నేటి నేర వార్తలు-౦౪/౧౭


* విజయనగరం జిల్లా కేంద్రంలో 21 ఏళ్ల దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ పి.పాలరాజు వెల్లడించారు. దివ్యాంగురాలిపై అత్యాచార ఘటన అంతా ఒక అబద్ధమని తేల్చి చెప్పారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
*రాజంపేట పట్టణంలోని మన్నూరు ఎస్‌ఐ మహేష్‌నాయుడు సతీమణి సౌజన్య(28) సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజంపేట పట్టణం మన్నూరు పోలీస్‌స్టేషన్‌ ఎదురు వీధిలో నివాసమున్న వారి గృహంలో ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
*కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పాల్వంచ గ్రామం సమీపంలోని కుంటలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
*తనను రేప్‌ చేసిన ఇద్దరు నిందితులు తన తల్లిదండ్రుల చేతిలో రూ.5 లక్షలు పెట్టి కోర్టులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని కోరారని, అలాగే తన తల్లిదండ్రులు కూడా ఆ డబ్బులు తీసుకుని వాళ్లకే వత్తాసు పలికారని రేప్‌ కేసులో బాధితురాలు(16) పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది.
* కథువా గ్యాంగ్‌రేప్‌ ఘటనను మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. తల్లిదండ్రులతో పాటు వివాహ వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి పనుల్లో ఆదమరచి ఉన్న తల్లిదండ్రుల కళ్లుగప్పిన సోను(18) బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.
*ప్రజల దృష్టి మరల్చి దేశంలో పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దోపిడీ ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ తెలిపారు.
*ఆస్తి తగాదాలతో తమ్ముడిని అన్న హతమార్చిన సంఘటన గోదావరిఖనిలో సోమవారం జరిగింది. తల్లిపై కత్తితో దాడి చేయడానికి వెళ్లిన అన్నను అడ్డుకున్న తమ్ముడు ధనాల దుర్గారావు(23) అలియాస్‌ చంటి కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్రంగా రక్తస్రావమవతుండడంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు.
* కూతురుని వేధిస్తున్నాడనే కోపంతో అల్లుడిపై మామ దాడిచేశాడు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలాపూర్ మండలం తూర్‌కాలనీకి చెందిన షాహీన్‌బేగం, షేక్ హసన్(26) ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి.
*మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని విక్రయించేందుకు తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ బెల్లంపల్లి టూటౌన్ పోలీసేస్టషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
*50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్లలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఫోలీసులు వాటిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
*జగిత్యాల జిల్లాలోని కొండగట్టు గుట్టపై దారుణం చోటు చేసుకున్నది. తన సొంత పిల్లలకు ఉరివేసి చంపాడు ఓ తండ్రి. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అంజలి(2), అఖిత(2) మృతి చెందారు.
*కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం హత్తినిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. హత్తిని గ్రామానికి చెందిన సంధ్య, ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే.. వీళ్ల ప్రేమ విషయం సంధ్య ఇంట్లో తెలియడంతో ఆమె భయపడిపోయింది.
*భద్రాద్రి కొత్తగూడెం వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని జూలూరుపాడ్ -చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకున్నది. ఖమ్మం నుండి తిరిగి వస్తూ జూలూరుపాడ్ లో బస్సు దిగి వెళ్తున్న రామా(38) అనే వ్యక్తి హటాత్తుగా రోడ్డు మీదే కుప్పకూలిపోయాడు.
*వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం మైలారం రైల్వేస్వేషన్‌లో జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.
*కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు మండలకేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుంటుంబానికి చెందిన దంపతులు, ముగ్గురు పిల్లలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
*ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా ధర్మపేట అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులు అపహరించిన రోడ్డు పనుల ఇన్‌ఛార్జి బాలనాగేశ్వరరావు(55) సోమవారం హత్యకు గురయ్యారు. ధర్మపేట నుంచి కిష్టారం వైపు రూ.కోట్ల వ్యయంతో అక్కడ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేపట్టింది.
*తన ఇద్దరు పిల్లల్లో ఒకరిని తల్లి కళ్లెదుటే హతమార్చాడు. రెండో కుమార్తెను హతమార్చబోతుండగా అడ్డొచ్చిన భార్యను చంపేందుకు యత్నించాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఆదివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* గత అయిదునెలల కాలంగా తనను తాను వైద్యుడిగా పేర్కొంటూ ఇక్కడి ప్రతిష్ఠాత్మక ‘అఖిలభారత వైద్య విజ్ఞానాల సంస్థ’(ఎయిమ్స్‌)లో దర్జాగా తిరిగిన అద్నాన్‌ ఖుర్రం(19) అనే యువకుడిని పోలీసులు శనివారం ఇక్కడ అరెస్టు చేశారు.
