నేటి నేర వార్తలు-౦౪/౦౨

*ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో బంద్‌ హింసాత్మకంగా మారి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
*సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎకనామిక్స్‌ ప్రశ్నాపత్రం లీకయిందన్న ఆరోపణల కేసులో మొత్తం ముగ్గురు వ్యక్తులను దిల్లీ క్రైంబ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ సీబీఎస్‌ఈ అధికారిని సస్పెండ్‌ చేశారు. ప్రశ్నాపత్రం లీక్‌ అయిన నేపథ్యంలో ఆయన సస్పెండ్‌ అయ్యారు.
*మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. కుమారుడి వివాహనికి కారు శుభ్రం చేసిన ఇంటి యజమాని విద్యుదాఘాతానికి గురై మృతిచెండంతో వివాహం నిలిచిపోయింది. వనస్థలిపురంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
*కేంద్ర మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే కుమారుడు అర్జిత్‌ శాశ్వత్‌ను బిహార్‌ పోలీసులు అరెస్టు చేశారు. భాగల్‌పుర్‌లో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకున్నారు. అంతకుముందు శాశ్వత్‌ ముందస్తు బెయిల్‌ కోసం చేసుకున్న దరఖాస్తును భాగల్‌పుర్‌ కోర్టు తిరస్కరించింది. పట్నాలోని హనుమంతుడి ఆలయంలో ఉన్న శాశ్వత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు, మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండు విధించినట్లు పట్నా పోలీసు అధికారులు తెలిపారు.
*గుంటూరు నగరం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరాక్‌ దేశానికి చెందిన విద్యార్థి మృతి చెందారు.
*కువైట్‌లో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు భారతీయులతోపాటు.. ఐదుగురు ఈజిప్ట్‌ పౌరులు, ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు వ్యక్తుల్లోనూ ఓ భారతీయుడు ఉన్నారు.
* రూ.1.56 కోట్ల విలువైన కుక్కర్‌, గ్యాస్‌స్టౌలను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగడానికి నియమించిన ప్రత్యేక తనిఖీ బృందం ఆదివారం పట్టుకుంది. వీటితో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
*‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను..’ అంటూ ఓ టీవీ యాంకర్‌ అపార్ట్ మెంట్‌ భవనంపై నుంచి దూకి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు.
* శాస్త్రిపురం బల్దియా పార్కులో హత్యకు గురైన మహిళ కేసులో మైలార్‌దేవుపల్లి పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు విష్ణు అలియాస్‌ చక్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
*పక్కింట్లో ఉన్న సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌ కథనం ప్రకారం… మైలార్‌దేవుపల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌లో ఉండే కమలి సత్తిబాబుకు భార్య, మూడేళ్ల కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు.ఆదివారం సత్తిబాబు దంపతులు పనుల్లో నిమగ్నమై ఉండగా మహాలక్ష్మి ఇంట్లోనే ఆడుకుంటుంది. అలా ఆడుకుంటూ పక్కనే ఉన్న బంధువుల ఇంట్లోకి వెళ్లింది. అక్కడ చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. కుమార్తె కోసం వెతుకుతూ సంపులో చూడగా మహాలక్ష్మి మృతి చెంది ఉండడంతో దంపతులు కుప్పకూలిపోయారు.
*లేనిచెరువులు ఉన్నట్లు చూపించి ఐడీబీఐ బ్యాంకును మోసం చేసిన కేసులో సీబీఐ అధికారుల విచారణ వేగవంతమైంది. మోసగాళ్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీబీఐ అధికారులు రాజమహేంద్రవరం శాఖలోనే అధిక మొత్తంలో మోసం జరిగినట్లు గుర్తించారు. రాజమహేంద్రవరం శాఖలో రూ.301.77 కోట్ల మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
*కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 15మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన దక్షిణ కువైట్‌ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
*గుండె సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతూ మండలంలోని మానాయకుంట గ్రామంలో 22 సంవత్సరాలుగా గ్రామపంచాయతీ పంపు డ్రైవర్‌గా పనిచేస్తున్న బోడ వెంకన్న (38) మృతి చెందాడు. మృతుడికి భార్య మంజుల, ఇద్దురు కూతుళ్లు సౌజన్య, నల్లి ఉన్నారు. మృతుడికి కుమారు లు లేకపోవడంతో పెద్దకూతురు సౌజన్య తలకొరివి పెట్టింది. మార్కెట్‌ చైర్మన్‌ మహేంద్రనాథ్‌ భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్‌ కడారి సైదులు, మాదాను ఆంథోని, కడారి లింగమల్లు, కడారి సత్యం, తిరుమలేష్‌, అరవింద్‌ ఉన్నారు. గ్రామస్థులు నివాళులర్పించారు.
*అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఆది వారం రాత్రి 8.30 గంటల సమయంలో తైడా సమీపం వద్ద టూరిస్టు బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణీకులు సురక్షితంగా బయటపట్టారు.
*చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ బోడిగుట్టవారిపల్లె వద్ద ఆదివారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా ముగ్గురు విద్యార్థి నులు గాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com