నేటి నేరాలు-౦౪/౧౨

* కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లిలో ఓ పోలీస్ అధికారి ఇంట్లో చోరీ జరిగింది. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోని రూ. 47 వేల నగదు, రెండు తులాల బంగారంను అపహరించుకుపోయారు. చోరీ జరిగిన ఇళ్లు గజ్వేల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ ఆనంద్ గౌడ్ నివాసంగా గుర్తింపు.
*అనంతపురం జిల్లా తాడిప్రత్తిలో వైఎస్సార్‌ సీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రమేష్‌ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్‌ లైసెన్స్‌ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. *తూర్పు రాజస్థాన్‌లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
*పడవ బోల్తా పడ్డ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలైన విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. నందివాడ మండలం తమిరిశ గ్రామంలోగల చేపల చెరువులో పడవ ద్వారా మేత వేస్తుండగా ప్రమాదవశాత్తూ అది బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు నీళ్ళల్లో మునిగి చనిపోయారు. అనంతరం గమనించిన గ్రామస్తులు చెరువులోని మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు.
* విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి వద్ద లభించిన డైరీ ఆధారంగా పోలీసులు వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. యువతి తన వద్ద ఉన్న డైరీలో పేరున్న పేజీని చింపివేయడంతో ఆమె ఎవరో కనుక్కోవడానికి పోలీసులకు కష్టతరంగా మారింది. మృతి చెందిన యువతి వయసు 20 నుంచి 24 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
* జనం రద్దీగా ఉన్న ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొంటూ సుమారు 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతరాష్ట్ర దొంగను ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి 12 తులాల బంగారం, ఇండికా కారు, రూ. 18వేల నగదు, కొంత విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
* అవినీతి నిరోదక శాఖ అధికారులకు పటాన్‌చెరు ఏఈఈ ఉపేందర్ చిక్కాడు. వ్యక్తి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బాచుపల్లి వద్ద పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఉపేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
* జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం పైడిపల్లిలో విషాదం చోటు చేసుకున్నది. వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందారు. మృతులు ఛత్రపతి(10), హర్షవర్ధన్(7) గా పోలీసులు గుర్తించారు.
* ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొన్నది. ఈ ఘటన బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం పైడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
* తన కుమారుడి కేసు విషయంలో తనని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్‌ఐ అనవసరంగా దాడి చేసి గాయపరిచాడని కేసరిగుంట కాలనీకి చెందిన కొండయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
* ఓ అనుమానపు భర్త ప్రధానోపాధ్యాయురాలైన భార్యపై బడిలోనే కత్తితో దాడిచేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా ముస్లాయిపల్లిలో చోటు చేసుకుంది.
* రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లు భావించిన సంఘటన హత్య కేసుగా మలుపు తిరిగింది. ప్రియుడి మోజులో పడిన మహిళ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను హత్య చేయించింది. రూ.2లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న మరో నలుగురు నిందితులు ఆమె భర్తను దారుణంగా చంపేసి రైలు పట్టాలపై పడేశారు.
*మతి స్థిమితం లేని ఓ వ్యక్తి ఖాళీ బస్సు నడిపి హల్‌చల్ చేశాడు. మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ రవాణా సంస్థ(ఎంఎస్‌ ఆర్టీసీ)కు చెందిన ఖాళీ బస్సు బైసార్‌ డిపో నుంచి బయలుదేరింది. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కొద్దిదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్‌, కండక్టర్‌ ఇద్దరూ టీ తాగడానికి బస్సును కాసేపు రోడ్డు పక్కన నిలిపారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడి వచ్చి బస్‌ను స్టార్ట్‌ చేసి నడుపుకొంటూ వెళ్లిపోయాడు.
*పదోతరగతి చదువుతున్న బాలుడు.. జల్సాలకు అలవాటు పడి.. వాటిని తీర్చుకోవడానికి పదకొండు దొంగతనాలు చేసి ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు.
*పాఠశాలకు వెళ్తున్నప్పటి నుంచి ప్రేమ పేరుతో వేధిస్తూ.. లైంగిక దాడికి పాల్పడి యువతి వివాహాన్ని చెడగొట్టిన సంఘటన జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
*ఓ అనుమానపు భర్త ప్రధానోపాధ్యాయురాలైన భార్యపై బడిలోనే కత్తితో దాడిచేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా ముస్లాయిపల్లిలో చోటు చేసుకుంది.
*యూఏఈలో దాదాపు రూ.1300 కోట్ల కుంభకోణానికి సంబంధించి.. దోషులుగా తేలిన ముగ్గురు భారతీయులకు అక్కడి కోర్టు 517 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది.
*పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)కు వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, అతని బంధువు మెహుల్‌ ఛోక్సీలు రూ.11 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన వ్యవహారంలో- సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలోని 31 బ్యాంకుల సహవ్యవస్థ నుంచి ఛోక్సీ పొందిన రూ.5,280 కోట్ల రుణాలపై దృష్టి సారించింది.
*వ్యాపారం పేరుతో రుణం తీసుకొని వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించిన నేరానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన రిటైల్‌ వ్యాపార సంస్థ నిర్వాహకుడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ మొదలుపెట్టింది.
*కావేరి నిర్వహణ మండలి(సీఎంబీ) ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళనల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ నిరసనకారుడు బుధవారం రైలు ఇంజిన్‌పైకి ఎక్కినప్పుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు.
*గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడిలో మంగళవారం రాత్రి పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాలు కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఇందులో ఓ వర్గానికి చెందిన ఆర్మీ ఉద్యోగి బాబి తన తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపినట్లు పొన్నూరు సీఐ తిరుమలరావు బుధవారం తెలిపారు.
