నేటి నేర వార్తలు-౦౪/౧౫

* కొన్ని రోజుల కింద నల్గొండ జిల్లాలోని ఓ కాలువలో ట్రాక్టర్ పడి తొమ్మిది మంది కూలీలు మృతి చెందిన ఘటనను మరవకముందే జిల్లాలో మరో ట్రాక్టర్ ఘటన చోటు చేసుకున్నది. జిల్లాలోని మందపూర్ గ్రామ శివారులో ఉన్న ఓ బావిలో వేగంగా వెళ్లున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి పడిపోయింది. అయితే.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్‌లో ఎంతమంది ఉన్నారనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.
* ప్యాపిలి పట్టణ సమీపంలోని చిరుతలగుట్ట దగ్గర 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి మాజీ ఎంపీపీ టి.శ్రీనివాసులు సోదరుడు, టీడీపీ నాయకుడు టి.రమణ(40) అక్కడికక్కడే మృతి చెందారు.
* ఆందోల్‌ మాజీ ఎమ్మెల్యే హెచ్‌.లక్ష్మణ్‌జీ (73) శనివారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్‌ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే తుదిశ్వాస విడిచారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన లక్ష్మణ్‌జీ 1980లో సంగారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌గా, 1982లో ఆందోల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
*తాటి కల్లు తాగి నల్గొండ జిల్లాలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. కల్లు కల్తీ కావడం వల్లే ఈ ఘటన సంభవించినట్లు అనుమానిస్తున్నారు. గుర్రంపోడు మండలం పోచంపల్లికి చెందిన కొందరు శనివారం రాత్రి కల్లు తాగారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కొక్కరుగా కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఆర్ఎంపీకి చూపించి చికిత్స చేయించినా తగ్గకపోగా కొందరికి మాట పడిపోయింది. దీంతో మొత్తం 18 మందిని గుర్రంపోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వారిని నల్గొండ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్లు అమ్మిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఉన్నావ్‌’ అత్యాచారం కేసులో సీబీఐ అధికారులు తమ వేగం పెంచారు. శనివారం శశిసింగ్‌ అనే మహిళను అరెస్టు చేశారు. భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌ దగ్గరకు అత్యాచార బాధితురాలైన 17 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి తీసుకెళ్లినట్లు ఈమెపై ఎఫ్‌ఐఆర్‌లో వివరంగా నమోదై ఉంది.
*కర్నూలు జిల్లా ఆదోని మండలానికి చెందిన ఓ యువతిని అపహరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*దిల్లీ-ఐఐటీలో ఎమ్మెస్సీ చదువుతున్న 21 ఏళ్ల యువకుడు శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నతనం నుంచి అసహజ రీతిలో లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు, తీవ్ర నిరాశతో తనువు చాలిస్తున్నట్లు రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*హిమాచల్‌ ప్రదేశ్‌లోని కోఠ్‌ఖాయి ప్రాంతంలోని జరిగిన అత్యాచారం, హత్య కేసులో కీలక నిందితుడిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతడిని శనివారం దిల్లీకి తీసుకొచ్చి, ప్రశ్నిస్తున్నారు. ఇది కోర్టు పర్యవేక్షణలో సాగుతున్న దర్యాప్తు కావడంతో నిందితుడి వివరాలను బహిర్గతం చేయడంలేదని అధికారులు తెలిపారు.
* మావోయిస్టులు లారీని తగలబెట్టి వ్యక్తిని అపహరించిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేటలో శనివారం చోటు చేసుకుంది.
*పంజాబీ గాయకుడు పర్మీశ్‌ వర్మపై మొహాలీలో దాడిజరిగింది. స్నేహితుడితో కలిసి వెళ్తుండగా శుక్రవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు కారులోవచ్చి తుపాకీతో కాల్పులు జరిపారు. తూటా గాయాలతో దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పర్మీశ్‌ చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిమితంగానే ఉంది.
