నేటి నేరాలు-౦౨/౧౩

* కుక్కునూరు మండలం రావికుంట గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. గ్రామానికి చెందిన కృష్ణకుమారి సోమవారం తన భర్తతో బైక్‌ విషయంలో గొడవపడింది. భర్త తన మాట వినకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తన పిల్లలకు తాగించి తర్వాత తానూ తాగింది.
*కృష్ణా జిల్లా పెడనలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్‌ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది. ప్రధాన ద్వారం తలుపు గొళ్లాన్ని కట్‌ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదు దోచుకునే ప్రయత్నం చేశారు. లాకర్లు తెరుచుకోకపోవడంతో బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు ఆ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌, మానిటర్‌ను తీసుకుపోయారు.*ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లికి చెం దిన శతాధిక వృద్ధురాలు రెడ్డబోయిన భద్రమ్మ (115) ఆదివారం మృతి చెందింది. 115 ఏళ్ల వయస్సులోనూ భద్రమ్మ తన పనులు తానే చేసుకునేదని కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
* ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగామరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
* అతి వేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నేవల్‌ ఏరియా గోస్తని గేటు ప్రాంతంలో ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.
* హైదరాబాద్నగరంలోని ఉప్పల్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు నిందితులు పరారీ ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
* గుట్టుచప్పుడు కాకుండా హవాలా లావాదేవీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తోన్న కోటి 40 లక్షల 80 వేల రూపాయలను డీసీపీ రాధా కిషన్ నేతృత్వంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*మేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట్ మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, మినీ వ్యాన్ ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. దీంతో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
* భారీ పేలుడుతో జూబ్లీహిల్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రోడ్‌ నంబర్‌ 48లో ఓ భవన నిర్మాణ స్థలంలో సోమవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఓ బడా పారిశ్రామికవేత్తకు చెందిన ఈ స్థలంలో భవనం నిర్మిస్తున్నారు. బండరాళ్లను తొలగించేందుకు భారీస్థాయిలో జిలెటిన్‌ స్టిక్స్ వినియోగించారు. దీంతో భారీ శబ్దం చేసుకుంటూ పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో తెలీక స్థానికులు పరుగులు తీశారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని ఓ ఇల్లు కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
*హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. 30 మంది స్కూల్ విద్యార్థులు ఉన్న బస్సు ప్రమాదవశాత్తు గోతిలో పడింది. అయితే.. బస్సులోని పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. *ప్రకాశం జిల్లా పామూరులో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. కందుకూరు రోడ్డులోని గంగాభవాని టింబర్ డిపోలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. గస్తీలో ఉన్న పోలీసులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. *నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో దారుణం చోటు చేసుకున్నది. పాత కక్ష్యల నేపథ్యంలో పేర్ల రామలింగం అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో రామలింగానికి తీవ్ర గాయాలయ్యాయి. రామలింగం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
*వీరికి పెళ్లి అయ్యి పట్టుమని పది నెలలు అయ్యింది. ఇరు కుటుంబాల వారు ఆ వేడుకల నుంచి ఇంకా మరువనేలేదు. కుటుంబ పెద్దలు ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారంటూ వధూవరులను కుశల ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. మరో రెండు మూడు నెలల్లో ఓ చిన్నోడో.. చిన్నదాన్నో మీ చేతుల్లో ఉంచుతారంటూ బంధువులు వేళాకోళమాడుతూ సరదా చేస్తున్నారు. ఇంతలోనే ఆ జంటకు జీవితంపైన విరక్తి ఎందుకు కల్గిందో ఏమో.. గదిలోనే ఉరి వేసుకుని తనువు చాలించారు. ఈ హృదయ విధారకర ఘటన కృష్ణాజిల్లా నూజివీడు మండలంలో పల్లెర్లమూడిలో ఆదివారం చోటుచేసుకుంది.
*ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద నివాసం ఉంటున్న రిటైర్డ్‌ మిలటరీ ఉద్యోగి దుగ్గా రంగారెడ్డి (65) ఆత్మహత్య చేసుకున్నాడు.
*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మండలం చంద్రంపేటలో విషాదం చోటు చేసుకున్నది. ఇటుక బట్టీల వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిశా కార్మికులకు చెందిన పిల్లలే వీళ్లు.
జిల్లాలోని ములుగు మండలంలోని కాసిందేవిపేటలో ఉండే కవ్వంపెల్లి సుమలత అవమానం భరించలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది.*జయశంకర్ భూపాలపల్లి
*అసోం రాష్ట్రం హోజాయి జిల్లా పరిధిలోని లుండింగ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో శనివారం రైల్వే ట్రాక్ దాటుతున్న ఏనుగులను గువాహటి సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టింది. దీంతో ఐదు ఏనుగులు మృతి చెందాయని ఈశాన్య సరిహద్దు ప్రాంత రైల్వే సీపీఆర్వో ప్రణవ్ జోషి శర్మ ఆదివారం తెలిపారు.
*తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం ఆదివారం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి రహదారి డివైడర్‌పైకి ఎక్కింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
* విశాఖపట్నం ఆశీలుమెట్ట సమీపంలోని సేఫ్‌హ్యాండ్‌ మహిళా వసతిగృహంలో శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
*కర్నూలు జిల్లా ప్యాపిలి పట్టణం వనడింగేరు కూడలిలో బంగి మధు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్యాపిలిలో వెంకటరెడ్డి తిరునాళ్ల సందర్బంగా సందడిగా ఉన్న ప్రాంతంలో దుండగులు మధు కంట్లో కారం చల్లి, వేటకొడవళ్లతో నరికి చంపేశారు.
*ధూల్‌పేట కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్‌ను ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం శనివారం పట్టుకుంది.
*బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గఢ్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని ర్యాలీ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
*ఆధార్‌ కార్డు తీసుకురాలేదని.. ఓ నిండు చూలాలిని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించడంతో ఆమె అత్యసవర వార్డు బయటే ప్రసవం అయిన ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది.
*పోలీసులు శ్వాస విశ్లేషణ పరీక్ష (డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌) చేస్తున్న సమయంలో తలెత్తిన వివాదం గొడవకు దారితీసింది. వాహనదారుడి స్నేహితుడు పోలీసులపై చేయి చేయిచేసుకోవడంతో వారు ఎదురుదాడికి దిగి అతనిని కిందపడేసి కాలితో తన్నారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులోని చిరంజీవి రక్తనిధి కేంద్రం సమీపంలో బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
*నువ్వు బిడ్డకు జన్మనిస్తే నాకు చెడు రోజులు ప్రారంభమవుతాయంటూ గర్భిణి కడుపుపై తన్నిన దుర్మార్గమిది. మానవత్వం మంటగలిసేలా వ్యవహరించిన ఆ వ్యక్తి బెంగళూరులో పేరొందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఉద్యోగి (టెక్కీ) జి.అనుపమ్‌ దాస్‌. మడివాళ పోలీసులు అతణ్ని శనివారం అరెస్టు చేశారు.
*ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న పది, పన్నెండో తరగతుల బోర్డు పరీక్షల్లో గత నాలుగు రోజుల్లో ఏకంగా పది లక్షల మంది విద్యార్థులు గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇలా లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాయడంలేదు.
*రాజస్థాన్‌లోని బిళ్వార జిల్లా బుత్తేన పట్టణంలో ఘోరం జరిగింది. విషతుల్యమైన హల్వా తిని ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
*వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి ఓ బ్యాంకుకు చెందిన సేవా కేంద్రానికి వెళ్లిన వ్యక్తి మెట్లపై నుంచి పడి మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగింది.
*బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం గఢ్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని ర్యాలీ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
*జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో శుక్రవారం అర్ధరాత్రి ఓ యువతి ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు చూపింది. ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించి ట్రాఫిక్‌ పోలీసులు వెంబడించేలా చేసింది. చివరికి పోలీసులకు ఆ యువతి కారును నిలిపి శ్వాస విశ్లేషణ పరీక్షలు చేసి కేసు నమోదు చేశారు.
*అద్దె గదులు కావాలంటూ వచ్చి.. ఇంట్లోని వారి కళ్లు గప్పి చోరీలకు పాల్పడుతున్న దంపతులను నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఉమామహేశ్వరశర్మ వివరాలు వెల్లడించారు.
*గత నెల 29న కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ వద్ద లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును సైబరాబాద్‌ పోలీసులు చేధించారు.
*తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో శనివారం మావోయిస్టు జంట దశరథన్‌-శెంబగవల్లిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఆటోలో పారిపోతున్న వారిని చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోను, ప్రభుత్వ వ్యతిరేక కరపత్రాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
*పూర్వ ఐపీఎస్‌ అధికారిణి భారతీఘోష్‌పై అరెస్టు వారెంటు జారీ అయింది. ఆమె ఇంట్లో పలుమార్లు సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు ఆమెను తమ ప్రధాన కార్యాలయం భవానీ భవన్‌లో హాజరవ్వాలని కోరారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 26 ఏళ్ల న్యాయ విద్యార్థిని కొందరు దుండగులు దారుణంగా కొట్టిచంపారు. అలహాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌ వెలుపల చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.
