నేటి నేరాలు-ఘోరాలు-౧౧/౨౬

*తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి నాలుగు బీమా సంస్థలను రూ.3.25 కోట్ల మేర మోసం చేయడానికి యత్నించిన భార్యాభర్తల ఉదంతమిది. పాతబస్తీ డబీర్‌పూరా పోలీసు స్టేషన్‌ సమీపంలో నజియా షకీల్‌ (36), షకీల్‌ అలామ్‌ దంపతులు నివసిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం బీమా సంస్థల్ని మోసం చేయాలని పథకం పన్నారు. రెండేళ్ల క్రితం నజియా షకిల్‌ పేరిట ఐసీఐసీఐ ప్రొడెన్షియల్‌ జీవిత బీమా సంస్థలో రూ.కోటి, హెచ్‌డీఎఫ్‌సీలో(రూ.75 లక్షలు), అవివాలో(రూ.50 లక్షలు), ఎక్స్‌సైడ్‌ జీవిత బీమా సంస్థలో రూ.50 లక్షల మేర జీవిత బీమా పాలసీలు తీసుకున్నారు. 2015 నుంచి వాయిదాలు చెల్లిస్తున్నారు. ఇటీవల నజియా షకీల్‌ మృతి చెందినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారు. తన భార్య మృతి చెందిందంటూ షకీల్‌ అలామ్‌ వివిధ సంస్థల్లో చేసిన బీమా రాబట్టేందుకు దరఖాస్తు చేశాడు. ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా బంజారాహిల్స్‌లోని ఐసీఐసీఐ ప్రొడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ సంస్థ అధికారులు విచారణ చేపట్టగా షకీల్‌ అలామ్‌ సమర్పించినవి నకిలీ పత్రాలుగా తేలింది. నజియా షకీల్‌ మృతి చెందలేదని నిర్ధారించుకున్న బీమా సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. నజియా షకీల్‌ను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి మోసంపై చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లోనూ ఓ బీమా సంస్థ ప్రతినిధులు ఇటీవల ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
*మగపిల్లలతో సమానంగా ఆటల్లో, చదువులోనూ రాణిస్తున్న కుమార్తెపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. కుక్కకాటుకు కూతురు మృతిచెందడం ఆ కుటుంబం లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదం అలముకుంది. పంచాయతీ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయిన సంఘటన శనివారం గోవాడ గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలో గోవాడ గ్రామానికి చెందిన పైడిశెట్టి సన్యాసిరావు, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిది నిరుపేద కుటుంబం. పెద్ద కుమార్తె మేఘన (16) చోడవరంలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 6న కాలేజీ ముగిసిన తరువాత గోవాడలో తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడనే ఉన్న వీధి కుక్కలు మీదపడ్డాయి.
*వారిద్దరు వరుసకు అన్నాచెల్లెళ్లు. ప్రేమ పేరుతో యువకుడు మాయమాటలు చెప్పడంతో బాలిక నమ్మి మోసపోయి గర్భం దాల్చింది. విషయం ఎక్కడ బయటపడుతుందోనని యువకుడు ఆమె గొంతు నులిమి, నీటిలో ముంచి దారుణంగా హతమార్చాడు. వివరాలివి. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈనెల 23న బడికని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ముల్లనూరు నాగసత్రం వంతెన కింద పాఠశాల యూనిఫాం ధరించిన ఓ విద్యార్థిని మృతదేహం ఉన్నట్లు శుక్రవారం తల్లిదండ్రులకు సమాచారం అందింది. బాలిక తమ బిడ్డగా వారు గుర్తించారు. మృతదేహానికి ఆసుపత్రిలో నిర్వహించిన మరణోత్తర పరీక్షలలో బాలిక ఎనిమిది నెలల గర్భిణి అని తేలింది. బాలిక ఇంటికి కడత్తూరుకు చెందిన కుప్పుస్వామి కుమారుడు ప్రతాప్‌(27) తరచూ వెళ్లేవాడని పోలీసు విచారణలో తేలింది. అతడు బాలికకు వరుసకు సోదరుడవుతాడని వెల్లడైంది. ప్రతాప్‌ నేరుగా పోలీసుస్టేషన్‌లో లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు.
*చేరదీసేవారు లేక జీవితంపై విరక్తి పుట్టి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన ఎడుమ్యాకల నర్సయ్య(69), మల్లమ్మ(60) దంపతులకు సంతానం లేదు. కూలీ పనులు చేసుకుంటూ.. ఇతరులను చేయి చాచకుండా జీవిస్తున్నారు. ఇంతలోనే వారిని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. మల్లమ్మకు మూడుసార్లు శస్త్రచికిత్సలు చేయించగా వేలాది రూపాయలు ఖర్చయ్యాయి. నర్సయ్య సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పట్టించుకునేవారు లేక.. బాధలకు తాళలేక నర్సయ్య, మల్లమ్మలు శనివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు గోడపై నుంచి చూడగా వారు విగత జీవులుగా పడి ఉన్నారు.
