నేటి నేర వార్తలు -06/05

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొండికుంట డీకేఎల్ క్రాస్‌రోడ్డులో రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొండికుంటకు చెందిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
* గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ముంద్రా వద్ద ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోయింది. ముంద్రా వద్ద పొలాల్లో హెలికాప్టర్ కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. శిక్షణలో భాగంగా జామ్‌నగర్ నుంచి వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ సంజయ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.
* కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలోని కరూర్ వైశ్య బ్యాంకులోతాను బ్యాంక్ మేనేజర్‌నంటూ ఓ వ్యక్తిని మోసం చేశాడు. నాగరాజు అనే వ్యక్తి నుంచి ఓటీపీ నెంబర్‌ తెలుసుకుని రూ. 2,లక్షల 50 వేలు తీసుకుని పరార్ అయ్యాడు. విషయం తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు బ్యాంక్‌లోని సీసీ పూటేజీని పరిశీలిస్తున్నారు.
* కాగజ్‌నగర్‌ మండలం రాస్పెల్లి సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
* అదుపుతప్పి లారీ బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.
* గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ముంద్రా వద్ద మంగళవారం ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైలట్‌, ఎయిర్‌ కమాండర్‌ దుర్మరణం చెందారు.
* మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వాసుదేవారెడ్డి(38) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
* హైదరాబాద్‌ లోని అబిడ్స్‌ ప్రాంతంలో కలకలం రేగింది. మంగళవారం ఉదయం ఓ బిల్డింగ్‌ నుంచి పడి యువతి మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. యువతి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
*ముస్లిం మతపెద్దలే లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే సమావేశం ముగిసిపోవడంతో మృతుల్లో మతపెద్దలు, సాధారణ పౌరులు ఎంతమంది అనేది నిర్ధారణ కాలేదు.
* ఇటీవల పట్టుబడ్డ మక్సూద్‌ ఆరేళ్లలో వందల మందికి డిగ్రీ పట్టాలు విక్రయించాడని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెబుతున్నారు.
*నీట్‌’ వైద్య ప్రవేక్షపరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాననే బాధతో 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దిల్లీలోని ద్వారకాసెక్టార్‌ 12లో గల ఎనిమిదో అంతస్తు నుంచి దూకి దుర్మరణం చెందాడు.
*ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవడంతో.. సివిల్‌ సర్వీసుల (యూపీఎస్‌సీ) ప్రిలిమ్స్‌ రాయలేకపోయిన ఓ విద్యార్థి దిల్లీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*విద్యుత్తు తీగల రూపంలో తండ్రీకొడుకును మృత్యువు కబళించిన ఘటన సోమవారం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
* మధ్య అమెరికా దేశం గ్వాటెమాలాలోని ‘ఫ్యూగో’ అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. లావాలో చిక్కుకొని 25 మంది దుర్మరణం పాలయ్యారు.
*విధి ఆడిన వింత నాటకంలో ఓ కుటుంబం బలయిపోయింది. సొంతూరులో అర్ధరాత్రి అస్వస్థతతో తల్లి మరణించింది.. ఉబికివస్తున్న కన్నీటిధారను అణచుకుంటూ వాహనంలో వెళుతున్న ఆమె కుమారుడిని మృత్యువు కబళించింది.
* సీనియరు పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో మరో అనుమానితుడు ప్రవీణ్‌ కుమార్‌ అలియాస్‌ సుజిత్‌ను ప్రత్యేక దర్యాప్తు దళం అరెస్టు చేసింది.
*రెండేళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయితీలో తనకు అనుకూలంగా మాట్లాడకుండా, వ్యతిరేకులకు మద్ధతుగా నిలిచారనే విషయాన్ని మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి ఇద్దరి ప్రాణాలు తీశాడు. ఇటీవల భిక్కనూరు మండలం జంగంపల్లిలో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడింది.
*సచివాలయంలో ఉన్నతాధికారుల కార్లకు డ్రైవర్లుగా పనిచేస్తూ ఒక క్యాబ్‌ డ్రైవరు నుంచి సెల్‌ఫోన్‌ తీసుకుని ఉడాయించిన అక్కి గోపిరాజు (28), కాలసాని నాగరాజు (29)లను సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
*పనిచేసిన ఇంట్లోనే భారీ చోరీ చేసిన దొంగను రాజేంద్రనగర్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రూ.40లక్షల విలువ చేసే 51 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ పద్మజారెడ్డి వివరాలను వెల్లడించారు.
* ఒకరినొకరు ఇష్టపడ్డారు. మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్యోన్యంగా ఉంటున్న వారికి ఇంతలో ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి విగతజీవులుగా మారారు.
*ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్డోయి వద్ద అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ లారీ, ట్రాక్టర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
*కృష్ణా జిల్లా పెనమలూరు పేరంటాళ్ళు చెరువులో భారీసంఖ్యలో చేపలు మృతి చెందాయి. దీంతో చెరువు దగ్గరకు చేరుకున్న మత్స్యకారులు.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చెరువులో విషం కలిపారని ఆందోళన చేపట్టారు.
*తమిళనాడుకు చెందిన బుల్లి తెర నటి వ్యభిచార గృహం నడుపుతూ దొరికిపోయారు. చెన్నైలోని ఓ రిసార్ట్‌ను ఇందుకు అడ్డాగా చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులను నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు నటిని అరెస్ట్‌ చేసి బాధితురాళ్లను రిహాబిలిటేషన్‌‌ సెంటర్‌కు తరలించారు. ఈ రాకెట్‌లో ఆమెతో పాటు సతీశ్‌ అనే వ్యక్తి కూడా ఉన్నాడు.
*కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది.
* హైదరాబాద్‌లోని నాచారంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు స్థానిక మసీదు వద్ద సోమవారం రాత్రి పడేసి వెళ్లిపోయారు. దీంతో ఆ శిశువును ఎలుకలు పీక్కుతిన్నాయి. తీవ్ర రక్త స్రావంతో గొంతు చించుకుని ఆ పసికూన రోదించడంతో స్థానికులు గమనించి వచ్చేసరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది.
* అనకాపల్లి మండలం తమ్మయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్‌ ఆడుతుండగా హేమంత్‌(18), పవన్‌కుమార్‌(18) అనే ఇద్దరు యువకులపై పిడుగుపడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు కాశీంకోట మండలం విస్సన్నపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
* ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కారును ఢీకొట్టగా ముగ్గురు మృతిచెందిన ఘటన బద్వేలు-మైదుకూరు మార్గంలోని నందిపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com