నేటి నేరాలు-౦౨/౧౪

* కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని మద్దూరు కరకట్టపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
* కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంకలో విషాయం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో సర్పంచ్ సనకా రాంబాబు(54) మృతి చెందారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అక్కడకు చేరుకుని రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించారు.
* నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం పిప్రికి చెందిన మేకల కాపరి ఒడ్డె సంపంగి ఎల్లయ్య(40) మంగళవారం చిరుతపులి దాడిలో మృతిచెందినట్లు ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డి తెలిపారు.
* కర్నూలు నగరంలో దొంగలు పట్టపగలే మరోసారి రెచ్చిపోయారు. గత కొంతకాలంగా నగరంలో పట్టపగలే చోరీలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరింత ఎక్కువవుతున్నాయి. వెంకటరమణ కాలనీలోని ఎస్‌బీఐ మేనేజర్‌ సుగుణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళం పగులగొట్టి భారీ చోరీకి పాల్పడ్డారు. దీంతో బాధితురాలి కర్నూలు టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* టిప్పర్‌ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతిచెందిన సంఘటన ఒడిశా రాష్ట్రం గుమ్మాసమితి అర్తాడ గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. అనుకుంబ గ్రామం నుంచి ఇటుకల లోడుతో అర్తాడ మీదుగా ఘాట్‌ రోడ్డు పైనుంచి వస్తున్న టిప్పర్‌ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది.
*హైదరాబాద్‌, దిల్లీ, ముంబయిలతో పాటు మెట్రో నగరాల్లో హవాలా దందా నిర్వహిస్తున్న హైదరాబాదీ జయేష్‌ కుమార్‌ పటేల్‌ విజయవాడ, తిరుపతి, విశాఖలలోనూ హవాలా వ్యాపారం కొనసాగిస్తున్నాడని పోలీస్‌ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
* విశాఖపట్టణం సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతైన విషాద సంఘటన విశాఖ నగరంలో జరిగింది.
* ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంమండలంలోని చినకమలాపురానికి చెందిన తెల్లం రమాదేవి(21) అనుమానస్పద స్థితిలో ఈనెల 11న హైదరాబాదులో మృతి చెందింది. మంగళవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సుమారు 15ఏళ్ల క్రితం అలిపిరి వద్ద హత్యాయత్నానికి పాల్పడ్డ కేసుల్లో నిందితులైన మావోయిస్టు దంపతులు పోలీసులకు చిక్కారు. వీరు పట్టుబడిన సమయంలో తప్పించుకున్న మరో పదిమంది మావోల కోసం ఏపీ–తమిళనాడు సరిహద్దుల్లో తమిళనాడు క్యూ బ్రాంచ్‌ పోలీసులు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.
* హైదరాబాద్మలక్‌పేట్‌ యశోద ఆస్పత్రిలో మరో ఘోరం జరిగింది. వారం రోజుల క్రితం ఓ మహిళ ప్రసవానికి వచ్చింది. నాలుగు రోజుల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆరోగ్యంగా ఉన్న ఆమె బుధవారం చనిపోయిందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యానికి గురై.. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు
* భార్యఅత్త వేధింపులు భరించలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
*ఆదమరిచి నిద్రపోతున్న వేళ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు! ఇళ్లలో ఉన్న తండావాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని పరుగున బయటికివచ్చారు. రక్తసిక్తమైన ఇంటి వరండాలో ఉప సర్పంచ్‌ మృతదేహం ఛిద్రమై ఉంది. ‘మా ఆయనను బాంబు పేల్చి చంపేశార’ని అతడి భార్య విలపిస్తోంది. నిద్రిస్తున్న అతడి భుజం దగ్గర పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని పెట్టి అంటించి చంపేశారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాగార్జునపేటతండాలో ఈ దారుణం జరిగింది.
*అంబులెన్స్‌ డ్రైవరు వచ్చేసరికి సమయం పడుతుందని అప్పటివరకు ఆగలేక మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తరలించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగిలో జరిగింది.
* కాకినాడలో మంగళవారం రాత్రి ప్రేమోన్మాది ఓ యువతిపై దాడి చేయడంతో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. దాడిని అడ్డుకున్న నలుగురిపై నిందితుడు మారణాయుధంతో దాడి చేయడంతో వారు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
*హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించి 8నెలల గర్భిణి దారుణహత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. హతురాలిని బిహార్‌కు చెందిన బింగీ అలియాస్‌ పింకీగా గుర్తించినట్లు వెల్లడించారు.
*విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో చిట్యాల మండలంలోని ఓ జిల్లా పరిషత్తు పాఠశాలలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం రహస్య విచారణ నిర్వహించింది.
*తిరుమలగిరి(సాగర్‌) మండలం చింతలపాలెం గ్రామ పంచాయతీ నాగార్జునపేటతండా ఉప సర్పంచి ధర్మనాయక్‌(45) హత్య మండలంలో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు విచారణ జరిపి ఇది అక్రమ సంబంధం కారణంగానే జరిగిందని తేల్చిచెప్పారు.
* కాళేశ్వరంలో పురుగుల మందు తాగి హన్మకొండకు చెందిన ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
*తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా యలేరాంపుర గ్రామ శివారులోని చెరువులో ఇద్దరు నీటమునిగి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకొంది.
*నర్సింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
*జంటనగరాలు, శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో పకడ్బందిగా రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నిందితుడు మంత్రి శంకర్‌ ముఠాలోని మరో ఇరువురు నిందితులను మంగళవారం దక్షిణ మండలం టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు.
