నేటి నేర వార్తలు-౦౪/౦౧

* తుక్కుగూడ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఓ కారు డీసీఎంను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. హయత్‌నగర్‌ నుంచి మైసిగండి వెళ్తుండగా కారు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ కిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న జంగయ్య, అనురాధ అనే దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
*సీబీఎస్‌ఈ పేపర్‌ లీక్‌ కేసులో మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12వతరగతి ఆర్థిక శాస్త్రం పేపర్‌లీక్‌కు సంబంధించి ఓ శిక్షణాసంస్థ యజమాని, మరో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. *మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం కొండాపూర్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. రెండు ఆవు దూడలపై దాడి చేసి వాటిని చంపేసింది. దీంతో కొండాపూర్ వాసులంతా ఇంట్లో నుంచి బయటికి రావడానికి బయపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.
*హైదరాబాద్‌ నగర శివారు మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నప్రమాదం జరిగింది. కొబ్బనినూనే డబ్బాలను నిల్వ ఉంచిన ఓ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
*పాలమూరు జిల్లా గొర్రెల మందను మృత్యు వీడడం లేదు. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు వేసవిలో మేత కోసం11 మంది యజమానులు తమకున్న 3000 గొర్రెలతో బయలుదేరారు. వారు శుక్రవారం మిర్యాలగూడ మండలం తుంగపహాడ్‌ గ్రామ శివారుకు చేరుకున్నారు. అక్కడ మందలోని గొర్రెలు అనారోగ్యనికి గురై 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
*ఓ బాలికను మాయమాటలతో లోబర్చుకుని గర్భవతిని చేసిన యువకుడ్ని కామాటిపురా పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఇవాళ ఉదయం భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. దియాల్గాంలో సైనికులు జరిపిన ఎన్‌కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
* నిలోఫర్ ఆస్పత్రి వైద్యులపై నాంపల్లి పొలీసులు కేసు నమోదైంది. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏడాది బాలుడు సాహిల్‌ మృతిచెందాడు. దీంతో బాలుడి బంధువులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నాంపల్లి పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వైద్యులపై కేసు నమోదు చేశారు.
*కృష్ణా జిల్లా గన్నవరం ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
*మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విజశ్రీ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో అపార్ట్‌మెంట్‌వాసులు భయబ్రాంతులకు గురయ్యారు.
*వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తాడని భావించిన భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన వైనమిది. అనంతరం ప్రియుడితో కలిసి దూరప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరూ పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు.
*ప్రేమకు వైకల్యం అడ్డుకాదని నిరూపించిందో యువతి. ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ప్రేమికుడిని ఆసుపత్రిలోనే వివాహమాడింది. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
*దుస్తులు విప్పించి.. అభ్యంతరకర రీతిలో తమను తనిఖీ చేశారంటూ స్పైస్‌జెట్‌పై ఆ సంస్థకు చెందిన కొందరు గగనసఖులు (ఎయిర్‌ హోస్టెస్సెస్‌) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఆహారం తదితర పదార్థాల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను తాము కాజేస్తుండవచ్చన్న అనుమానంతో వీటిని చేపట్టినట్లు ఆరోపించారు.
*రబీలో సాగుచేసిన వరి ఎండిపోతుండటం ఆ రైతును కలచివేసింది.. దాన్ని కాపాడుకునేందుకు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి.. దీంతో మనస్తాపానికి గురైన ఆ అన్నదాత పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*తొలి సంతానంగా కుమారుడు జన్మించిన సంతోషం ఆ కుటుంబానికి పట్టుమని పక్షం రోజులూ నిలవలేదు. తండ్రి పక్కన నిద్రిస్తున్న కుమారుడిని వానరం ఎత్తుకుపోవడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
*హౌరా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌) అధికారులు శనివారం సోదాలు నిర్వహించి రూ.10.20 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
*ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసిన వ్యక్తిని… బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కొట్టి చంపిన ఘటనిది! గాజియాబాద్‌ పోలీసులు శనివారమిక్కడ వివరాలను వెల్లడించారు.
*రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో జైతరన్‌ పట్టణంలో శనివారం హనుమజ్జయంతి సందర్భంగా చోటు చేసుకున్న మత ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీశాయి.
*జమ్ముకశ్మీర్‌లో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఒక ప్రత్యేక పోలీస్‌ అధికారి (ఎస్పీవో) మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
*ముంబయికి చెందిన ఓ గడియారాల సంస్థ తన పాన్‌ కార్డు వివరాలను దుర్వినియోగ పరిచిందని దిగ్గజ మాజీ క్రికెటర్‌ అనిల్‌కుంబ్లే భార్య చేతన రామతీర్థ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*పాపికొండలు విహారయాత్ర ఓ ఉమ్మడి కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం శివగిరి గ్రామం వద్ద శనివారం గోదావరి నదిలో స్నానానికి దిగిన నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఒక యువతి ఉన్నారు.
*గాలిపటం ఎగరేస్తూ అపార్టుమెంటు నుంచి జారిపడ్డ ఓ బాలుడు తీవ్రగాయాలపాలై ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాకినాడలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
*తొలి సంతానంగా కుమారుడు జన్మించిన సంతోషం ఆ కుటుంబానికి పట్టుమని పక్షం రోజులూ నిలవలేదు. తండ్రి పక్కన నిద్రిస్తున్న కుమారుడిని వానరం ఎత్తుకుపోవడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
*కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేసి, మరో మహిళను వివాహం చేసుకున్న కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త మాదల సుధాకర్‌కు రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తూ గుంటూరు 5వ అదనపు మేజిస్ట్రేట్‌ వై.బిందుమాధవి శనివారం తీర్పు చెప్పారు.
* ఉపాధి చూపిస్తానని ఓ మహిళను నమ్మించాడు.. ఆమెతో మద్యం తాగించి అత్యాచారం చేశాడు.. తన బండారం బయటపడుతుందని భయపడి బండరాయితో ఆమె తలపై మోది గాయపర్చాడు.. అనంతరం పెట్రోలు పోసి నిప్పంచాడు.
*యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని మహత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో తాగునీరు కలుషితమై 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 33 మంది పరిస్థితి విషమంగా మారడంతో భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
*హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య అప్పారావు హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు భగ్నం చేశారు.
*యాదాద్రి – భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోటకొండూరు మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
*ఇండో-నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో మానవ అక్రమ రవాణాలు పెరిగిపోతున్నాయ్‌. సరిహద్దు రక్షక దళం సహస్ర సీమ బాల్‌(ఎస్‌ఎస్‌బీ) ఈ విషయాన్ని స్వయంగా తెలిపింది.
*నకిలీనోట్లను రవాణా చేస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు శనివారం పట్టుకున్నారు. ఈస్ట్‌కోస్‌ ఎక్స్‌ప్రె్‌సలో వీరినుంచి రూ.10.2లక్షల విలువైన రూ.2వేల నకిలీనోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బెంగళూరుకు చెందినవారు.
*విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వెంకటరమణపేట గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
*నకిలీనోట్లను రవాణా చేస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు శనివారం పట్టుకున్నారు. ఈస్ట్‌కోస్‌ ఎక్స్‌ప్రె్‌సలో వీరినుంచి రూ.10.2లక్షల విలువైన రూ.2వేల నకిలీనోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బెంగళూరుకు చెందినవారు.
*రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ శివారులో ప్రమాదవశాత్తు ఓ బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిల్ల బాలకిషన్(20) అనే వ్యక్తి మృతి చెందాడు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
* గ్యాస్‌ ట్యాంకర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆంబూరు సమీపంలో చోటుచేసుకుంది.
* విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలోని రాంనగర్‌ ప్రాంతంలో శనివారం గృహప్రవేశ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వేడుకలకు వచ్చిన వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com