నేటి నేర వార్తలు-౦౨/౧౫

*కృష్ణాజిల్లా ఉంగుటూరులో సెల్ టవర్ ఎక్కి దూకేస్తానంటూన్న వ్యక్తీ అతన్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.
*కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి తాళ్లపల్లె మార్గ మధ్యలో ట్రాక్టర్ ను డీ కొన్న ఆర్టీసీ బస్సు.
*భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా సారాపకా ఐటీసీ రోడ్డులో రోడ్డు వెడల్పు చేసే భాగంలో తృటిలో తప్పినా ప్రమాదం. బారీ వృక్షాలు నరికి వేసే క్రమములో చెట్టు కొమ్మ మీదపడి స్కూల్ విద్యార్ధికి గాయాలు.
*ప్రకాశం జిల్లాలోని కొమరోలు నల్లగుంట్ల క్రాస్‌రోడ్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ బోల్తా పడటంటో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కర్నాటకకు చెందినవారిగా గుర్తించారు. భద్రాచలం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
*ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలి ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఈ ఘటన అస్సాంలోని మాజులి ప్రాంతంలో జరిగింది.
*200 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నగల్‌గిడ్డాలో కారులో 100 బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అనంతరం గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
*అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో ఓ యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు. నిందితుడిని అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్‌ క్రూజ్‌ (19)గా పోలీసులు గుర్తించారు.
*వసతిగృహాల కూరగాయలు, క్యాంటీన్‌ గుత్తేదారు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ… షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఉపసంచాలకుడు పెర్క యాదయ్య, వసతి గృహ సంక్షేమాధికారి శ్యాంసుందర్‌లు అవినీతి నిరోధకశాఖకు చిక్కారు.
*పాఠశాలల్లో విద్యార్థినులను వేధిస్తున్న ఘటనలు మన విద్యా వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. తల్లిదండ్రుల స్థాయిలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.
*ధూల్‌పేటలో పేరుమోసిన గంజాయి వ్యాపారి నుంచి సరకు సేకరించి నగరం, శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులకు సరఫరా చేస్తోన్న కీలక వ్యక్తిని మంగళ్‌హాట్‌ పోలీసులు అరెస్టు చేశారు.
*భారత సంతతి యువతి సెలీన్‌ దూఖ్రన్‌(20) దారుణ హత్య కేసులో ఆమె సమీప బంధువు ముజాహిద్‌ అర్షిద్‌(33) దోషిగా నిరూపితమైంది. ఈ మేరకు కోర్టు తీర్పు చెప్పింది.
*నేరస్థుడు ఎంత పకడ్బందీగా ప్రణాళిక వేసినా ఏదో ఒక తప్పుచేసి దొరికిపోతాడనేది మరోసారి రుజువైంది. కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ గర్భిణి దారుణహత్య కేసు దర్యాప్తులో కీలక నిందితుడికి సంబంధించిన సమాచారాన్ని సైబరాబాద్‌ పోలీసులు ఇలాగే సేకరించగలిగారు.
*పుట్టిన రోజు వేడుకకు రావాలంటూ ఆహ్వానించిన స్నేహితుడే ఆమె పాలిట కీచకుడయ్యాడు. మరో ముగ్గురు మిత్రులతో కలసి ఆమెపై సామూహిక అత్యాచారం చేయటంతో పాటు హత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన పశ్చిమ్‌బంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రత్‌టాలాలో మంగళవారం రాత్రి జరిగింది.
*ప్రేమించిన యువతి ప్రేమికుల రోజున కనిపించలేదు. తమ ప్రేమ పెళ్లికి యువతి ఇంట్లో అంగీకరించలేదన్న బాధతో ఓ యువకుడు కత్తితో ఎదపై పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సంఘటన బుధవారం బళ్లారి జిల్లా హొసపేటెలో చోటుచేసుకుంది.
*ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. బాధితులను గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది అరిజ్‌ ఖాన్‌ను దిల్లీ పోలీసులు దాదాపు పదేళ్ల తర్వాత అరెస్ట్‌ చేశారు.
* ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీలో ఏపీ ఎన్జీవో కార్యాలయం వివాదంపై దాఖలైన పిటిషన్‌పై విచారించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఈ నోటీసులు జారీచేసింది. కార్యాలయంలో కొంత భాగం టీఎన్జీవోకు కేటాయించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది.
*ఇంటి యజమానిపై ఉన్న కోపం అతని కుమారుడిపై చూపించాడో కిరాతకుడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని ఏడేళ్ల కుమారుడిని దారుణంగా చంపేశాడు. మరోవైపు తనపై ఎలాంటి అనుమానం రాకుండా సదరు యజమానితో సఖ్యతగా ప్రవర్తించసాగాడు.