*కోర్టు ధిక్కరణ కేసులో తిరుపతిలోని ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్‌) చీఫ్‌ జనరల్‌ మేనేజరు (సీజీఎం, హెచ్‌ఆర్‌డీ), కడపలోని ఏపీఎస్పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ)లకు 30 రోజుల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.రెండు వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
*సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వద్ద పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. గుట్కా తరలిస్తున్న మూడు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు బీదర్ నుంచి గుట్కా తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నిన్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సైతం గుట్కా భారీ స్థాయిలో పట్టుబడిన విషయం తెలిసిందే.
*మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ మండలం ముసలాయపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోనే మహిళా హెడ్‌మాస్టర్‌పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో హెడ్‌మాస్టర్ కన్యాకుమారి తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు బాధితురాలని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో భర్త రమణారెడ్డి భార్యపై దాడి చేసినట్లుగా సమాచారం.
*కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తి యాచకురాలిపై కర్కశంగా వ్యవహరించాడు. అత్యాచారం చేయడంతోపాటు..హత్య చేసి పారిపోయాడు. హైదరాబాద్‌ బాలానగర్‌ ఠాణా పరిధిలో సోమవారం రాత్రి ఘటన జరిగింది.
*ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు రాగా పోలీసులు అనుమతించకపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది.
*యువతిపై సామూహిక అత్యాచారం, కస్టడీలో ఉన్న ఆమె తండ్రి మరణానికి సంబంధించిన కేసులో భాజపా శాసనసభ్యుడు కుల్‌దీప్‌ సింగ్‌ సెంగర్‌ సోదరుడు అతుల్‌ సింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
*యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నర్సుగా పనిచేస్తున్న ఓ భారతీయ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేరళకు చెందిన సుజాసింగ్‌ ఆదివారం మధ్యాహ్నం ఇక్కడి అల్‌ అయిన్‌ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.
*మేడపై నుంచి పడిన ఘటనలో ఓ బాలిక నడుములో కర్ర దిగబడి ఉదరం నుంచి బయటికి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన పత్తి ప్రత్యూష ఎనిమిదో తరగతి చదువుతోంది.
*కడప జిల్లా ముద్దనూరు మండలం కె.కొత్తపల్లె గ్రామ సమీపంలోని ఓ ప్రైవేటు గోదాములో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
*బంగారు ఆభరణాల ఎగుమతి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలపై కోల్‌కతాలో అరెస్టయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సంజయ్‌కుమార్‌ అగర్వాల్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కోల్‌కతా డీఆర్‌ఐ అధికారులు అతని నుంచి 16 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
*కొద్దిరోజుల్లో పెళ్లి కావలసిన యువతి.. తల్లీతండ్రీ తిరుపతి వెళ్లారు. ఇంతలో ఏమైందో ఏమో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ యువతి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయింది.
*ఓ ప్రబుద్ధుడు ఒకరికి తెలియకుండా మరోటి ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకుని మూడో భార్యతో కాపురం చేస్తుండడంతో తాము మోసపోయినట్లు గ్రహించిన మొదటి ఇద్దరు భార్యలు ఆయన ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటన ఇది.
*వనపర్తి జిల్లా కొత్తకోటలో తొమ్మిదేళ్ల బాలుడిని అపహరించిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా కొద్దిగంటల్లోనే పట్టుకున్నారు. మహారాష్ట్రలోని పుణెలో నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలుడిని విడిపించారు.
*ప్రయాణికులను సురక్షితంగా గమ్యం స్థానానికి చేర్చిన ఓ డ్రైవర్‌.. అదే బస్సు స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన మంగళవారం ఉదయం 11.10 గంటలకు హైదరాబద్‌ ఎంజీబీఎస్‌లో చోటుచేసుకుంది.
* రాష్ట్ర అభివృద్ధి కోసం రమేష్‌ హాస్పిటల్స్‌ రూ.10 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేసింది. రమేష్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ మద్దిపాటి సీతారామ్మోహనరావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌బాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు చెక్‌ అందచేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
*గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో స్వయంభు పోలేరమ్మ తిరునాళ్ల వైభవంగా మొదలైంది. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తిరునాళ్లలో ముఖ్య ఘట్టమైన శిడిమాను ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు శిడిమానుకు జీడికాయలను విసిరి తమభక్తిని చాటుకున్నారు.
*పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్ సర్వీస్‌రోడ్డులో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన బైక్.. డీసీఎం లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను సందీప్(21), వనజ(19)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
* నల్లగొండ జిల్లా ట్రాక్టర్ ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ బుచ్చిరెడ్డి, కూలీల మేస్త్రీ బుజ్జిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 6న పీఏపల్లి మండలం పడమటితండా వద్ద ట్రాక్టర్ కాలువలో పడిన దుర్ఘటనలో 9 మంది కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే.
*వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలకు బూర్గంపాడు మండలం ఇరవెండి పంచాయతీలోని చింతకుంటకి చెందిన మడకం కన్నయ్య (32) అనే గిరిజనుడు మృతి చెందాడు.
*మహబూబ్‌నగర్ జిల్లా మఖ్తల్ మండలంలో దారుణం జరిగింది. భార్యను కట్టుకున్న భర్తే కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన భార్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
*అడ్డతీగల మండలం కోనలోవ గ్రామంలో టీడీపీ నాయకుడి పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఫారెస్ట్‌ స్క్వాడ్‌ అధికారులు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు.
* మంచిర్యాల పట్టణంలోని మారుతినగర్‌లో నివాసముంటున్న మంద సత్తయ్య (52)పై భార్య విజయలక్ష్మి మంగళవారం రాత్రి రోకలి బండతో తలపై మోది హత్య చేసేందుకు యత్నించింది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ మహేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని సత్తయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
* ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన మంగమూరు రోడ్‌లోని కొత్తడొంకలో గురువారం జరిగింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com