నేటి నేరాలు-౦౨/౦౮

* చైనాలో నిర్మాణంలో ఉన్న సబ్‌ వేకు దగ్గరలో రోడ్డు కుంగిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాంగ్‌డంగ్‌ ప్రావిన్స్‌ పరిధిలో షోషైంగ్‌ శివారులో తెల్లవారుజామున సబ్‌వే పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
* బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియాకు అయిదేళ్ల శిక్షను ఖరారు చేశారు. అవినీతి కేసులో ఆమెకు ఈ శిక్ష పడింది. ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఢాకా కోర్టు ఈ తీర్పును ఇవాళ వెలువరించింది.
* వరంగల్ అర్బన్ కమలాపూర్‌ పీఎస్ పరిధి కానిపర్తిలో పేకాటాడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.87 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు బైక్‌లు, 13 సెల్‌ఫోన్లను టాస్క్ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* విశాఖపట్నంలోని హుకుంపేట మండలం మత్స్యపురం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వ్యక్తిని దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్లు హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*కళాశాలలో సీనియర్లు ర్యాగింగ్‌ చేశారని ఓఉత్తరం రాసిపెట్టిన మేఘన (18) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు చెన్నసంద్రలోని శబరి అపార్ట్‌మెంట్‌ నివాసి. కుమారస్వామి లేఔట్‌లోని దయానంద సాగర్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థిని. ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులతో పాటు సివిల్‌ ఇంజినీరింగ్‌ హెచ్‌ఓడి రాజ్‌కుమార్‌ కూడా తమ కుమార్తెను ర్యాగింగ్‌ చేస్తుండటంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని మేఘన తల్లిదండ్రులు రాజరాజేశ్వరినగర ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జూద శిబిరాల నిర్వహణలో ఆరితేరిన ముఠాను బుధవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు అరెస్టు చేశారు.
*కట్టుకున్న భార్యతోపాటు కన్న పిల్లల్ని కిరాతకంగా హత్యచేసిన నిందితుడ్ని మీర్‌పేట పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. బుధవారం ఎల్బీనగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వేంకటేశ్వర్‌రావు నిందితుని వివరాలు వెల్లడించారు.
*ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా రూ.925 కోట్ల డబ్బును దోచేయాలనుకున్నారు కొందరు దుండగులు. కానీ దేవుడి దయ వల్ల ఓ 27 ఏళ్ల కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ దొంగతనం జరగలేదు.
*బీమా సొమ్ము కోసం నకిలీ పత్రాలను సృష్టించాడు.. అనుకున్నట్లుగానే సొమ్ము చేసుకున్నాడు.. ఎల్‌ఐసీ అధికారుల విచారణలో దొరికిపోయి చివరికి కటకటాల పాలయ్యాడు. బీమా సంస్థను మోసగించిన ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.65వేలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండలం డీసీపీ శశిధర్‌రాజు తెలిపారు.
*మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*ఎలాగైనా విమానం ఎక్కేయాలని షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపైౖకి ఓ భారతీయుడు దొంగతనంగా చేరుకున్నాడు. అయితే త్వరలో పెళ్లిచేసుకోబోయే అమ్మాయి కోసమే ఈ పని చేశానని ఆయన తెలిపారు. ప్రేమ ఎక్కువై ఇలా చేశానని, పశ్చాత్తాపం పడాలని అనుకోవట్లేదనీ వివరించారు. అతణ్ని 26ఏళ్ల ఆర్‌కేగా అధికారులు గుర్తించారు. విమానాశ్రయ గొడ దూకి, దొంగతనంగా రన్‌వేపైకి వచ్చిన అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్టుచేశారు.
*శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందమూరు ఏపీ రిజర్వు ఫారెస్టు ప్రాంతంలోని జామాయిల్‌ తోటల్లో జూద స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.21,15,778 నగదు 3 కార్లు, 20 సెల్‌ఫోన్లు, 11 బైక్‌లు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
*కార్తి చిదంబరం కేసులో కేంద్రం, సీబీఐకి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా విదేశీ పెట్టుబడులు పొందేందుకు అనుమతి ఇచ్చిన వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడైన కార్తి చిదంబరంపై సీబీఐ ఆరోపణలు చేస్తూ గతంలో ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.
*అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. గువాహటి-చెన్నై రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి డీఆర్‌ఐ అధికారులు 2.496 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
*వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని ఐసీఎల్ ఫ్యాక్టరీ స‌మీపంలో ఉన్న మైనింగ్ ఏరియాలో చిరుత పులి సంచరిస్తున్నది. చిరుత పులి సంచరిస్తున్న విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందించడంతో.. వాళ్లు చిరుత పులి అడుగులను ఆ ప్రాంతంలో గుర్తించారు. దీంతో మైనింగ్ ఫ్యాక్టరీ ఉద్యోగులతోపాటు మల్కాపూర్, సంగెం గ్రామస్థులు భయాందోళనతో గడుపుతున్నారు.
*జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకున్నది. క‌రెంట్ షాక్ కొట్టి గ్రామ పంచాయితీ కార్మికుడు మృతి చెందాడు. కార్మికుడు ఊశాలు కరెంట్ స్థంభం మీద వీధి దీపాలు పెడుతున్నాడు. అయితే.. ప్రమాదవశాత్తు ఊశాలుకు కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఊశాలు స్థంభం నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
*పాలకొల్లు పట్టణంలోని ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. మంగళవారం రాత్రి స్థానిక రంగమన్నారపేటలోని దేవిదుర్గ ఎలక్ట్రికల్‌ దుకాణంలో ఈప్రమాదం జరిగింది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలో ఎస్సీ గురుకుల బాలుర వసతి గృహంలో బుధవారం విద్యార్థి మృతి చెందాడు.
*నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఓ వ్యాన్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వీరంతా సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు వరంగల్‌ జిల్లా నెక్కొండ వాసులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
* ముంబై నగరంలో అగ్నిమాపక శాఖ సురక్షిత నిబంధనలు పాటించని మూడు డాన్స్ బార్ ల లైసెన్సులను పోలీసులు రద్దు చేశారు
* బాల్కొండ మండలం శ్రీరామ్‌పూర్‌ సమీపంలో మంగళవారం రాత్రి అటవీశాఖామంత్రి జోగురామన్నకు చెందిన కాన్వాయ్‌లోని పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌ను నుంచి ఆదిలాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ముందు వెళ్తున్న ఆటోను మంత్రి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడం వల్ల గానీ, ఆటోను తప్పించే ప్రయత్నంలో గానీ ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలో ఎస్సీ గురుకుల బాలుర వసతి గృహంలో బుధవారం విద్యార్థి మృతి చెందాడు.
* సైదాబాద్ కాలనీలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. సయ్యద్ అనే పదో తరగతి విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* లాలాగూడా పోలీస్ స్టేషన్ పరిధి ఆర్యనగర్‌లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక శ్రీకాంత్ (29) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ సికింద్రాబాద్‌లోని ఓ బంగారం షాప్‌లో పనిచేస్తున్నట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే లాలాగూడా పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
*నల్లగొండజిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాను బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో వ్యానులో ఉన్న 30 గొర్రెలు మృతి చెందాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మార్కెట్లో నిద్రిస్తున్న రైతు కాళ్లపై నుంచి మిర్చి లారీ దూసుకెళ్లింది. తోటి రైతులు అతడిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు.
*స్ర్కూడ్రైవర్లలో బంగారం స్మగ్లింగ్‌ గుట్టును అధికారులు రట్టు చేశారు. మయన్మార్‌ తీసుకొచ్చిన 2.496 కిలోల బంగారాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో బుధవారం అధికారులు స్వాధీ నం చేసుకున్నారు.
*తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడిలో ఓ ట్రాలీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌ అదుపు కోల్పోవడంతో ఆ వాహనం రోడ్డుపక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. రోడ్డుపై నడుస్తున్న పాదచారి ప్రాణాలు తీసింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
*ఎలాగైనా విమానం ఎక్కేయాలనే షార్జా అన్త్రజాతియ విమానాశ్రయం రన్ వే పైకి ఓ భాతరీయుడు దొంగతనంగా చేరుకున్నాడు. అయితే త్వరలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కోసమే ఈ పని చేశానని ఆయన తెలిపారు. ప్రేమ ఎక్కువై ఇలా చేసానని పశ్చాతాపం పదాలని అనుకోవట్లేదని వివరించారు. అతన్ని 26ఏళ్ల ఆర్కే గా అధికారులు గుర్తించారు. విమానాశ్రయ గోడ దూకి దొంగతనంగా రన్ వే పైకి వచ్చిన అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్టు చేసారు. నేను స్వేచ్చా జీవిని మన జీవితం మనది. భారత్ లో ఉంటున్న పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కలుసుకోవాలనే ఉద్దేశం తో ఈ పని చేసాను. దీనికి ఎంత మూల్యం మైనా చెల్లించుకుంటానని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
*కార్తి చిదంబరం కేసులో కేంద్రం సీబీఐ కి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడుల పొందేందుకు అనుమతి ఇచ్చిన వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడైన కారీ చిదంబరం పియా సీబీఐ ఆరోపణలు చేస్తూ గతంలో ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.
* పోలీసుల నిర్లక్ష్యం కారణంగా యువకుడు బలైన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. పశ్చిమ దిల్లీలోని ఓ రోడ్డుపై పోలీసులు రెండు బారికేడ్ల మధ్య కట్టిన వైరు కారణంగా ఈ దారుణం జరిగింది. ప్రైవేటు ట్యాక్సీ సర్వీస్‌లో పనిచేసే 21ఏళ్ల యువకుడు బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై రోడ్డుపై వెళ్తుండగా వీధి దీపాలు కూడా లేకపోవడంతో బారికేడ్ల మధ్య కట్టిన వైరు కనిపించక అలాగే ముందుకెళ్లాడు. దీంతో వైరు మెడకు కోసుకుపోయి తీవ్రంగా గాయపడి మరణించాడు.
* చెన్నై నుంచి దిల్లీకి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. చెన్నైలోని అంర్జాతీయ విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌ అవుతుండగా రన్‌వే పై విమానం టైరు పేలింది. దీంతో సిబ్బంది విమానం టేకాఫ్‌ నిలిపేసి సురక్షితంగా తిరిగి ల్యాండ్‌ చేశారని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ వెల్లడించింది

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com