*ఒడిశాలోని ఝార్సుగుడా జిల్లా కిర్‌మిరా సమితి భాగ్‌డిహి అటవీ రేంజ్‌ పరిధిలో రైలు ఢీకొనడంతో నాలుగు ఏనుగులు మృతిచెందాఈ.
* ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైద్య విద్యార్థి మారిషస్‌లో మృతి చెందారు. స్థానిక బృందావన్‌నగర్‌కు చెందిన పమిడి వెంకటస్వామి, రమాదేవిల కుమారుడు పమిడి సాయి మనోజ్‌(19) మారిషస్‌లోని అన్నా వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నాడు. ఆదివారం మిత్రులతో కలిసి సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు.
*కుటుంబ సమస్యలతో చిన్నారులకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో భర్త మృతిచెందగా, భార్య, ముగ్గురు పిల్లలు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం కర్నూలు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
*కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామంలో నవ దంపతులు రంగనాయకులు (25), గాయత్రి (22) ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గత ఫిబ్రవరి 19న పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకున్నారు.
*డెన్మార్క్‌ మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డ ఐదుగురు దోషులకు విచారణ న్యాయస్థానం విధించిన యావజ్జీవ కారాగార శిక్ష(జీవించి ఉన్నంత వరకు జైల్లోనే ఉంచాలి)ను దిల్లీ హైకోర్టు సోమవారం సమర్థించింది.
* హిందూ దేవుళ్లను కించపరిచారని ఆరోపిస్తూ ఇద్దరు జర్నలిస్టులపై హిందూ సంఘటన్‌ సైదాబాద్‌ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది.
*అత్యాచారం జరిపి, దారుణంగా హింసించడంతో ప్రాణాలు కోల్పోయిన 8 నుంచి 11 ఏళ్ల బాలికది ఒడిశా కావొచ్చని గుజరాత్‌ సహాయ హోంమంత్రి ప్రదీప్‌సింహ్‌ జడేజా తెలిపారు.
* మక్కామసీదు బాంబు పేలుళ్ల కేసులో జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం అసిమానందను సోమవారం నిర్దోషిగా ప్రకటించింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయనపై నేరారోపణ రుజువు కాలేదని పేర్కొంది. అజ్మీర్‌ పేలుళ్ల కేసులోనూ గతేడాది మార్చిలో అసీమానందకు ఊరట లభించింది.
*వరకట్నం కోసం భార్యను తీవ్రంగా హింసించాడో ప్రబుద్ధుడు. పైగా దాన్ని వీడియో తీసి అత్తామామలకు పంపించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది. సీలింగ్‌ హుక్‌కు తాడుతో భార్య చేతులను కట్టేసి, బెల్ట్‌తో బాదిన దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి.
*రెండోసారి పుట్టిన ఆడపిల్లను ఓ తండ్రి ముక్కుపచ్చలారకుండానే అంతమొందించాడు. జలుబు మందులో విషం కలిపి పసికందు చావుకు కారణమైన కసాయి ఉదంతం ఏడాది తరవాత వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులే అవాక్కయ్యారు.
*అనుమానాస్పద స్థితిలో రైలు నుంచి జారిపడి ఓ యువతి మృతి చెందిన ఘటన వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పట్టాల పక్కనే సుమారు 9 గంటలపాటు రాత్రంతా కొనప్రాణాలతో కొట్టుమిట్టాడినా ఎవ్వరూ గమనించకపోవడం విషాదకరం.
*జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడకు చెందిన రైతు చల్ల రాంరెడ్డి (53) అప్పుల బాధతో ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాంరెడ్డి తనకున్న నాలుగెకరాల భూమిలో రెండేళ్ళుగా పత్తి, మిర్చి పంట లు సాగు చేశాడు. దిగుబడులు రాక రూ. 10 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలన్న వేదనతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే మహదేవ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
*సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలం వెల్లూరు క్రాస్‌రోడ్డ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* ఎవరూలేని ఇంట్లో చొరబడిని దొంగలు అందినకాడికి అందుకోని ఉడాయించారు. మండల పరిదిలోని కనుముక్కుల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడి అమ్మవారి పుస్తెలు అపహరించిన సంఘటన మరువక ముందే మండల పరిధిలోని వంకమామిడిలో తాళం వేసి ఉన్న ఓ ఉంటో దొంగలుపడి అందినకాడికి సొమ్ము దోచుకుపోయారు.
