నేటి నేర వార్తలు-౧౧/౨౮

*అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌ వద్ద ఓ ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. గోరంట్ల-పుట్టపర్తి మార్గంలో ద్విచక్రవాహనదారుడు ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను ఢీకొనబోయాడు. దీంతో బస్సు డ్రైవర్‌ ఇక్కసారిగా స్టీరింగ్‌ను పక్కకు తిప్పాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులను ఢీకొని సమీపంలోని బావి వద్దకు దూసుకెళ్లింది. బస్సు 30 అడుగుల లోతున్న బావిలోకి ఒరిగినప్పటికీ డ్రైవర్‌ చాకచక్యంతో వ్యవహరించి బ్రేకులు గట్టిగా వేసి ఆపగలిగాడు. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్‌ అరగంట వరకు అలాగే బస్సును నియంత్రించిన తర్వాత పోలీసులు, స్థానికులు ప్రయాణికులను నెమ్మదిగా కిందకి దించారు. ఈ ప్రమాదంలో ఓ పాదచారుడు అక్కడికక్కడే మృతిచెందగా, బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తన చాకచక్యంతో 50 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్‌ను అందరూ మెచ్చుకున్నారు.
*కనిపించకుండా పోయిన ఓ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రష్యాలోని తంబోవ్‌ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
* మహారాష్ట్రలోని లాతూర్‌ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, జీపు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు చనిపోయారు. క్రీడా అవసరాల కోసం ఉపయోగించే వాహనం(కారు) పంధర్‌పూర్‌ నుంచి నాందేడ్‌ వైపు వస్తుండగా ఎదరుగా వస్తున్న జీపును ఢీకొంది. ఓ టెంపోను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో కారు అదుపుతప్పి జీపును ఢీకొందని ఇన్‌స్పెక్టర్‌ గజానన్‌ భతల్‌వాండే తెలిపారు.
* ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి వార్తల్లోకెక్కింది. ఓ మహిళ ఎయిరిండియా సిబ్బందిపై చేయి చేసుకుంది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. దిల్లీ నుంచి అహ్మదాబాద్‌ వెళ్తున్న ఓ యువతి టికెట్‌ కౌంటర్‌ దగ్గర ఎయిరిండియా సిబ్బందిని కొట్టింది.
* మళయాళ సినీ, బుల్లితెర నటి వాసంతి ఇక లేరు. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం కన్నుమూశారు.
* ఉత్తర్‌ ప్రదేశ్‌లో మహిళలపై అరాచాకాలకు, అకృత్యాలకు అం‍తేలేకుండా పోయింది. ఒక మహిళపై కుటుంబ సభ్యులే నెలల తరబడి అత్యాచారం చేసిన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రి, సోదరుడు, ఇద్దరు చిన్నాన్న వరసయ్యే వ్యక్తులు మూడు నెలల పాటు యువతి నీచంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లోని ధనేవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com