*చెప్పిన లెక్కను ఎనిమిదేళ్ల రోహన్‌.డి.జింజీరే సరిగా చేయకపోవడంతో ఉపాధ్యాయుడికి ఒళ్లుతెలియని కోపం వచ్చింది. వెంటనే పేము బెత్తాన్ని కుర్రాడి నోట్లోకి దూర్చి…గొంతులో దాకా గుచ్చేశాడు. బాధ భరించలేకపోయిన ఆ రెండోతరగతి కుర్రాడు నేలమీద కుప్పకూలిపోయాడు.
*పంజాబ్‌లోని ఫగ్వాఢాలో రెండు వర్గాల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణలు జరిగాయి. ఇందులో నలుగురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కపుర్తల, జలంధర్‌, హోషియార్‌పూర్‌, షహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ జిల్లాలో మొబైల్‌ ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
*దేశ రాజధాని దిల్లీలోని ఓ వజ్రాల వర్తక సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) నేతృత్వంలోని బ్యాంకుల సహవ్యవస్థను ఎస్‌ఎస్‌కే ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.187 కోట్లకు మోసగించినట్లు అభియోగాలు మోపింది.
* ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో దోషికి విచారణ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. అతను దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. ఇదే సందర్భంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఆఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తంచేసింది.
*పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. రామారెడ్డి మండలం కన్నాపూర్‌ తండాలో పొలం వద్దకు వెళ్లిన కేతావత్‌ సుగుణ(40), కేతావత్‌ గంగామణి(27)లు సాయంత్రం ఇంటికి వస్తున్నారు.
*జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యంత దారుణంగా జరిగిన అత్యాచారం, హత్యపై దేశమంతా ఆక్రోశం వ్యక్తమవుతున్న తరుణంలో గుజరాత్‌లో మరో ఘటన వెలుగు చూసింది.
*ఆరేళ్ల కిందట 2012 జూన్‌లో గాలి జనార్దన్‌రెడ్డి బెయిలు కుంభకోణం తరువాత మరోసారి ఇప్పుడు న్యాయవ్యవస్థలో సంచలనం చోటుచేసుకుంది. జనార్దన్‌రెడ్డి బెయిలు వ్యవహారంలో కోట్లలో బేరం కుదిరి బెయిలు మంజూరు చేసిన కేసులో అప్పటి సీబీఐ కోర్టు జడ్జి టి.పట్టాభిరామారావుతోపాటు మరో ఇద్దరు జడ్జీలు కె.లక్ష్మీనరసింహారావు, డి.ప్రభాకర్‌రావులను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అరెస్ట్‌ చేసింది.
*పునరావాస కేంద్రంలో ఉన్న విదేశీ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
* సకాలంలో వైద్యం అందక దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక మహిళ మరణించిన ఘటన శనివారం ఉదయం జరిగింది. జీఆర్పీ సిబ్బంది కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని బల్లార్షాకు చెందిన గీతాశర్మ(56) గుండెపోటుతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స కోసం వెళ్లారు.
*సత్తుపల్లి పాతసెంటర్‌ మసీదురోడ్డులో నివాసం ఉంటున్న నాటుకోళ్ల వ్యాపారి ఎస్‌కే మాబుసుబాని(36) ఈ నెల 11న అదృశ్యం కాగా అతను దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని రుద్రాక్షపల్లి సమీపంలో వరిచేలో శనివారం గుర్తించారు.
*విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువుకు వక్రబుద్ధి వంటబట్టింది. విద్యార్థినులు స్నానాలు చేసేటప్పుడు చరవాణితో చిత్రీకరించి దొరికిపోయాడు. ఎట్టకేలకు అనంత నాలుగో పట్టణ పోలీసులు ఆ ప్రబుద్ధుడిని అరెస్టు చేశారు. నగర డీఎస్పీ వెంకట్రావు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో శనివారం వివరాలను వెల్లడించారు.
*తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో శుక్రవారం రాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు.
