నేటి నేర వార్తలు-05/10

*సీఎం కాన్యాయి డ్యూటీ ముగించుకొని కరీంనగర్ కు వెళుతున్న డిస్ట్రిక్ట్ గార్డ్ వాహనం మనకొండూర్ మండలం చెంజర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న కార్ ను ఢీకొనడంతో కారులో ఉన్న భార్యాభర్తలు, డిస్ట్రిక్ట్ గార్డ్ వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
* జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ నర్సుపై యువకుడు యాసిడ్‌ దాడి చేశాడు. ఈ దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో అదే ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
*జగిత్యాల జిల్లా ధర్మపురిలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు హత్యకు గురయ్యాడు.
*కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌లో సీఎం బందోబస్తు కోసం వచ్చి వెళ్తున్న పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది.
*కర్నూలు జిల్లాలోని నంద్యాల మూలసాగరంలో ఆలయ ఈవో వీరయ్య ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి రూ.10 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బండిఆత్మకూరు మండలం ఓంకారేశ్వరస్వామి ఆలయం, సంజామాల మండలం నయనాలప్ప ఆలయాలకు వీరయ్య ఈవోగా పనిచేస్తున్నారు.
*విజయవాడలో తాడిగడప-ఎనికేపాడు రోడ్డులోని కొత్త ఆటోనగర్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్‌లోని గ్రీజు తయారు చేసే పరిశ్రమలో ఉదయం 11.30 గంటలకు మొదలైన మంటలు సమీపంలోని అన్ని పరిశ్రమలకు వ్యాపించాయి.
* పిలిస్తే పలకలేదని ఓ యువకుడిని బ్లేడుతో గొంతు కోసిన సంఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. నంద్యాల పట్టణంలోని దేవనగర్‌కు చెందిన రవీంద్ర అనే యువకుడిని అదే కాలనీకి చెందిన కొందరు యువకులు అడ్డగించి గొంతు కోశారు.
* భార్యాభర్తలు మద్యానికి అలవాటు పడి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టుకున్నారు. కుటుంబంలోవచ్చిన వివాదాలతో కలత చెంది ఆపై కక్ష పెంచుకుని ప్రాణాలు తీసే స్థాయికి దిగజారారు.
*విడాకుల కోసం భర్త వేధిస్తున్నాడని మనస్తాపానికి గురైన వివాహిత ఉరేసుకున్న ఘటన పెందుర్తిలో మంగళవారం చోటు చేసుకుంది.
*జగిత్యాల జిల్లా ధర్మపురిలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు హత్యకు గురయ్యాడు.
*తమ దగ్గరున్న లోహ ఫలకకు ప్రత్యేకమైన భౌతిక లక్షణాలున్నాయంటూ తండ్రీ కొడుకులు దిల్లీకి చెందిన వ్యాపారవేత్త నుంచి రూ.1.43 కోట్లు కాజేశారు. శాస్త్రవేత్తల్లా నటించి అతడిని మోసం చేశారు.
* కర్నూలు జిల్లాలోని డోన్‌ మండలం కొచ్చెరువు గ్రామానికి చెందిన 16ఏళ్ల మూగ బాలికపై అత్యాచారం జరిగింది. దివ్యాంగురాలైన కుమార్తెను ఇంటి దగ్గరే వదిలి తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లారు.
*గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు హైదరాబాద్‌కు చెందిన పోడేటి సత్యనారాయణగౌడ్‌గా గుర్తించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
*హైదరాబాద్‌ నగర శివారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక లారీ ఢీకొని ఓ బాలుడు మృతిచెందాడు. ఆటోనగర్ నుండి వేగంగా వస్తున్న లారీ సుష్మా థియేటర్ సెంటర్‌లో సిగ్నల్ వద్ద యూ టర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ నాగులు కుమారుడు చేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగులుతో పాటు ఆయన కుమార్తె లావణ్యకు గాయాలయ్యాయి.
*అద్దె కట్టడం లేదని పేదరికాన్ని ఆసరాగా చేసుకుని తన ఇంట్లో ఉండే బాలికను కాళ్లు, చేతులు చచ్చుపడిన సదరు ఇంటి యజమాని వివాహం చేసుకోవాలని ప్రయత్నించగా పోలీసులు, చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు అడ్డుకున్నారు.
*పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఒడిశా గంజాయి స్మగ్లర్ల నిర్బంధంలో ఉన్న ఇద్దరు ఆంధ్ర యువకులను కాపాడారు. పాడేరు ఏఎస్పీ వీరిద్దరిని బుధవారం వారి కుటుంబీకులకు అప్పగించారు. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసుస్టేషన్‌ పరిధిలోని కర్లపోదుర్‌ గ్రామానికి చెందిన సాధూరామ్‌, భగత్‌రామ్‌లను ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒండ్రుగెడ్డలో ఇటీవల స్మగ్లర్లు అపహరించారు.
* ఆలయం వద్ద పిల్లలకు ప్రసాదం ఇచ్చిన కొందరిపై అనుమానంతో స్థానికులు దాడి చేయడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది.
*అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో రెండు పోలీస్‌స్టేషన్లపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆత్మాహుతి బాంబు పేలుళ్లకు పాల్పడి.. అనంతరం పోలీసులపై కాల్పులకు దిగారు. ఈ ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారని.. మరో 16 మంది క్షతగాత్రులయ్యారని అఫ్గాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్గత వ్యవహారాలశాఖ ప్రకటించింది.
*ఆయుధాల అక్రమ సరఫరా కేసులో భానుకిరణ్‌కు నాంపల్లి క్రిమినల్‌ కోర్టు బుధవారం ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. మద్దెల చెరువు సూరి అలియాస్‌ గంగుల సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో భానుకిరణ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
*కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌లో సీఎం బందోబస్తు కోసం వచ్చి వెళ్తున్న పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది.
*పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో ఘోరం జరిగింది. హైవే పక్కన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి గోపిగా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో కానీ.. వడదెబ్బతో కానీ చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* పెట్రోల్, డీజిల్‌ను చోరీ చేస్తున్న ముగ్గురు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలోని బైరామల్‌గూడ వద్ద చోటుచేసుకుంది. తనిఖీల్లో భాగంగా పోలీసులు ట్యాంకర్ల నుంచి ఆయిల్ చోరీని గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 4 వేల లీటర్లు పెట్రోల్, 8 వేల లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
* వరంగల్ జిల్లాలోని భీమదేవరపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి పెండ్లికి వచ్చిన రాజేష్(24) అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగి కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో ఆనంద, సంతోషాల నడుమ జరగాల్సిన పెండ్లి వేడుకలో విషాదం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com