నేటి నేర వార్తలు-౦౨/౧౧

*వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజక ఇన్‌ఛార్జి జోగి రమేష్‌పై కక్షసాధింపు చర్య కొనసాగుతోంది. ఎస్‌ఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
*న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి చెందాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచాడు.
*కళియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ రిసెప్షన్ అధికారులు డిప్యూటీ ఈవో బాలాజీ, ఓఎస్డీ లక్ష్మినారాయణ మంత్రికి ఘన స్వాగతం పలికారు.
*పశ్చిమ్‌ బంగలో ఓ గ్రామంలో చొరబడిన ఏనుగు హంగామా చేసింది. సిలిగురి సమీపంలోని గుల్మార్టి ఎస్టేట్‌ నుంచి వెళ్తూ మంద నుంచి విడిపోయిన ఈ గజరాజు మిలాన్‌మోర్‌లోకి ప్రవేశించింది. తెల్లవారుతున్న సమయంలో వూరులోకి ప్రవేశించిన ఈ ఏనుగును చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం దాన్ని కర్రలతో వెంబడించారు.
*హైదరాబాద్ నారాయణగూడలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు చామంతి (18), దివ్య (20)లు శుక్రవారం నుంచి కనిపించడం లేదు. కాలేజీ ముగిసిన తర్వాత తమ పిల్లలు ఇంటికి రాలేదని కాలేజీ యాజమాన్యానికి తల్లిదండ్రులు చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
*సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్కల్‌ మండలం శివంపేట శివారులో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్‌ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్తున్న బస్సులో జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రకి తరలించారు.
*హైదరాబాద్‌ నగర శివారులోని రాజేంద్రనగర్‌ పరిధి ఆరాంఘర్‌ బస్టాప్‌లో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఓ మహిళ శుభకార్యంలో పాల్గొనేందుకు తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా బస్టాప్‌లో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు.
*తలకు చుట్టుకున్న గుడ్డ యంత్రంలో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
*ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే సకాలంలో పోలీసులకు సమాచారం అందడంతో ఇరువురినీ రక్షించగలిగారు.
* నేరేడ్‌మెట్, కుషాయిగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అద్దె ఇల్లు బోర్డులు ఉన్న ఇండ్లలోకి ప్రవేశించి.. వీరిద్దరూ చోరీలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
*జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సుంజ్వాన్‌లోని ఆర్మీశిబిరంపై శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
*అడిగిన వెంట‌నే మంచినీళ్లు తీసుకురాలేద‌నే క్ష‌ణికావేశంలో ఎనిమిదేళ్ల కూతురిని క‌ర్క‌శంగా గాయ‌ప‌రిచాడు ఓ తండ్రి. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి శుక్ర‌వారం తుదిశ్వాస విడిచింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
*ముగ్గురు పదో తరగతి చదువుతున్నారు.. తాము చదువుతున్నది వేర్వేరు పాఠశాలలే అయినా, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళతారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ట్యూషన్‌కు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు.
*మంత్రులు, రాజకీయ ప్రముఖుల ఇళ్లలో శుభకార్యాలకు హాజరై వారితో స్వీయ చిత్రాలు (సెల్ఫీలు) దిగడం.. ఐఏఎస్‌ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం.. వాటిద్వారా అమాయకులను నమ్మించి రూ.లక్షల వసూళ్లకు పాల్పడటం.. ఈ తరహా మోసాల్లో రాటుదేలిన నిందితుడు కనుకుర్తి చంద్రశేఖర్‌ను మధ్యమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.
*వెబ్‌ చానల్‌ ముసుగులో హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో అనేక మోసాలకు పాల్పడిన మంద రాజేశ్‌పై నగర పోలీస్‌ కమిషనర్‌ పీడీ చట్టం ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో షాయినాయత్‌గంజ్‌ సీఐ ఎం.రవీందర్‌రెడ్డి శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.
*మావోయిస్టు సీనియర్‌ నాయకుడు రామన్న, ఆయన భార్య పద్మలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్రలోని చంద్రపూర్‌ పోలీసులు బల్లార్షలో వారిని శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
*తల్లి పాల కోసం అదేపనిగా ఏడుస్తున్న పాపను…సాక్షాత్తూ కన్నతల్లే ఓ బలహీన క్షణాన కోపంతో చంపేసిన దారుణం ధార్‌జిల్లాలోని తల్వాడీ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.
* భారత వైమానిక దళాని(ఐఎఎఫ్‌)కి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐకి దొంగచాటుగా చేరవేశారన్న ఆరోపణలతో ఐఎఎఫ్‌ అధికారి అరుణ్‌ మర్వాహా(51)ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
*జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రరేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్థాన్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతిచెందారని.. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని రాష్ట్ర మంత్రి అవుఖాఫ్‌ అబ్దుల్‌ రెహమాన్‌ తెలిపారు.
*భారత వైమానిక దళాని(ఐఎఎఫ్‌)కి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐకి దొంగచాటుగా చేరవేశారన్న ఆరోపణలతో ఐఎఎఫ్‌ అధికారి అరుణ్‌ మర్వాహా(51)ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
*అమెరికాలో సాయుధుడైన ఓ దుండగుడు ఇద్దరు ప్రవాస భారతీయులపై దాడికి తెగించాడు. తుపాకితో జరిపిన కాల్పుల్లో పరంజిత్‌ సింగ్‌(44) అనే వ్యక్తి మృతిచెందారు.
