నేటి నేరాలు-౦౪/౧౬

*జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడకు చెందిన రైతు చల్ల రాంరెడ్డి (53) అప్పుల బాధతో ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాంరెడ్డి తనకున్న నాలుగెకరాల భూమిలో రెండేళ్ళుగా పత్తి, మిర్చి పంట లు సాగు చేశాడు. దిగుబడులు రాక రూ. 10 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలన్న వేదనతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే మహదేవ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
*సూర్యపేట: జిల్లాలోని మేళ్లచెరువు మండలం వెల్లూరు క్రాస్‌రోడ్డ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*టేకులపల్లి మండలం బోజ్జాయిగూడెం ఆరో మైలు తండా వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని బూడిద లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకిస్ట్‌ అక్కడికక్కడే మృతిచెందగా..వెనక కూర్చున్న యువతికి తీవ్రగాయాలు అయ్యాయి.
* ఎవరూలేని ఇంట్లో చొరబడిని దొంగలు అందినకాడికి అందుకోని ఉడాయించారు. మండల పరిదిలోని కనుముక్కుల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడి అమ్మవారి పుస్తెలు అపహరించిన సంఘటన మరువక ముందే మండల పరిధిలోని వంకమామిడిలో తాళం వేసి ఉన్న ఓ ఉంటో దొంగలుపడి అందినకాడికి సొమ్ము దోచుకుపోయారు.
*కల్తీ కల్లు తాగి 15మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని కామినేని దవాఖానకు తరలించారు.
*ఇంటి ఎదురు ఇల్లు. పదేళ్ల నుంచి ప్రేమించుకొంటున్నారు. రెండుసార్లు ఊరు వదిలి వెళ్లారు. పెళ్లి చేస్తామని నమ్మించి తీసుకొచ్చిన పెద్దలు మొహం చాటేశారు. ఇదే అదునుగా ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
*అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా నీలగిరి సమితి బవుసొ బణియా గ్రామంలో చోటుచేసుకుంది.
*సరిగ్గా ఏడు నెలలు కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జిల్లాకాని జిల్లాలో వచ్చిన జీవనం సాగిస్తున్నారు. సంసారంలో చిచ్చు.. గొడవలు ఇతర సమస్యలు. తల్లిదండ్రులకు ఇంటికి వస్తామని చెప్పిన కూతురు ఇంటికి రాకపోగా కనీసం ఫోను కూడా చేయకపోవడంతో అనుమానం వచ్చిన చూడడంతో కూతురు, అల్లుడు నివాసం ఉన్న ఇంటి వద్ద జనం గుమి కూడి ఉండటంతో కాస్త ఆందోళన చెందారు.
*ఎయిర్‌ చైనాకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బంది ఒకరిని బందీగా చేసుకునే యత్నం చేశాడు. ఓ పెన్నును గన్నుగా చూపించి దుండగుడు ఈ యత్నానికి పాల్పడ్డాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా జెంగ్జౌ విమానాశ్రయంలో దించారు.
*మంచంపై ఉన్న వృద్ధురాలిని ఆమె తోబుట్టువు వరసైన మహిళ ఘోరంగా హింసిస్తూ మానవత్వాన్ని మంట గలిపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ హౌసింగ్‌బోర్డు కాలనీలో వెలుగు చూసింది. వృద్ధురాలిని చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలను సమీపంలో నివసిస్తున్న ఒక యువకుడు తన సెల్‌ఫోన్‌ చిత్రీకరించి బయటకు విడుదల చేయడంతో కలకలం రేగింది.
*వరంగల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అమరావతి నగర్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
*నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఈదులబావి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్రవాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
*హైదరాబాద్ నగరంలోని లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి వికారాబాద్‌లో శవమై తేలింది. తాండూరులోని అమ్మమ్మ వాళ్లింటికి జాతరకని ఇంట్లో చెప్పి బయలుదేరిని అమ్మాయి దారుర్ మండలం తరిగోపుల రైల్వే స్టేషన్ లో రాత్రి 11 గంటల ప్రాంతం లో బీజాపూర్ రైలు నుంచి కిందపడిపోయింది.
*వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. వికారాబాద్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడగా.. మద్గుంచిట్టంపల్లికి చెందిన వృద్ధుడు ఎలుక చంద్రయ్య (70) పిడుగు పాటుతో మృతి చెందాడు.
*సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలం వెల్లూరు క్రాస్‌రోడ్డ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
*ఎవరూలేని ఇంట్లో చొరబడిని దొంగలు అందినకాడికి అందుకోని ఉడాయించారు. మండల పరిదిలోని కనుముక్కుల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడి అమ్మవారి పుస్తెలు అపహరించిన సంఘటన మరువక ముందే మండల పరిధిలోని వంకమామిడిలో తాళం వేసి ఉన్న ఓ ఉంటో దొంగలుపడి అందినకాడికి సొమ్ము దోచుకుపోయారు.
*హైదరాబాద్‌లోని లింగంపల్లిలో బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com