*కల్తీ కల్లు తాగి 15మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని కామినేని దవాఖానకు తరలించారు.
*ఇంటి ఎదురు ఇల్లు. పదేళ్ల నుంచి ప్రేమించుకొంటున్నారు. రెండుసార్లు ఊరు వదిలి వెళ్లారు. పెళ్లి చేస్తామని నమ్మించి తీసుకొచ్చిన పెద్దలు మొహం చాటేశారు. ఇదే అదునుగా ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
*అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా నీలగిరి సమితి బవుసొ బణియా గ్రామంలో చోటుచేసుకుంది.
*సరిగ్గా ఏడు నెలలు కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జిల్లాకాని జిల్లాలో వచ్చిన జీవనం సాగిస్తున్నారు. సంసారంలో చిచ్చు.. గొడవలు ఇతర సమస్యలు. తల్లిదండ్రులకు ఇంటికి వస్తామని చెప్పిన కూతురు ఇంటికి రాకపోగా కనీసం ఫోను కూడా చేయకపోవడంతో అనుమానం వచ్చిన చూడడంతో కూతురు, అల్లుడు నివాసం ఉన్న ఇంటి వద్ద జనం గుమి కూడి ఉండటంతో కాస్త ఆందోళన చెందారు.
*ఎయిర్‌ చైనాకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బంది ఒకరిని బందీగా చేసుకునే యత్నం చేశాడు. ఓ పెన్నును గన్నుగా చూపించి దుండగుడు ఈ యత్నానికి పాల్పడ్డాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా జెంగ్జౌ విమానాశ్రయంలో దించారు.
*మంచంపై ఉన్న వృద్ధురాలిని ఆమె తోబుట్టువు వరసైన మహిళ ఘోరంగా హింసిస్తూ మానవత్వాన్ని మంట గలిపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ హౌసింగ్‌బోర్డు కాలనీలో వెలుగు చూసింది. వృద్ధురాలిని చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలను సమీపంలో నివసిస్తున్న ఒక యువకుడు తన సెల్‌ఫోన్‌ చిత్రీకరించి బయటకు విడుదల చేయడంతో కలకలం రేగింది.
*వరంగల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అమరావతి నగర్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
*నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఈదులబావి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్రవాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
*హైదరాబాద్ నగరంలోని లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి వికారాబాద్‌లో శవమై తేలింది. తాండూరులోని అమ్మమ్మ వాళ్లింటికి జాతరకని ఇంట్లో చెప్పి బయలుదేరిని అమ్మాయి దారుర్ మండలం తరిగోపుల రైల్వే స్టేషన్ లో రాత్రి 11 గంటల ప్రాంతం లో బీజాపూర్ రైలు నుంచి కిందపడిపోయింది.
*వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. వికారాబాద్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడగా.. మద్గుంచిట్టంపల్లికి చెందిన వృద్ధుడు ఎలుక చంద్రయ్య (70) పిడుగు పాటుతో మృతి చెందాడు.
*సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలం వెల్లూరు క్రాస్‌రోడ్డ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
*ఎవరూలేని ఇంట్లో చొరబడిని దొంగలు అందినకాడికి అందుకోని ఉడాయించారు. మండల పరిదిలోని కనుముక్కుల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడి అమ్మవారి పుస్తెలు అపహరించిన సంఘటన మరువక ముందే మండల పరిధిలోని వంకమామిడిలో తాళం వేసి ఉన్న ఓ ఉంటో దొంగలుపడి అందినకాడికి సొమ్ము దోచుకుపోయారు.
*మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. నాచారం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మసాజ్‌ సెంటర్‌లో కొంతమంది యువతులతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ సమాచారం అందగా ఎస్‌వోటీ పోలీసులు దానిపై దాడి చేశారు. ముగ్గురు యువతులు, ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నాచారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
*రెండు రోజుల క్రితం కిడ్నాప్‌ చేసిన కాంట్రాక్టర్‌ తెలగారెడ్డి బాలనాగేశ్వరరావు(53)ను మావోయిస్టులు సోమవారం హత్య చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com