నేటి నేరాలు-౦౩/౩౧

*అనంతపురం మండలం కందుకూరులో హత్యకు గురైన శివారెడ్డి మృతదేహాన్ని వైకాపా రాప్తాడు సమన్వయ తోపుర్తి ప్రకాష్ రెడ్డి సర్వజన ఆస్పత్రి పరిశీలిస్తున్నారు.
*కృష్ణాజిల్లా నూజివీడు ఉషా బాలానగర్ లో ఆర్ ఎం పీ డాక్టర్ పామర్తి సురేష్ ర అనుమానాస్పద మృతి.
*వనపర్తి జిల్లా మాదనపురం మండలం కొన్నోర్ గ్రామంలో రైలు కింద పది కూర్మన్న అనే వ్యక్తీ మృతి.
*గుంటూరు జిల్లా నగరం మండలామ్ ధూళిపూడి గ్రామంలో ఎకరం వారి కుప్పను దగ్దం చేసిన దుండగులు.
* నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పులిగిలిపాడు క్వారీలో అక్రమ బ్లాస్టింగ్‌ చేపట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా క్వారీలో కూలిపనులకు వెళ్లిన ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
* పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం శివగిరిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి నలుగురు మృతి చెందారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న శివగిరి గ్రామస్థులు మృతదేహాలను వెలికి తీసి అధికారులకు సమాచారమందించారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌వాసులుగా అనుమానిస్తున్నారు. వీరు నిన్న పాపికొండలు సందర్శనకు వచ్చారు. శివగిరి కాటేజీల్లో బసచేశారు. ఉదయం స్నానం కోసం గోదావరి నదిలో దిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
* ఓలా క్యాబ్‌ డ్రైవరు హరినారాయణ్‌(35)ను ఇటీవల దారుణంగా హత్య చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కారును కాజేసి అమ్మేసి…ఖరీదైన దుస్తులు కొనుక్కునేందుకే వీరంతా కలిసి ఆ డ్రైవరును చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.
*పంజాబీ పాప్‌ గాయకుడు దలేర్‌ మెహందీకి 2003 మానవుల అక్రమ రవాణా కేసులో ఊరట లభించింది. మార్చి 16న కింది కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షను అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తి శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేశారు.
*ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు పాల వ్యాన్‌ను ఢీకొట్టి, 20 అడుగుల లోతైన కందకంలో పడిపోయింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
*పొలంలో అడవి పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘానికి గురైన తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటన వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం బుద్దారంలో చోటు చేసుకుంది.
*ప్రేమించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తన కారణంగా తల్లి, భార్య పోలీసు స్టేషన్‌కు రావాల్సి వచ్చిందనే బాధతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
*అప్పుల బాధతో జనగామ జిల్లాలో రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ మండలం సిద్దెంకి గ్రామానికి చెందిన ఆవుల నర్సిరెడ్డి(55), లక్ష్మి(51) కుటుంబ అవసరాలు, వ్యవసాయ పెట్టుబడులు, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం తమకున్న ఆరు ఎకరాల్లో నాలుగెకరాలు విక్రయించారు.
* కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన బీటీ-3 పత్తి విత్తనాలను సాగు చేయించిన రెండు కంపెనీల యాజమాన్యాలపై గురువారం కేసులు నమోదు చేసినట్లు జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్‌ తెలిపారు.
*భూగర్భ తాగునీటి పైపులైన్ల పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రహరీపై ఉన్న రాళ్లు పడి ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం గుంటూరు నగరం పొన్నూరు రోడ్డులోని చంద్రబాబునాయుడు కాలనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
* గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కలుషిత నీరు తాగి మృతి చెందిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 21కు చేరింది. పాతగుంటూరులోని సోమువారి వీధికి చెందిన టి.లక్ష్మీకుమారి(63) రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.
*బెంగళూరు నగర పరిధి హోసూరు మార్గ సైనిక ప్రాంగణంలో ఈ నెల 23న జరిగిన పంకజ్‌(26) అనే సైనికుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
* ఓ మహిళ స్నానం చేస్తుండగా సెక్యూరిటీ గార్డు వీడియో చిత్రీకరించిన దారుణ ఘటన శ్రీకాకుళం రిమ్స్‌లో కలకలం రేపింది. జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడ చికిత్స పొందుతున్నారు.
*ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దులో పెద్దఎత్తున పాలస్తీనా ప్రజలు జరిపిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
* గుజరాత్‌లోని భావనగర్‌లో ఓ దళిత యువకుడు హత్యకు గురయ్యాడు. గ్రామంలో గుర్రంపై తిరుగుతున్నాడన్న కారణంతోనే.. తమ కుమారుడిని అగ్రవర్ణాల యువకులు హతమార్చారని మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*ఫ్రాన్స్‌లో ప్రవాసంలో ఉన్న అజర్‌బైజాన్‌ దేశ పాత్రికేయుడు రహీమ్‌ నమాజోవ్‌, ఆయన భార్యపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు.
*పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో శుక్రవారం రాత్రి వృద్ధ దంపతుల హత్య కలకలం రేపింది. మంత్రాలు చేస్తున్నారనే నేపంతోనే తూముల నంబయ్య (65), కమలమ్మ (60)లను సమీప బంధువు మారణాయుధాలతో దాడి చేసి హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరిపల్లిలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో 12 మంది నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టుచేశారు.
* మొన్న టైర్లు పేలిన ఘటన మరిచిపోకముందే మరోసారి ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లడానికి టేకాఫ్‌ తీసుకున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పావుగంటలోనే తిరిగి విమానాశ్రయానికి తీసుకొచ్చి దింపేశారు.
*విద్యుదాఘాతంతో కెనడా దేశానికి చెందిన ఓ యువకుడు మరణించాడు. సహచరులతో కలిసి సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తాకి దుర్మరణం పాలయ్యాడు.
* థాయిలాండ్‌లో 47 మందితో ప్రయాణిస్తున్న బస్సుకు నిప్పు అంటుకోవడంతో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు కాలిన గాయాలతో బయటపడ్డారు. మృతులంతా మయన్మార్‌కు చెందిన కూలీలే. థాయిలాండ్‌లో పని చేయడానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రపంచంలో లిబియా తరువాత అంత అధ్వానంగా రహదార్లు గల దేశం థాయిలాండ్‌ అని ఐక్యరాజ్యసమితి నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ సుమారు 30 లక్షలమంది వలసకార్మికులు పనిచేస్తున్నారు.
*వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ – పోలీసు అధికారి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రఘునాథపాలెం ఏఎస్‌ఐ భాస్కర్ మృతి చెందాడు. రఘునాథపాలెం ఏఎస్‌ఐగా భాస్కర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
*వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండలం బుద్దారం గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. బుద్దారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య, ఆయన కుమారుడు సంతోష్ శుక్రవారం సమీపంలోని మొక్కజొన్న చేనుకు వెళ్లారు. అయితే… ప్రమాదవశాత్తూ అక్కడ ఉన్న విద్యుత్ తీగెలు తగలడంతో షాక్ కు గురై వారిద్దరూ మృతిచెందారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
*అడ్డు వచ్చిన అడవి పందిని ఢీకొని వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అడవిపంది సైతం మృతి చెందింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన షేక్‌ బాబామియా, షేక్‌ సలీమ్‌, ఎస్‌కే బాబా కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 26న కుమురం భీం జిల్లా జైనూర్‌ మండలం జంగాంలో ఓ వివాహానికి వచ్చారు.
*ఆన్‌లైన్‌లో ఆర్డరు చేసిన స్మార్ట్‌ఫోన్‌ అనుకున్న సమయానికి అందలేదన్న ఆగ్రహంతో ఓ మహిళ వీరంగం సృష్టించింది. ఉన్మాదిగా మారి.. డెలివరీ ఉద్యోగిని 20 సార్లు కత్తితో పొడిచింది. దేశ రాజధాని దిల్లీలోని నిహాల్‌ విహార్‌లో ఈ నెల 21న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
*వెనెజువెలాలో జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలు చేసిన ప్రయత్నం.. 68 మంది ప్రాణాలను బలితీసుకుంది. వాలెన్సియా పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది.
