నేటి నేరాలు-౦౨/౦౭

*ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా రూ.925 కోట్ల డబ్బును దోచేయాలనుకున్నారు కొందరు దుండగులు. కానీ దేవుడి దయ వల్ల ఓ 27 ఏళ్ల కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ దొంగతనం జరగలేదు. రాజస్థాన్‌లోని ఓ ప్రధాన బ్యాంక్‌కు కన్నమేసి ఇంతటి మొత్తంలో డబ్బు దోచుకోవాలని కొందరు వ్యక్తులు కుట్ర పన్నినట్లు జయపుర ఏసీపీ ప్రఫుల్ల కుమార్‌ బుధవారం వెల్లడించారు.
*రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం దామరగిద్ద సమీపంలో బుధవారం ఉదయం ఓ కారులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో మంటలు రాగానే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బయటకు దూకడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రయాణికులు వెల్లడించారు. కారులో ఆరు మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పారు.
*మరిపెడ మండలంలోని ఎల్లంపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుమ్మల వెంకటేశ్వర్లు(45) ఫిట్స్ తో ఆనేపురం క్రాస్‌రోడ్డు వద్ద కారులో మృతి చెందాడు.
*ఇచ్ఛాపురం-కవిటి మండలాల మధ్య గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. విశాఖ నుంచి ఒడిశాలోని బాలసోర్‌కు వెళ్తున్న ఇండియన్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో రెండు రాష్ట్రాల నుంచి అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గ్యాస్‌ కొద్దిగా లీక్‌ అవ్వడంతో నీళ్లు చల్లి ట్యాంకర్‌ను చల్లబర్చారు.
*హైదరాబాద్‌లో భర్త చేతిలో హత్యకు గురైన జ్యోతి.. ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలను ఒకే పాడెపై ఉంచి మంగళవారం అంత్యక్రియలు జరిపారు. హైదరాబాద్‌ జిల్లెలగూడలో భర్త హరిందర్‌ చేతిలో భార్య జ్యోతి (32)తో పాటు ఇద్దరు పిల్లలు అభితేజ్‌(6), సహస్త్ర (4)లు సోమవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
*రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం మోమిన్‌కుర్జు వాగువద్ద ఆటో-బైక్ ఢీకొన్న ఘటనలో అంతారంకు చెందిన రాఘవేందర్‌రెడ్డి అనే వ్యక్తి మృతిచెందాడు.
*నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి పరిధి త్రయంబక్‌పేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్యే కడతేర్చింది. ఈ నెల న భర్త నర్సయ్య పొలం వద్ద నిద్రిస్తుండగా భార్య మంజుల మరో వ్యక్తితో కలిసి గొంతు నులిమి చంపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
*ఇండోనేషియా రాజధాని జకర్తాను వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. వరదల బారిన పడి ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైనవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం నుండి వర్షాలు కురుస్తుండటంతో..అధికార యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు సహాయక చర్యలను చేపడుతున్నది.
*తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుటీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తనలో ఉన్న సేవాగుణాన్ని మరోసారి చాటిచెప్పారు. సర్పంచ్ పదవిలో ఉండి ప్రమాదవశాత్తు మృతి చెందిన మోచి బాలరాజు కుటుంబానికి ఆమె అండగా నిలిచారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి అన్నీ తానై ఎంపీ కవిత చూసుకుంటున్నారు. దివంగత సర్పంచ్ కుమార్తె భారతి పెళ్లికి కవిత ఆర్థిక సాయం చేసి.. పలువురికి ఆదర్శంగా నిలిచారు.
*మేడ్చల్ జిల్లాలోని కీసర మండల కేంద్రంలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న పెద్దమ్మ చెరువులో దూకి ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలుఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
*తల్లిదండ్రులతో ఏర్పడిన ఆస్తి తగాదాతో తీవ్రంగా కలత చెందిన కుమారుడు తన భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్‌ జిల్లా కీసర మండలం కొండాపూర్‌లో చోటు చేసుకుంది.
