నేటి నేర వార్తలు-౧౧/౨౭

*మహారాష్ట్రలోని లాథూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అత్యాచార బాధితురాలన్న కారణంతో ఓ బాలికను స్కూల్‌ యాజమాన్యం బహిష్కరించింది. తమ పాఠశాల పేరు ప్రతిష్ఠలు కాపాడటానికే ఇలా చేశామని స్కూల్‌ యాజమాన్యం చెప్పడం విడ్డూరం.
*ఇంటర్‌ చదువుకున్న ఓ యువకుడు పీహెచ్‌డీ పూర్తి చేసినట్లు నమ్మబలికాడు. ఎందరో నిరుద్యోగులను బోల్తా కొట్టించి సరూర్‌నగర్‌ కేంద్రంగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నకిలీ పీహెచ్‌డీల ధ్రువపత్రాలు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
*మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేందుకు మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పన్నెండు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టిన వాళ్లు దోషులుగా రుజువైతే మరణశిక్ష విధించాలనే తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
*కుమార్తెకు నిశ్చయించిన పెళ్లి రద్దు కావడంతో ఆ కన్నవారు కలత చెందారు. ఆమె సహా విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం… తమిళనాడులోని తిరువారూర్‌ సమీపాన అమ్మలూర్‌లోని పిళ్లైయార్‌ కోవిల్‌ ఉత్తర వీధికి చెందిన గణేశన్‌ (50) నగలు తయారు చేస్తుండేవారు. ఆయనకు భార్య రాసాత్తి (43), కుమారులు రాజ్‌కుమార్‌, అరిగరసుదన్‌, కుమార్తె గీత (25) ఉన్నారు.
*ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను ఎల్బీనగర్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాధిత యువతిని రక్షించారు. వికారాబాద్‌ జిల్లా బొమ్మరాసిపేటకు చెందిన మల్లెకేడి నాగమణి(30) వంటపనులు చేసేది. ఆ తర్వాత నగరంలోని సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో ఉంటూ ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న విటుల వద్దకు యువతులను సరఫరా చేస్తోంది.
*ప్రస్తుతం ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అత్రుతగా ఎదురుచూస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏదో ఒక్క ఉద్యోగం దొరకకపోతుందనే ఆలోచనతో వారుంటున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగం ఏదైన సరే చేసేందుకు నిరుద్యోగులు ఎదురుచూస్నున్నారు. ఇలాంటి వారిని సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. గతంలో సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్‌ ఖాతాలను తెలుసుకొని ఖాతాదారులను మోసం చేసిన వ్యక్తులు ఇప్పుడు పంథా మార్చి నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి నిరుద్యోగ యువకుడి వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉంది. అందులో ఇంటర్నెట్‌ సదుపాయం ఉంది. పలు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు ఇతర అంశాలు ఇందులో వస్తుంటాయి. ప్రస్తుతమున్న పరిస్థితులలో ఎక్కడైన వెళ్లి ఉద్యోగం చేయాలనే పట్టుదలతో నిరుద్యోగులు ఉన్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
*కేరళలో ముస్లిం యువకుడిని వివాహ మాడి మతం మార్చుకున్న (లవ్‌ జిహాద్‌ కేసు) హదియా అలియాస్‌ అఖిల అశోకన్‌కు స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేదని ఆమె తండ్రి తరఫు న్యాయవాది అన్నారు. ఆమెను మానసికంగా కిడ్నాప్‌ చేశారని వ్యాఖ్యానించారు.
*వరంగల్‌ జిల్లా హన్మకొండలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నగరంలోని ఏకశిల కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న పత్తిపాక శాయంపేటకు చెందిన విద్యార్థిని కందగట్ల సింధుజ (17) ఆ కళాశాల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రగాయాలపాలైన ఆమెను చికిత్సనిమిత్తం ములుగు రోడ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
*’తీన్మార్’ కార్యక్రమంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కావలి రవికుమార్‌ అలియాస్‌ ‘బిత్తిరి సత్తి’ పై సోమవారం మధ్యాహ్నం దాడి జరిగింది. హైదరాబాద్‌లోని V6 చానల్‌ కార్యాలయం ఎదుట గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్‌తో అతడిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే… సికింద్రాబాద్‌ కళాసిగూడకు చెందిన మణికంఠ(26) ఈ దాడికి పాల్పడ్డాడు. ఘటనతో గాయాలపాలైన బిత్తిరి సత్తిని స్టార్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
*బషీర్‌బాగ్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీ కేసును నారాయణగూడ పోలీసులు ఛేదించారు. బంగారం కొనుగోలుకు వచ్చి, స్కై లైన్ అపార్టుమెంట్‌ నుంచి బయటకు వస్తున్నవారిని ముగ్గురు దుండగులు కలిసి దోపిడీ చేశారు. అపార్టుమెంట్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు సహాయంతో నిందితులు దోపిడీకి పాల్పడ్డారు.
*అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళితే.. ఆదివారం షార్జా నుంచి చెన్నైకి విమానం వచ్చింది. అందులోని ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా.. ఓ ప్రయాణికుడు తన షూలో 2 కేజీల బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కోజికోడ్‌కు చెందిన ఇష్రత్‌గా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com