*పునరావాస కేంద్రంలో ఉన్న విదేశీ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
*మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ ప్లైవుడ్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దుకాణంలో నిద్రిస్తున్న దుకాణ యజమాని నానాలాల్‌ పటేల్‌(63) సజీవ దహనమయ్యారు.
*17ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన భాజపా ఎమ్మెల్యేను ఏడురోజుల పాటు సీబీఐ కస్టడీకి తీసుకుంది. ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగర్‌కు ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో సీబీఐ శుక్రవారం అతడిని అరెస్ట్‌ చేసింది.
*అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లి సమీపంలో పెట్రోల్‌బంక్‌ వద్ద శనివారం ద్విచక్రవాహనాన్ని కంటైనర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు.
* రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రం సమీపంలోని ప్రజ్వల పునరావాస కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఓ విదేశీ మహిళ ఆత్మహత్యకు ప్పాలడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ విషాద సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట యాద్గిరిరోడ్డులో చోటుచేసుకుంది. యాద్గిరిరోడ్డులో గల ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనమవగా, సామాగ్రి పూర్తగా దగ్ధమైంది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
*హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.12లో గడిచిన రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న స్కూటీ సహా పక్కనే నిలిపి ఉన్న క్యాబ్‌ను ఢీకొట్టింది. అనంతరం విద్యుత్ స్థంభాన్ని ఢీకొని ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. వ్యక్తి కారును అక్కడే వదిలివెళ్లాడు. నంబర్ ప్లేట్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టోలీచౌకీకి చెందిన అబ్తాబ్‌గా సమాచారం.
*దేవాలయంలో దొంగలుపడి అమ్మవారి పుస్తెలు అపహరించిన సంఘటణ చోటుచేసుకుంది.వివరాలలోకి వెలితే మండల పరిధిలోని కనుముక్కుల గ్రామంలోని శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజారి వరాహచార్యులు పూజ చేయడానికి వెళ్లగా గర్భ గుడి తలుపులకు ఉన్న తాళం పడుగలగొట్టబడి ఉండటంతో వెంటనే దేవాలయం ధర్మకర్తల మండల చైర్మన్ కోట మల్లారెడ్డికి సమాచారం అందించాడు.
*ప్రియురాలు దాడి చేయించి అవమాన పర్చిందని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జయగిరి రైల్వే ట్రాక్ గేటు వద్ద జరిగింది.
*ఇంటర్ పరీక్షా ఫలితాలలో మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం కర్నిలో చోటు చేసుకున్నది.
*ఇంటర్ పరీక్షా ఫలితాలలో మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం కర్నిలో చోటు చేసుకున్నది.
*బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్‌ నంబర్ 12లో బంజారాహిల్స్ కమాన్ వైపు నుంచి అదే మార్గంలో వస్తోన్న స్కూటీని అతివేగంతో కారు ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న హిమాయత్‌నగర్‌కు చెందిన చేతన్, అతని స్నేహితుడు నిజామాబాద్ నాందేవాడకు చెందిన దాలియా గాయపడ్డారు. అంతటితో ఆగని కారు రోడ్డుపక్కన నిలిపి ఉంచిన క్యాబ్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదాలకు కారణమైన కారును డ్రైవర్‌ అక్కడే వదిలేసి పరారయ్యాడు. నంబర్‌ ప్లేట్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు టోలిచౌకి బృందావన్ కాలనీకి చెందిన అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకున్నారు.
*మెళియాపుట్టి మండలం హీరాపురం గ్రామ సమీపంలో ఏనుగుదాడిలో ఓ మహిళ మృతి చెందింది. ఆపరేషన్‌ గజేంద్రలో భాగంగా శనివారం సాయంత్రం ఎనిమిది ఏనుగుల గుంపు తరలింపులో అపశ్రుతి చోటు చేసుకుంది.
* మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ ప్లైవుడ్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దుకాణంలో నిద్రిస్తున్న దుకాణ యజమాని నానాలాల్‌ పటేల్‌(63) సజీవ దహనమయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com