నేటి నేర వార్తలు-06/04

* అనారోగ్యంతోనిజామాబాద్ ప్యాసింజర్ రైల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది.
*జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పన్నాల శ్రవణ్‌రెడ్డి(29)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు గ్రనేడ్‌లతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో 16 మంది గాయపడ్డారు. వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు.
* కన్నతండ్రిపై కొడవలితో దాడిచేసి గాయపరిచిన కుమారుడు, కోడలిపై కేసు నమోదైన సంఘటన వడ్డేపల్లి మండలంలోని జిల్లెడిదిన్నెలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లెడిదిన్నెకు చెందిన ఖాసీమన్న వ్యవసాయ పొలంలో పనిచేసుకుంటున్నాడు. అదే పొలంలో కుమారుడు రాఘవేంద్ర, కోడలు సంజమ్మ పొలం పనులు చేసుకుంటూ గొడవపడ్డారు.
*ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం సమీపంలోని తొండమార్క అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి మావోయిస్టులు, ఎస్టీఎఫ్ జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
*యశ్వంత్‌పూర్‌ నుంచి హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్లే సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌(12649)లోని జనరల్‌ బోగీలో ఆరుగురి ప్రయాణికులపై మత్తు మందు ప్రయోగం చేసి దోపిడీ చేశారు.
*అక్రమ సంబంధం నేపథ్యంలో తలెత్తిన అనుమానం మూడు ప్రాణాలను బలిగొంది. చిత్తూరు గ్రామీణ మండలం మర్రిగుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
*పశ్చిమబెంగాల్‌లో విద్యుత్తు టవర్‌కు అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మరణించిన దులాల్‌కుమార్‌ది ఆత్మహత్యేనని, హత్యకాదని నిర్ధారణ అయిందని పురూలియా ఎస్పీ ఆకాశ్‌ మఘారియా తెలిపారు.
*మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా మోర్‌మాడా గ్రామానికి చెందిన మహాదేవ్‌ గేడం(60) అనే వ్యక్తి ఆదివారం శిందేవాహి – మూల్‌ అటవీ క్షేత్రంలో పులిదాడిలో మృతి చెందాడు.
* క్షణికావేశంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, తానూ తాగింది. ఈ ఘటనలో తల్లి మృతిచెందింది.
* ఓ యువతికి శీతల పానీయంలో మత్తు మందు కలిపి తాగించి, అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*తల్లిదండ్రుల పేరుమీద ఉన్న ఆస్తి.. తన పేరు మీద రాయట్లేదనే కోపంతో కన్న కుమారుడే తల్లిని చంపేశాడు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురం శివారులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
* నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌(ఎస్టీఎఫ్‌) సిబ్బంది గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కిష్టారం గ్రామానికి సమీపాన గల దట్టమైన అడవిలో శనివారం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఎస్పీ అభిషేక్‌ మీనా తెలిపారు.
*కర్ణాటకలోని మైసూరు జిల్లా చుంచనకట్టె జలపాతంలో ఆదివారం ఓ శాస్త్రవేత్త కొట్టుకుపోయారు. ఈయనను సీనియర్‌ శాస్త్రవేత్త సోమశేఖర్‌ (40)గా గుర్తించారు.
*ఆర్టీసీ బస్సు నడుపుతూ డ్రైవర్‌ గుండెపోటుతో మృతిచెందారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
*నవీముంబయిలోని ధారావి గ్రామానికి చెందిన ఓ గృహిణి(40) ఆన్‌లైన్‌ మోసానికి గురైంది. ఫోన్‌ చేసిన మోసగాడికి.. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే పాస్‌వర్డ్‌(ఓటీపీ) వివరాలు 28సార్లు చెప్పి రూ.6.98 లక్షలు కోల్పోయింది.
*తండ్రి ప్రథమ వర్ధంతి నిర్వహించిన కొద్దిగంటల్లోనే తనయుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద ఘటన పలువురిని కలచివేసింది.
*అంతర్జాలంలో చూసి నాటు తుపాకీని తయారు చేసి గాల్లోకి కాల్పులు జరిపిన యువకుడిని తూప్రాన్‌ పోలీసులు అరెస్టు చేశారు.
*నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండల పరిధిలో మాదాపూర్‌ సమీపంలోని కంకర మిషన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు దర్మరణం పాలయ్యారు.
* ఆలయంలోరెండో వివాహం చేసుకున్న విశ్రాంత ఆచార్యుడు.. భార్యపై మోజు తీరిన అనంతరం భార్య, పిల్లలను ఇంటి నుంచి గెంటేసి పరారైన సంఘటన చోటు చేసుకుంది.
* స్నేహితుడి ప్రాణాలు కాపాడి ఆ ప్రమాదంలో తను చిక్కి ఓ వ్యక్తి గల్లంతయిన విషాదకర సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
*ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
*సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* ముంబైలోని ఆదాయపు పన్ను ఆఫీసులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఎన్‌బీ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌ మోదీ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఆ ప్రమాదంలో కాలిబూడిద అయిపోయాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
* కొనరావుపేట్ మండలం నిజామాబాద్ గ్రామంలో విషాదం నెలకొంది. మలకపేట రిజర్వాయర్ కట్టపై ట్రాక్టర్‌తో నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
* రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని మౌంటుఅబు రోడ్డు వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రాలీ.. అదుపుతప్పి సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టింది.
*పెద్దపల్లి ఆర్డీవో అశోక్ కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుసింగరేణి భూసేకరణలో అక్రమాలే కారణంగా భావిస్తున్నారు. కమాన్‌పూర్ మండలం జయ్యారం భూసేకరణలో కోట్ల చెల్లింపులకు గాను.. రూ. కోట్లుకు అంచనాలు పంపించినట్లు ఆర్డీవోపై ఆరోపణలున్నాయి. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా… ఉత్తమ అధికారిగా అశోక్‌కుమార్‌ అవార్డు అందుకున్నారు.
* ఆదిలాబాద్ రిమ్స్‌లో నర్సుల ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా బదిలీలు లేవని నిరసన చేపట్టారు. రిమ్స్ భవనంవాటర్ ట్యాంక్ ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసన తెలుపుతున్న నర్సులను అదుపులోకి తీసుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com