*హైదరాబాద్‌ రాజధానిలో కలకలం రేపిన ఎనిమిది నెలల గర్భిణి బింగీ అలియాస్‌ పింకీ(32) దారుణహత్య కేసులో కీలక నిందితుడు అమర్‌కాంత్‌ఝాను సైబరాబాద్‌ పోలీసులు బుధవారం నగరానికి తీసుకొచ్చారు. పింకీ మృతదేహాన్ని ఎనిమిది ముక్కలుగా నరికి బొటానికల్‌ గార్డెన్‌ వద్ద పడేసిన ఘటనలో అమర్‌కాంత్‌ తల్లి మమత, తండ్రి అనిల్‌ ఇదివరకే పోలీసులు అరెసు చేశారు.
*పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌కు భీమడోలులోని జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
*మిళనాడులోని దిండిగల్‌ జిల్లాకు చెందిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఆండివేల్‌ బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గార్డెన్‌ హౌజ్‌ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
*వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామంటూ వంచనకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
*విజయవాడ రూరల్‌ మండలం నున్న కేంద్రంగా రవాణా అవుతున్న కల్తీ నెయ్యిని నున్న రూరల్‌ పోలీసులు బుధవారం రాత్రి గుర్తించారు. నున్నలోని ఒక ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ నుంచి నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాలకు సరఫరా చేసేందుకు 1,200 లీటర్ల నెయ్యి బాక్స్‌లను తీసుకువచ్చారు. సమాచారం అందటంతో నున్న రూరల్‌ సీఐ దుర్గారావు, ఎస్సై శివప్రసాద్‌ సిబ్బందితో వచ్చి దాడి చేశారు. పోలీసులు వచ్చే సమయంలో అక్కడే ఉన్న కల్తీ నెయ్యి కంపెనీ ప్రతినిధి అక్కడ నుంచి పరారయ్యాడు. నెయ్యి బాక్స్‌లను ట్రాన్స్‌పోర్టు కంపెనీకి తీసుకువచ్చిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
*ప్రేమికుల రోజు వారి జీవితాల్లో విషాదం నింపింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు మిత్రులు గొడవపడి కత్తితో పొడవడంతో ఒకరి ప్రాణం పోయింది. ఈ సంఘటన తాలూకాలోని కంచిగనాళ గ్రామంలో చోటుచేసుకుంది.
* రోడ్డు ప్రమాదంలో అన్నా తమ్ముడు మృతిచెందిన విషాద సంఘటన గురువారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కడారి రాంబాబు(40), కడారి చందు(32) అనే ఇద్దరు అన్నాతమ్మడు. అయితే… వీరిని గురువారం ఉదయం గుర్తు తెలియని వాహపం ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.
*రైలు కిందపడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గురువారం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. *విజయనగరం పాఠశాలకు సైకిల్ పై వెళ్తున్న ఓ విద్యార్థినిని వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషాదసంఘటన గురువారం విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
*దమ్మపేట మండలంలోని కట్కూరు సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
*గాజులరామారాంలో ఓ మహిళ క్వారీ గుంతలో పడి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ మహిళ ఎవరన్నది వివరాలు తెలియలేదు. ఉన్నట్టుండి క్వారీ వైపు వచ్చిన ఆ మహిళ నెమ్మదిగా కిందికి దిగి ఆ తర్వాత క్వారీ గుంతలోకి దూకేసింది. పరిసర ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. బయటకు తీసేటప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది నెలలో ఇక్కడ నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
* జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట శివారు చింతకుంట రామయ్యపల్లిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి బుట్టికుమార్‌కు చెందిన ఇళ్లు దగ్ధం కాగా పక్కనే ఉన్న బుట్టి ఉపేందర్‌కు చెందిన ఇళ్లు పాక్షికంగా దగ్ధమైంది. గ్రామస్థుల కథనం ప్రకారం కు మార్‌ ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో సిలిండర్‌ ఒక్కసారిగా పేలి పోవడం తో పెద్దఎత్తున శబ్దం వచ్చి మంటలు చెలరేగాయని గ్రామస్థులు తెలిపారు.
* రైల్వేకోడూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అన్నిరాజుల బాలరంగయ్య (42) ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
* కేంద్రమాజీ మంత్రి దివంగత బోళ్ల బుల్లిరామయ్యకు పి.గన్నవరం మండలం మానేపల్లిలో గోదావరి చెంతన స్మశానవాటికలో గురువారం అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com