నేటి నేర వార్తలు-౧౧/౨౫

*శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకలపాలెం టోల్ గేటు వద్ద శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో అక్రమంగా తరలిస్తున్న తరలిస్తున్న రూ. పది లక్షల విలువైన గుట్కా లారీని పోలీసులు పట్టుకున్నారు. ఓడిశా నుంచి విశాఖా వైపు వెళ్తున్న లారీని పట్టుకున్నారు.
* తిరుమల పాపవినాశనం రోడ్డులోని జపాలీ తీరం వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు భక్తులతో పాటి జీపు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
*స్కూల్ బస్సులో నుంచి బస్సు పొగలు రావడంతో విద్యార్ధులు భయందోలనకు గురైన సంఘటన శనివారం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
* ఓ యువతిపై అత్యాచారం కేసులో ప్రముఖ హిందీ టీవీ నటుడు పియూష్‌ సహదేవ్‌ను పోలీసులు అరెస్టుచేశారు. ప్రస్తుతం ఆయన తమ కస్టడీలో ఉన్నట్టు సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ కలే మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ముంబయిలోని వెర్సోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 20న 23ఏళ్ల మహిళ.. తనపై అత్యాచారం చేశాడంటూ పియూష్‌పై ఫిర్యాదు చేసింది.
* అతడో పాఠశాల ప్రిన్సిపల్‌. పాఠశాలలోనే మద్యం తాగి ఓ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈసీఐఎల్‌ ఆటమిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌-2 ప్రిన్సిపల్‌ కె.మహాపాత్ర(54) ఈ దురాగతానికి ఒడిగట్టాడు. గత అక్టోబరు 10న మధ్యాహ్నం తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని మహాపాత్ర తన క్యాబిన్‌కు పిలిచాడు. తలుపులు మూసి బాలికను ముద్దు పెట్టుకున్నాడు. బాలిక కేకలు వేయడంతో వెంటనే తలుపులు తెరిచాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు పెట్టించుకొని పంపించివేశాడు. బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పింది. ఆమె తల్లి ఫిర్యాదుతో మహాపాత్రను అరెస్ట్‌ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.
* స్వీదీస్ అకాడమీలో ఆహిత్యంలో నోబెల్ బహుమతిని అందించే స్వీడిష్ అకాడమీ లైంగిక వేధింపుల ఆరోపణతో కుదుపులకు లోనైంది. అకాడమీలో o కీలక వ్యక్తి తమపై లొంగిక వేధింపూలకు పాల్పడ్డాడని పలువురు అకాడమీ సభ్యులు కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు.
* రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బతుకు భారంగా భావించిన వృద్ధ దంపతులు బలవన్మరణం చెందారు. నర్సయ్య, మల్లవ్వ అనే వృద్ధ దంపతులు ఈ ఉదయం ఇంట్లోనే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నెలకొంది. బోయినపల్లి మండలం ఆసంపల్లి గ్రామం నుంచి కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం వీరు నూకలమర్రి గ్రామానికి వచ్చారు. కూలి పనులు చేసుకొని జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే, వీరికి సంతానం లేదు. దీనికితోడు అనారోగ్యానికి గురికావడంతో మానసికంగా కలత చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులకు నా.. అనేవారు లేకపోవడంతో గ్రామస్థులే ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు.
* విధుల నుంచి సెలవు తీసుకుని 24 గంటలైనా గడవకముందే ఓ జవాను దారుణ హత్యకు గురయ్యాడు. కశ్మీర్‌కు చెందిన ఇర్ఫాన్‌ అహ్మద్‌ దార్‌.. గురేజ్‌ సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ ఇంజినీరింగ్‌ రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇర్ఫాన్‌ శుక్రవారం సాయంత్రం విధుల నుంచి సెలవు తీసుకుని తన వాహనంలో ఇంటికి బయల్దేరారు. అయితే శనివారం ఉదయం షోపియాన్‌ ప్రాంతంలో బుల్లెట్‌ గాయంతో ఉన్న ఇర్ఫాన్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలానికి కిలోమీటర్‌ దూరంలో ఆయన వాహనం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
*లక్నోలో బాలీవుడ్ హిట్ సినిమా డాలీ కి డోలీచూసిన వారికి అందులోని సోనమ్ కపూర్ పాత్ర బాగా గుర్తుంటుంది. పెళ్లి చేసుకున్న రెండు రోజులకే భర్తను మోసం చేసి బంగారు నగలతో ఉడాయిస్తుంది. ఉత్తరాఖండ్‌లో అచ్చం అలాగే జరిగింది. రూర్కీ సమీపంలోని కువాన్ హెడీ గ్రామానికి చెందిన రైతు అజయ్ త్యాగి పెళ్లి సంబంధాలు చూస్తుండగా డెహ్రాడూన్‌కు చెందిన కాయ అనే మహిళ పరిచయమైంది. అజయ్ కుటుంబ సభ్యులకు కాయ నచ్చడంతో ఈనెల అజయ్-కాయ వివాహం ఘనంగా జరిగింది.
*మహేష్ కత్తిహైపర్ ఆది విషయంలో కొన్ని రోజులుగా భగ్గుమనే వ్యవహారాలు నడుస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసిపదే పదే పవన్‌పై వ్యంగ్యపు మాటలతో మహేష్ కత్తి దాడి చేయడంతో పవన్ అభిమానులు ఫోన్లతో మహేష్‌ని విసిగించడం మొదలెట్టారు. పవన్ అభిమానులు ఇలా విసిగిస్తున్నారంటూ మహేష్ కత్తి ఫేస్ బుక్‌లో పలుమార్లు వీడియోలు పోస్ట్ చేశారు. ఆ తర్వాత మహేష్ కత్తిపై జబర్ధస్త్ స్కిట్‌లో ముందు పొట్టవెనుక బట్ట అంటూ హైపర్ ఆది డైరెక్ట్‌గానే పంచులు పేల్చాడు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఫొటో దిగడందీనిని కూడా మహేష్ కత్తి కాంట్రవర్సీకి ఉపయోగించడం వంటి విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత వీరద్దరూ లైవ్ షోలలో కూర్చుని ఒకరినొకరు దూషించుకున్న విషయం తెలిసిందే.
* నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఒడూరులో చిన్న సంచలనం కలిగించిన సారవాని హత్యకేసును చేధించిన పోలీసులు సారవాని భర్త అశోక్ కి అక్రమ సంబందమే హత్యకు దారి తీసినట్లు సంచారం. ఆహోక్ తో అక్రమ సంబంధం కలిగిన మౌనిక ఆమె తల్లి పద్మావతిని కల్సి కత్తితో సర్వానికి గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులకు తెల్పిన నిందితులు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com