*గుండెపోటుతో అగ్రి గోల్డ్ బాదితుడు మృతి చ్జేండదు. అగ్రి గోల్డ్ పాలసీలలో పోయిన డబ్బును రాబట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ లో ఆన్ లైన్ లో తన వివరాల నమోదుకు వచ్చిన ఒక వృద్దుడు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. అనంతరం మృతిచెందాడు.
*కర్నాటక రాజధాని బెంగాలూరుఅలో శివార్లలో o గృహిణి పై ఆమె భర్తే ముందే సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ముగ్గిరిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్టు చేసారు.
*ఈజిప్టులోని మసీదుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 305కి చేరింది. వారిలో 25 మంది పిల్లలే. శుక్రవారం జరిగిన ఈ దాడిలో 235 మంది మరణించిన విషయం తెలిసిందే. శనివారం ఈ సంఖ్య పెరిగింది. మరోపక్క ఈజిప్ట్‌ సైన్యం శనివారం అనేకమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టి, వారి వాహనాలను ధ్వంసం చేసింది. ఉత్తర సైనాయ్‌ చుట్టుపక్కల ఉగ్రవాదులు దాగిన స్థావరాలపై వైమానిక దళం యుద్ధవిమానాలతో పెద్దఎత్తున విరుచుకుపడింది. మసీదుపై దాడికి వినియోగించిన వాహనాలను నామరూపాల్లేకుండా చేసింది. ఉగ్రవాదుల ఆయుధాలు, పేలుడు పదార్థాలనూ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.
*కోతి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఉదంతం ప్రకాశం జిల్లా పామూరులో శనివారం చోటుచేసుకుంది.
*గుంటూరు లాంచెస్టర్‌లోని ఓ గోదాములో ఎలాంటి అనుమతులు లేకుండా తయారుచేస్తున్న బయో ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ బయోఉత్పత్తులను తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తయారీ కేంద్రాలపై జిల్లా సంయుక్త కలెక్టర్‌ క్రితికాశుక్లా ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.35లక్షలు విలువైన బయో ఉత్పత్తులను సీజ్‌ చేశారు. యూనివర్సల్‌ క్రాప్‌ సైన్స్‌ పేరిట ఇక్కడ పలురకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఎవరూ ముందుకు రాకపోవడంతో మొత్తం సరకును సీజ్‌ చేశామని, శాంపిల్స్‌ను గుంటూరు ల్యాబ్‌కు పంపి తదుపరి చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్‌ తెలిపారు.
*విశాఖా జిల్లా హుకుం పేటలో శనివారం రెడ్ మీ నాట్ ఫోర్ చరవాని పేలిపోయింది. వెంకటేష్ ఆన్ లైన్ లో ఐదు నెలల క్రితం ఈ మొబైల్ కొన్నాడు.
*మధ్యప్రదేశ్‌లో మహిళలపై ఆరాచకాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. తాజాగా అడిషనల్‌ ఎస్పీ రాజేంద్ర వర్మ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళా కానిస్టేబుల్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ రాజేంద్రవర్మ లైంగిక వేధింపుల వల్ల మానసికంగా, శారీరకంగా కుంగిపోయినట్లు ఆమె పేర్కొన్నారు. రాజేంద్ర వర్మపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు.
*మూడు రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువు ఉదంతం సుఖాంతమైంది. అపహరణకు గురైన బుజ్జాయి ఆచూకీని పోలీసులు గుర్తించారు. శిశువును అపహరించిన మహిళను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు.
*ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చగోలు దగ్గర అదుపుతప్పి కారు బోల్తా ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మిగిలిన వారిని కావలిలోని కందుకూరు హాస్పిటల్ కు తరలించారు.
*నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం ఆనెగొట్ట గ్రామమలో విషాదం. వడ్డీ కండ్రీగా గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్ధులు మృతి.
*నెల్లూరు జిల్లా కలువాయి కనకమహాల్ సెంటర్ సమీపంలో ఇంట్లో పట్టపగలే చోరీకి దోపిడీ దొంగలు విఫలయత్నం.
*విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం కొవ్వాడలో 144సెక్షన్ అమలు చేసారు. ఎమ్మెల్యే పతివాడ నారాయణ వామి నాయుడు బంధువుకు చెందిన ఎస్వి ఎల్ లైఫ్ సైన్స్ కంపెనీ భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ దళితులు ఆందోళనకు దిగారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com