*తాను రాసిన లేఖ వెలుగులోకి రావడానికి ఓ యువకుడు ఏటీఎం యంత్రాన్ని తగులబెట్టిన ఘటన నగరంలోని కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. అతడు ఘటనాస్థలంలో వదిలివెళ్లిన లేఖలో ముఖ్యాంశాలను పోలీసులు విశ్లేషించారు.
*స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రమాదవశాత్తు ఈత కొలనులో మునిగి మృతి చెందిన మణికొండలో చోటుచేసుకుంది.
*ముంబయి నగరంలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మన్‌‌ఖుర్ద్‌ ప్రాంతంలోని మాయాహోటల్‌ సమీపంలోని ఓ గోదాంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఉదయం 6:30 సమయంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగి గోదాంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
*కర్నూలు జిల్లా ప్యాపిలి పట్టణం వనడింగేరు కూడలిలో బంగి మధు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్యాపిలిలో వెంకటరెడ్డి తిరునాళ్ల సందర్బంగా సందడిగా ఉన్న ప్రాంతంలో దుండగులు మధు కంట్లో కారం చల్లి, వేటకొడవళ్లతో నరికి చంపేశారు.
*దేశంలో అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గతనెల దిల్లీలో ఎనిమిది నెలల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సరిహద్దు తిప్పాపురం అవుట్‌పోస్టు సమీపంలో ఆదివారం ఉదయం ప్రెషర్‌ బాంబు పేలి ఓ జవాను దుర్మరణం చెందారు. తిప్పాపురం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని పామేడు వరకు రహదారి నిర్మాణంలో భాగంగా సరిహద్దులో పోలీసు అవుట్‌పోస్టును ఏర్పాటు చేశారు.
*ఈజిప్టులోని కల్లోలిత ఉత్తర సినాయ్‌ ప్రాంతంలోని ముష్కరుల శిబిరాలపై సైన్యం ఆదివారం తూటాలు కురిపించడంతో16 మంది ముష్కరులు హతమయ్యారు. 66 ఉగ్రశిబిరాలు, ఆయుధ స్థావరాలు, వాహనాలూ ధ్వంసమయ్యాయి. 30 మంది అనుమానిత ఉగ్రవాదులనూ సైన్యం అదుపులోకి తీసుకుంది.
* దాదాపు 11 సంవత్సరాల క్రితం విజయవాడలోని వసతిగృహంలో హత్యకు గురైన ఆయేషా మీరా కేసు పునర్‌ విచారణ చేపట్టిన సిట్ బృందం ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి వచ్చింది.
*గుంటూరులో రెణ్నెల్ల క్రితం అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై అంతా చూస్తూ ఉండగా పాత కక్షలతో ఓ రౌడీషీటర్‌ని హతమార్చగా ఆదివారం ఇదే తరహాలో నరసరావుపేటలో మరో హత్య జరిగింది.
* కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆర్‌.రామకృష్ణయ్య వ్యభిచారగృహం నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. బెంగళూరులోని దొడ్డబిదకల్లు వేణుగోపాలనగరలో కొత్తగా నిర్మించిన ఇంట్లో పడుపు వృత్తి జరుగుతోందని వచ్చిన సమాచారంతో సీసీబీ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడులు జరపడంతో ఈయన వ్యవహారం బయటపడింది.
*జమ్ముకశ్మీర్‌లోని సుంజ్వాన్‌ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో మృతిచెందినవారి సంఖ్య 6కు పెరిగింది.
*అప్పుల బాధతో రంగారెడ్డి జిల్లాలో ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు.
*అసోంలోని హోజాయ్‌ జిల్లా లుమ్డింగ్‌ అటవీ ప్రాంతంలో రైలు ఢీకొని ఐదు ఏనుగులు దుర్మరణం పాలయ్యాయి. హబైపుర్‌ వద్ద గజరాజుల గుంపు పట్టాలు దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
*రహదారి వెంబడి నడిచివెళ్తున్న ఓ వృద్ధుడిని తన వాహనంతో ఢీకొట్టిన ఓ చోదకుడు..అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడిని ఆసుపత్రి ఎదుట పడేసి వెళ్లిపోయాడు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
*డుంకా వద్ద ఉన్న నదిలో ప్రమాదవశాత్తు జీపు పడిపోయింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
*పిల్లలు పుట్టలేదని.. అదనపు కట్నం తేవాలని అత్తింటివారు పెడుతున్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, గూడూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
* సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం భానూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిట్టీల వ్యవహారంలో అనిత, హైమసుధ అనే ఇద్దరి మహిళల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో అనిత అనే మహిళను హైమసుధ గొంతుకోసింది. ఆపై ఆమె సైతం ఆత్మహత్య చేసుకుంది. హైమసుధ దాడిలో గాయపడిన అనితను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com