారు.
*నల్లగొండ జిల్లాలోని కేతేపలి మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి. సునీల్‌కుమార్ ఉదయం తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
*రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
*ఒకరి చేయి ఒకరు పట్టుకుని రైలు పట్టాలపై తలపెట్టి… తనువు చాలించిన ఇద్దరి హృదయవిదారక ఘటన ఇది. వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో గురువారం చోటు చేసుకుంది.
*దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను ఖమ్మం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుంచి భారీగా డబ్బులు, బంగారు ఆభరణాలు తెచ్చుకునే వారిని లక్ష్యంగా చేసుకుని దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన రాంజీనగర్ ముఠాకు చెందిన నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.
* ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తా, మరో ఇద్దరు భాజపా మేయర్లపై దాడి చేశారనే ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేశారు. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట్లో భాజపా నేతలపై ఆప్‌ ఎమ్మెల్యేలు జర్నైల్‌ సింగ్‌, అఖిలేశ్‌ త్రిపాఠి, జితేందర్‌ తోమర్‌, సంజీవ్‌ ఝాలు దాడికి పాల్పడ్డట్లు అందిన ఫిర్యాదు మేరకు నలుగురు శాసనసభ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దిల్లీ భాజపా యూనిట్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌ గుప్తా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
* గుంటూరు జిల్లా గురజాలలో పిచ్చికుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై మూడు కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.
* తార్నాకలోని హెచ్‌ఎండీఏ ఆఫీస్‌ ప్లానింగ్ డైరెక్టర్ కె.పురుషోత్తం కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 6 కోట్ల రూపాయల విలువ చేసే పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇవి బహిరంగ మార్కెట్‌లో 25 కోట్ల రూపాయల వరకు విలువ చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా సుమారు రూ.30 నుంచి రూ.40 కోట్ల విలువ చేసే ఆస్తులను అధికారులు గుర్తించారు. నగరంలో మొత్తం 11 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
* గుర్గావ్‌ బాలుడు ప్రద్యుమన్‌ హత్య ఉదంతం మరిచిపోకముందే.. దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో విద్యార్థి టాయ్‌లెట్‌లో శవమై కనిపించాడు. డయేరియాతోనే విద్యార్థి చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చెబుతుండగా.. తోటి విద్యార్థుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com