*కాకినాడలో మంగళవారం రాత్రి ప్రేమోన్మాది ఓ యువతిపై దాడి చేయడంతో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. దాడిని అడ్డుకున్న నలుగురిపై నిందితుడు మారణాయుధంతో దాడి చేయడంతో వారు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
*ఇంటి యజమానిపై ఉన్న కోపంతో అతి కిరాతకంగా ప్రవర్తించాడో యువకుడు. యజమాని కొడుకును చంపేసి నెలరోజుల పాటు చిన్నారి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో దాచిపెట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన దేశరాజధానిలో చోటుచేసుకుంది.
*సుదీర్ఘ విరామం త‌ర్వాత పోలీసుల‌కు మావోయిస్టుల‌కు మ‌ద్య జ‌రిగిన ఎదురుకాల్పులతో ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిప‌డింది. ఏవోబీలోని క‌టాఫ్ ఏరియా జొడొంబో పంచాయ‌తీ టిక‌ర్‌పాడు అట‌వీ ప్రాంత‌లో మావోయిస్టులు నిర్వహిస్తున్న శిభిరాన్ని ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, డీవీఎఫ్ బ‌ల‌గాలు, ఆంధ్రా గ్రేహౌండ్స్ బ‌ల‌గాలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. అయితే ఈ సంఘ‌ట‌న నుంచి మావోయిస్టు పార్టీకి చెందిన నాయ‌కులు పెద్దయెత్తున త‌ప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో వారి కోసం భారీ ఎత్తున బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి.
*శివరాత్రి పర్వదినం రోజున మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా తయారు చేసిన ప్రసాదం తిని 1500 మంది అస్వస్థతకు గురయ్యారు. బడ్‌వానీ పట్టణంలోని ఓ ఆశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆశ్రమంలో కిచిడీ, మిఠాయి తిన్న వెంటనే అస్వస్థతకు గురైన భక్తులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
*గోనె సంచుల్లో మహిళ మృతదేహం ముక్కల కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. మృతురాలిని బిహార్‌ రాష్ట్రం బంకా జిల్లా మొహోనామల్తీ గ్రామానికి చెందిన బింగీ అలియాస్‌ పింకీ(32)గా గుర్తించారు. 8 నెలల గర్భిణి అయిన ఆమెను… వివాహేతర సంబంధం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులతోపాటు, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి అంతమొందించినట్లు తేలింది.
*కేరళలోని కన్నూర్‌లో కాంగ్రెస్‌ యువజన విభాగం నాయకుడు సుహెయిబ్‌ దారుణ హత్య పట్ల పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. సుహెయిబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
*మంచం కింద బాంబుపేల్చి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
*కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ శిబిరంపై దాడికి విఫలయత్నం చేసి, సమీపంలోని ఒక భవనంలో దాగిన ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. దీంతో 32 గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్‌ ఎట్టకేలకు ముగిసింది.
*ఏడేళ్ల బాలుడిని దారుణంగా హత్యచేసి ఓ సూటుకేసులో కుక్కిపెట్టి ఉన్న ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. వాయవ్య దిల్లీకి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌లో బాలుడి శవం ఉన్న సూట్‌కేసును పోలీసులు మంగళవారం కనుగొన్నారు.
* కేరళలోని కొచ్చిన్‌ నౌకా నిర్మాణ కేంద్రంలో మరమ్మతులు జరుగుతున్న ఓ నౌకలో మంగళవారం పేలుడు సంభవించింది. దీంతో ఐదుగురు ఒప్పంద కార్మికులు దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడ్డారు.
*ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గుమ్మసమితి పరతాడ పంచాయతీ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గిరిజనులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నలుగురు మహిళలు. వీరంతా కూలీలే. సమితిలో మారుమూలనున్న ఒనుకొంబ నుంచి ఇటుకలను పర్లాఖెముండికి తీసుకువస్తుండగా నువాఝొరో ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ట్రిప్పర్‌ అదుపుతప్పి లోయలో పడింది.
* శివరాత్రి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ముక్కంటి దర్శనం చేసుకొని మంగళవారం ఉదయం ఆరింటి ప్రాంతంలో ఆటోలో వస్తున్న వారిని టిప్పర్‌ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురితో పాటు ఆటోడ్రైవర్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
*ఆట వస్తువు అనుకుని కొబ్బరినూనె డబ్బా మూతను నోట్లో పెట్టుకుని మింగేయడంతో అనారోగ్యం పాలైన తొమ్మిది నెలల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. విశాఖ రైల్వే న్యూకాలనీ దరి వెంకటేశ్వర కాలనీలో నివసించే కారు డ్రైవర్‌ అల్లంపల్లి కిశోర్‌కు తొమ్మిది నెలల పాప చంద్రిక ఉంది. సోమవారం రాత్రి ఇంట్లో ఆడుకుంటూ కొబ్బరినూనె డబ్బా మూతను మింగేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు విడిచింది.
*పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కనుకులలో ఓ బాలుడిపై మరో బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎనిమిది సంవత్సరాల బాలుడిని అదే కాలనీకి చెందిన పదహారేళ్ల బాలుడు ఎవరూ లేని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది.
* నిజామాబాద్‌ జిల్లాలోని యడపల్లి మండలం జానకంపేట వద్ద చిరుతపులి మృతి చెందింది. అబ్బాపూర్‌ గ్రామపరిధి అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి రోడ్డు పైకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
* కలసపాడు మండలంలోని గిద్దలూరు ప్రధాన రహదారిలో మంగళవారం టెంపో వ్యాను అదుపు తప్పి బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
*రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్‌నగర్ మండలం రామేశ్వరం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఊరిలోని శివాలయం ముందు ఉన్న కోనేరులో స్నానానికి వెళ్లిన నందిగామ వినోద్ (యువకుడు మునిగిపోయాడు. గు*
*హైదరాబాద గరంలోని పంజాగుట్టాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు వ్యాను డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com