*ఆ ఊరి జనం ప్రస్తుతం పిల్లి అంటేనే గజగజ వణికిపోతున్నారు. కారణం.. రేబీస్‌ వ్యాధి సోకిన ఓ మార్జాలం కరవడంతో ఇద్దరు స్థానికులు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు.
*ఆసరా పింఛను కోసం వరుసలో నిరీక్షించి ఓ వృద్ధురాలు మృత్యువాతపడిన ఘటనిది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌ గ్రామానికి చెందిన ఎరుకల బక్కవ్వ(67) పింఛన్‌ తీసుకుందామని గురువారం ఉదయమే తపాలా కార్యాలయానికి వెళ్లింది. ఉదయం నుంచి ఆహారం తీసుకోని కారణంగా వరుసలో నిలబడి ఆమె నీరసించిపోయింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండంతో మధ్యాహ్నం వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
*కడప జిల్లాలోని పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖలోని నగదు అధికారి (క్యాషియర్‌) గురుమోహన్‌రెడ్డి రూ.91.49 లక్షలతో పరారయ్యారు.
*కోర్టుధిక్కరణ కేసులో గుంటూరు జిల్లా నర్సరావుపేట పురపాలక సంఘం కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌, పట్టణప్రణాళిక (టౌన్‌ప్లానింగ్‌) విభాగం సూపర్‌వైజర్‌ టి.సాంబయ్యపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
*కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇళ్లను కూల్చివేసిన వ్యవహారంలో అప్పటి విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, ఐఏఎస్‌ అధికారి వీరపాండ్యన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
* ఐడీబీఐ బ్యాంకు చేపల రుణాల కుంభకోణంలో సీబీఐ తాజాగా మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐడీబీఐ బ్యాంకు పాలంగి శాఖ మంజూరు చేసిన రూ.743 కోట్ల రుణాల్లో అవకతవకలకు సంబంధించి కేసులు పెట్టింది.
* అనుమతి లేకుండా, నాణ్యతా ప్రమాణాలు లోపించిన టానిక్‌లను అక్రమంగా తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం దాడి చేశారు. సుమారు రూ.25లక్షల విలువైన టానిక్‌లతోపాటు ముడిసరకులు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
*ఐడీబీఐ బ్యాంకు చేపల రుణాల కుంభకోణంలో సీబీఐ తాజాగా మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐడీబీఐ బ్యాంకు పాలంగి శాఖ మంజూరు చేసిన రూ.743 కోట్ల రుణాల్లో అవకతవకలకు సంబంధించి కేసులు పెట్టింది.
*కంచికచర్లలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి పాలవ్యానును ఢీకొట్టింది. దీంతో బస్సు చెరువుకట్టపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడవైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
*కోపమే అనేక అనర్థాలకు కారణం అని పెద్దలు చెబుతుంటారు. చిన్న చిన్న వాటికి విచక్షణ కోల్పోయి చేయరాని తప్పు చేసి, ఆ తర్వాత పశ్చాత్తాప పడినా ప్రయోజనం ఉండదు. ఫ్లిప్‌కార్ట్‌లో బుక్‌ చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌ను డెలివరీ బాయ్‌ ఆలస్యంగా తీసుకొచ్చాడని ఓ 30ఏళ్ల మహిళ అతనిపై దాడి చేసి 20సార్లు కత్తితో పొడిచింది. ఈ దారుణ ఘటన దిల్లీలోని నిహల్‌ విహార్‌లో చోటు చేసుకుంది.
*మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన సోదరుడితో కలిసి వెళ్తున్న యువతిని అపహరించిన కొందరు కీచకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
*రోజ్‌వ్యాలీ పోంజీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆ సంస్థకు చెందిన రూ.2,300 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద 11 రిసార్ట్‌లు, 9 హోటళ్లు సహా బంగాల్‌లో రోజ్‌వ్యాలీకి చెందిన భారీ ఎత్తున భూములను ఎటాచ్‌ చేసింది.
*కృష్ణాజిల్లాలోని నందిగామ దగ్గర హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంచికచర్ల చెరువుకట్టపై మినీవ్యాన్ – ప్రైవేట్ప బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందాడు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన బస్సు.. మినీ వ్యాన్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com