*భారీ ఎత్తున రాయితీ బియ్యాన్ని జనగామ జిల్లా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. 20 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, మరో 50 టన్నులను జనగామ జిల్లాలోనే జప్తు(సీజ్‌) చేశారు.
*ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా బొడ్ల గ్రామం వద్ద శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని ఆ జిల్లా ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ తెలిపారు.
*ఉత్తర్‌ప్రదేశ్‌లో 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లల హత్యలపై పునర్విచారణకు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
*హవాలా మార్గంలో తీవ్రవాదులకు, తీవ్రవాద సంస్థలకు నగదు సహకారాన్ని అందజేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది బిలాల్‌ అహ్మద్‌ కోట్యా అలియాస్‌ ఇమ్రాన్‌ జూల్‌కు ఏడేళ్ల కారాగార శిక్ష, రూ.50వేల జరిమానాను బెంగళూరులోని ఓ న్యాయస్థానం విధించింది.
*కలర్‌ ప్రింటర్‌ సాయంతో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్‌లో చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను విజయవాడలోని కృష్ణలంక పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
*ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు బలిగొంది. గుంటూరు జిల్లా నూజండ్ల మండలం ఉప్పలపాడు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో శుక్రవారం సాయంత్రం 17ఏళ్ల ముగ్గురు విద్యార్థులు మునిగి మృతిచెందారు.
* గుంటూరులో 8వ తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన. ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు… నల్లచెరువు 14వ లైన్‌కు చెందిన బాలిక(14) గతనెల 28న ఇంటివద్ద ఆడుకుంటుండగా.. అదే ప్రాంతానికి చెందిన నలుగురు ఐస్‌క్రీమ్‌ కొనిస్తామని ఆటోలో తీసుకెళ్లారు. పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
*రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద అదుపుతప్పిన ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
*జమ్ముకశ్మీర్‌లోని సున్‌జ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వివరాలను ఐజీపీ ఎస్‌డీ సింగ్ జమ్‌వాల్ తెలియజేస్తూ.. ఉదయం 4.55 గంటల ప్రాంతాల్లో అనుమానితుల కదలికను సెంట్రి గుర్తించాడు. వెంటనే ఉగ్రవాదుల సెంట్రీ శిబిరంపై కాల్పులు జరిపారు.
*హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు గడిచిన రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 42 కార్లు, 52 బైక్‌లను పోలీసులు జప్తు చేశారు. 85 కేసులు నమోదు చేశారు. కాగా తనిఖీల సమయంలో పలువురు వాహనదారులు బారికేడ్‌లను ఢీకొని సైతం వాహనాలను ఆపకుండా వెళ్లారు.
*దేవరపల్లి మండలంలోని ఎర్నిగూడెం గ్రామ సమీపంలో లారీ బోల్తాపడిన ఘటనలో అటుగా వస్తున్న ఏడో తరగతి చదువుతున్న పన్నెండేళ్ల బాలుడు బన్ని మృతి చెందాడు.
* దేశ రాజధాని దిల్లీలోని కరోల్‌ బాగ్‌ ప్రాంతంలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వస్త్రాల తయారీ యూనిట్‌లో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. కాగా.. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. మృతుడికి సంబంధించిన విరాలు తెలియరాలేదు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
*డప జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముస్లిం మతపెద్ద ఒకరు మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. దువ్వూరు మండల పరిధిలోగల జాతీయ రహదారిపై ఎడ్లబండిని కారు ఢీకొంది. దీంతో కారులో ఉన్న ముస్లిం మత పెద్ద ఖాజీ సయ్యద్ నజరుల్లా సాహెబ్(65) అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే ఈయన భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చాగలమర్రిలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా… మృతిచెందిన సయ్యద్ నజరుల్లా సాహెబ్ ఉర్దూ లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎస్సై విద్యాసాగర్ కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
*విశాఖనగరం ఆసీలమెట్టలోని లేడీస్ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సేవ్ హ్యాండ్స్ లేడీస్ హాస్టల్‌లో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో హాస్టల్‌లోని యువతులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో హాస్టల్‌లోని పరుపులు దగ్ధమయ్యాయి. కాగా సీలింగ్ ఫ్యాన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
*గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని గుండ్లకమ్మ నదిలో ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతయ్యారు. నదిలోకి దిగిన నలుగురిలో ముగ్గురు చనిపోయారు. ఒకరిని మాత్రం రైతులు కాపాడారు.
*గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రియల్టర్‌ హత్య కేసులో ఐదుగురు నిందితులకు గుంటూరు నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదు, జరిమానా విధించారు. 2010 అక్టోబర్‌ 14న జరిగిన ఈ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
*అప్పుల వారి ఒత్తిడి ఎక్కువకావడంతో మానసిక వేదనకు గురైన అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు నగరంలోని సంగడిగుంట ఎల్‌ఆర్‌ కాలనీ శివారు గాంధీనగర్‌ రెండోలైన్‌కు చెందిన అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ ఆలోకం రాధ (40) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
*ఇంటిముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లి చంపింది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వాల్పారై సమీపంలోని నడుమలై తేయాకు ఎస్టేట్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
*కర్నూలు జిల్లాలోని నన్నూరు నారాయణ కాలేజీలో శనివారం దారుణం చోటు చేసుకుంది. కాలేజ్‌లో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్ రక్తం వచ్చేలా చితకబాదాడు. దీంతో బాధిత విద్యార్థులు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లీం మైనార్టీలను మోసం చేశారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు.
*కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సి.ఎం. రమేశ్‌ భేటీ అయ్యారు. నిన్న రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆయనను కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com