నేటి నేరాలు ఘోరాలు-౦౨/౦౯

నేటి నేర వార్తలు
*మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్లను హైదరాబాద్ పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.
*వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. పాల్వంచ కేటీపీఎస్ వ దశలో భాగంగా జరుగుతున్న పనుల్లో నేడు ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. బాయిలర్ వద్ద వెల్డింగ్ పనిచేసే బీహార్‌కు చెందిన సంతోష్‌కుమార్‌సింగ్ అదుపుతప్పి బిల్డింగ్ పైనుంచి పడి మృతిచెందాడు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన లారీ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. భూపాలపల్లిలోని మల్లంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి.. జవహర్‌నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందాడు.
*బీజాపూర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లను ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరి నుంచి విద్యుత్ తీగలుడిటోనేటర్లుపైపు బాంబులతో పాటు విప్లవ సాహిత్యంకరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ కదలికలపై ఈ ఇద్దరు మహిళలను పోలీసులు విచారిస్తున్నారు.
*లంచం తీసుకుంటూ వికలాంగ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రుణం మంజూరు చెక్ ఇచ్చేందుకు మహిళ నుంచి రూ. వేలు లంచం తీసుకుంటుండగా.. ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాల్ నివాసంతో పాటు ఆయన కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
*వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ లో ఇవాళ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొకైన్ తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్ల వద్ద నుంచి గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్లను అరెస్ట్ చేసిన పోలీసులు కొకైన్ ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
*చెన్నై నుంచి 199 మంది ప్రయాణికులతో దిల్లీ బయలుదేరిన స్పైస్‌ జెట్‌ విమానం రన్‌వేపై వెళ్తుండగా టైరు పేలింది. గురువారం జరిగిన ఈ ఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. భారీ శబ్దంతో టైరు పేలడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం సిబ్బంది విమానాన్ని నిలిపివేశారు. సహాయక బృందాలు వచ్చి ప్రయాణికులను సురక్షితంగా విమానాశ్రయంలోకి పంపాయి.
*ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు హైదరాబాద్‌ సైబర్‌ నేరాల విభాగం పోలీసులు తాఖీదులు జారీ చేశారు. రాంగోపాల్‌ వర్మ రూపొందించిన గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌(జీఎస్టీ) వెబ్‌ సిరీస్‌ చిత్రంలో అశ్లీల, అసభ్య సన్నివేశాలున్నాయంటూ మహిళా సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
*కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి లెంక గిరీష్‌నాయుడు (21) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*గొర్రెల లోడుతో వెళ్తున్న వ్యాన్‌ కల్వర్టు వంతెనను ఢీకొని రహదారి పక్కనున్న గుంతలో బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 59 గొర్రెలు సైతం మృత్యువాతపడ్డాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
*ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మవోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో జన్‌మిలీషియాకు చెందిన ఉంగమి అలియాస్‌ చక్ర అనే కమాండర్‌ ప్రాణాలు కోల్పోయాడు. బీజాపుర్‌, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని కిరందుల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని అడవిలో బుధవారం అర్ధరాత్రి ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని దంతేవాడ అదనపు ఎస్పీ గోరఖ్‌నాథ్‌ బఘెల్‌ తెలిపారు.
*సాగు చేసిన పంటను విక్రయించడానికి వచ్చిన ఓ రైతు మార్కెట్‌లో నిద్రించగా ఆయనపై మినీ లారీ దూసుకెళ్లడంతో మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామును వరంగల్‌లో చోటు చేసుకుంది.
* క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కుమార్తె సారా తెందుల్కర్‌ పేరు మీదుగా నకిలీ ట్విటర్‌ ఖాతా నడుపుతున్న వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబయిలోని అంధేరికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నితిన్‌ సిశోడే(39) సారా పేరు మీదుగా నకిలీ ఖాతా నడుపుతున్నట్లు సైబర్‌ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
*ఖమ్మం జిల్లాలోని బోనకల్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ప్రమాదవశాత్తు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకులపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
*ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో ఉన్న‌ పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. వేలు స్వాధీనం చేసుకున్నారు.
*రామగుండం ఎన్టీపీసీలోని ప్రగతి నగర్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజీవ్ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
*ఓ ఇంట్లో నిల్వచేసిన గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో సూర్యప్రకాష్ నిలయంలో నిల్వ ఉంచిన రూ. లక్షల విలువైన సుమారు క్వింటాళ్ల గంజాయిని స్టేట్ టాస్క్‌ఫోర్స్ హైదారాబాద్ (ఎస్‌టీఎఫ్) స్థానిక ఎక్సైజ్ పోలీసులు ఉదయం దాడి చేసి పట్టుకున్నారు.
*తన వివాహేతర సంబంధానికి అడ్డుగా భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. పథకం ప్రకారం విమానంలో వచ్చిన ప్రియుడు హత్య చేసి వెళ్లిపోయాడు. కేసును చేధించిన పోలీసులు సనత్‌నగర్‌ ఠాణాలో గురువారం డీసీపీ సాయిశేఖర్‌, ఏసీపీ గోవర్ధన్‌, ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు.
*వనపర్తి జిల్లాలోని మదనాపురం మండలం గోపన్‌పేటలో విషాదం చోటు చేసుకున్నది. పొలం పనికి వెళ్లిన రైతు వెంకటయ్య ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. దీంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
*హైదరాబాద్ నగరంలోని హుమాయున్ నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
*హైదరాబాద్ నగరంలోని గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అపర్ణ(21) సూసైడ్ చేసుకున్నది.
*రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి వేగంగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొన్నది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులే ఈ ప్రమాదానికి గురి కాగా.. ఆటోలోని వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు.
* కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి అన్నంత పని చేసేశారు. కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు ‘శూర్ఫణఖ’ పోస్టుకు ఆమె నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజ్యసభలో ఆమె హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.
*వచ్చే రాజ్యసభ ఎన్నికల కోసం అధికార పార్టీ టీడీపీ.. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోతున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com