*హైదర్షాకోట్‌ హిమగిరినగర్‌ కాలనీలో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకుంది.
*వివాహేతర సంబంధం పెట్టుకున్న కేసులో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మౌలాలి రైల్వేస్టేషన్‌ సమీపంలోని పట్టాలపై యువకుడు మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించిన స్టేషన్‌ అధికారులు సోమవారం అర్ధరాత్రి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు.
*తన అక్క కుమార్తెతో సోమవారం వివాహం చేసుకున్న మునిరాజు (30) అనే వ్యక్తి, మంగళవారం వేకువ జామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
*ఇద్దరు ఆడపిల్లలు పుట్టినందుకు తన భార్యను వేధించడంతోపాటు..ఆస్తి పంచి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న తల్లితండ్రుల వైఖరితో ఓ వ్యక్తి బతుకుపై విరక్తి పెంచుకున్నాడు. అనుబంధాన్ని మరిచిన వారికి చావుతో కనువిప్పు కల్గించాలన్న నిర్ణయానికొచ్చి..భార్యాబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్‌ జిల్లా కీసరలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
*వివాహేతర సంబంధం పెట్టుకున్న కేసులో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మౌలాలి రైల్వేస్టేషన్‌ సమీపంలోని పట్టాలపై యువకుడు మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించిన స్టేషన్‌ అధికారులు సోమవారం అర్ధరాత్రి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు.
* భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌పై పాకిస్థాన్‌ మరిన్ని కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. గూఢచర్యం ఆరోపణలపై పాక్‌ సైనిక న్యాయస్థానం ఇప్పటికే ఆయనకు మరణశిక్ష ఖరారు చేయగా.. ఉగ్రవాదం, విద్రోహం వంటి అభియోగాలూ ఆయనపై నమోదైనట్లు ప్రముఖ పత్రిక ‘డాన్‌’ తాజా కథనంలో తెలిపింది.
* దోపిడీకి వచ్చిన దుండగులు మహిళపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. కర్ణాటకలోని బాగల్‌కోటలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
*కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో గతంలో మావోయిస్టులు దాచిన డంప్‌ను డీఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ మాట్లాడుతూ.. కచ్చిత సమాచారంతో నాగలూటి వీరభద్రక్షేత్రానికి ఉత్తరప్రాంతంలో నేలలో దాచిపెట్టిన డంప్‌ను గుర్తించినట్లు తెలిపారు.
*ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కాంకేర్‌ జిల్లాలోని గోమ్‌, గత్తకల్‌ గ్రామాల మధ్య గల అడవిలో 35వ బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌పై నక్సల్స్‌ కాల్పులు జరిపారని ఎస్పీ కె.ఎల్‌.ధృవ్‌ తెలిపారు.
* విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరంలో సోమవారం రాత్రి ఒక ఇంటిలో నిల్వ ఉంచిన 15 టన్నుల ఎర్రచందనం దుంగలను చిత్తూరు జిల్లా ప్రత్యేక కార్యదళం (టాస్క్‌ఫోర్సు) అధికారులు పట్టుకోవడం సంచలనం సృష్టించింది.
* నిర్మాణంలో ఉన్న హైటెక్‌ సిటీ మెట్రో రైలు స్టేషన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పురవ్వులు పడి మంటలంటుకోవడంతో సిబ్బంది వెంటనే అదుపుచేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ అగ్ని ప్రమాదం దృశ్యం చక్కర్లు కొట్టడంతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి మంగళవారం స్పందించారు. ఇది చాలా చిన్న ప్రమాదమని, వెంటనే సిబ్బంది మంటలను ఆర్పేశారని తెలిపారు.
*ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారని అభియోగాలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం సంచాలకులు పురుషోత్తంరెడ్డిపై ఏసీబీ అధికారులు మంగళవారం లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు.
*మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లా ఏటపల్లి, ధనోరా తాలూకాలోని సరిహద్దున మూరేవాడ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. గడ్చిరోలి పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తుండగామావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు.
*తూర్పు తైవాన్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. దీనివల్ల ఏమైనా నష్టం వాటిల్లిందా అనే విషయం వెంటనే తెలియరాలేదు. ఆదివారం నాడు తైవాన్‌ ఈస్ట్‌కోస్ట్‌ను అయిదు ప్రకంపనలు కుదిపేసిన విషయం గమనార్హం.
*యూఏఈ రవాణా విభాగాన్ని విమర్శిస్తూ ఇ-మెయిల్‌ పెట్టినందుకు.. 25 ఏళ్ల భారత కార్మికుడిపై దాదాపు రూ.87 లక్షల భారీ జరిమానాను ఆ దేశం విధించింది.
*అణ్వస్త్ర సామర్థ్యమున్న స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-1ను భారత్‌ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని ఒడిశా తీరానికి చేరువలోని అబ్దుల్‌ కలాం దీవి నుంచి ప్రయోగించారు. పోరాట సన్నద్ధతను పటిష్ఠం చేసుకోవడానికి సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం ఈ పరీక్షను నిర్వహించింది.
*ఆడపిల్ల పుట్టిందని భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్న వైకాపా నేత వ్యవహారం పోలీసుల చెంతకు చేరింది. కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్యాయత్నానికి ప్రయత్నించడాన్న భార్య ఫిర్యాదుపై విజయవాడలోని పెనమాలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
*ఆదోని మండలం దిబ్బనకల్లులో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. మంగళవారం హుసేనప్ప తాత ఉరుసు సందర్భంగా టీడీపీ వర్గీయుడయిన సర్పంచ్‌ లక్ష్మి భర్త లక్ష్మన్నవారి బంధువులు నాగరాజు,లక్ష్మి,నాగార్జున,నర్సమ్మ గ్రామస్థులకు భోజనాలు పెడుతున్నారు. వైసీపీ వర్గీయులు నాగరాజు,ర్జున్‌ రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలపడంతో వాటిని పక్కకు పెట్టాలని లక్ష్మన్న కోరాడు. వారిద్దరితో పాటు మరికొంతమంది గొడ్డళ్లతో లక్ష్మన్నపై దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన అతడి భార్య లక్ష్మిఆమె బంధువులు నాగరాజు,నాగార్జున,నర్సమ్మలపై కూడా దాడి చేశారు.
*దొంగతనానికి యత్నిస్తూ ఓ యువతి పట్టుబడిన సంఘటన మంగళవారం పొదిలి పట్టణంలో జరిగింది. స్థానిక ఇరిగేషన్‌ కార్యాలయం రోడ్డులో నివసిస్తున్న ఓ మహిళ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళగా పసిగట్టిన యువతి మారుతాళంతో ఇంటిలోనికి వెళ్ళి వెదుకుతోంది. వెంటనే తిరిగి వచ్చిన యాజమానురాలు చూసి కేకలు వేయడంతో పరిసర ప్రాంతాల వారు యువతిని పట్టుకున్నారు.
*ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వలలను ఏర్పాటు చేశారు. అటుగా వెళ్తున్న ఎలుగుబంటి వలలో చిక్కుకుని మృతి చెందగా..మరో ఎలుగుబంటికి గాయాలయ్యాయి. ఫారెస్ట్, పోలీసు అధికారుల బృందం గాయపడిన ఎలుగుబంటిని వలలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
*మిర్యాలగూడలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతుడిని గుత్తికొండ కృష్ణారెడ్డి(52)గా గుర్తించారు. కృష్ణారెడ్డి తాను ఉండే అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
*విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 45వ ఖానా వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పాదచారికి తీవ్ర గాయాలయ్యాయి. 100 కి.మీ.పైగా వేగంతో వెళ్తున్న కారు పాదచారిని ఢీకొని ఆపకుండా వెళ్లిపోవడంతో బ్యారేజీపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు కారు నంబర్‌తో పాటు, కారుపై ఉన్న పేర్లను, ఎన్టీఆర్‌ బొమ్మను గుర్తించి గుంటూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com