నేటి నేర వార్తలు-06/06

* తనతో సహా ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ తల్లి. ఈ ఘటన బుధవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జల్‌లో చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. వివరాలివి.. సుజాతకు ముగ్గురు సంతానం.. నందిని(7), ధరణి(7 నెలలు), ధనుష్‌ (7 నెలలు) ఇద్దరు కవలలు ఉన్నారు.
*ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలతో సహా నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ ‌బస్సు అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దుకాణం పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
*శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీగా బంగారం పట్టుపడింది. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తుల నుంచి కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
*జగిత్యాల జిల్లాలో ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిలువకోడూరు వంతెన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది
*మానవత్వం మంటగలిసింది. ముర్రుపాలు ఇచ్చి కాపాడాల్సిన ఆడశిశువును ముళ్లపాలు చేశారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందును ఇంకా బొడ్డు కోయకుండానే బంధం తెంచేసుకున్నారు. దీంతో ఈ లోకంలోకి వచ్చిన ఆ చిన్నారి కొన్ని గంటల్లోనే అనంత లోకాలకు వెళ్లిపోయింది.
*సొంత ఇంట్లోనే ముగ్గురు అక్కచెల్లెళ్లు దారుణ హత్యకు గురైనారు. ఈ ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
* క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశజూపి.. జనాల నుంచి రూ.500 కోట్ల మేర వసూళ్లకు పాల్పడిన ఓ ముఠా గుట్టును మహారాష్ట్రలోని ఠానె పోలీసులు రట్టు చేశారు.
* రివర్స్‌ ఓస్మోసిస్‌ (ఆర్వో) ప్లాంట్లు నెలకొల్పుతామంటూ రూ.28 కోట్ల మేర మోసగించారని ఆరోపిస్తూ… హైదరాబాద్‌కు చెందిన స్విస్‌ టెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌టీఐపీఎల్‌) యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు చేసింది.
* ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం సంచాలకుడు పురుషోత్తంరెడ్డిపై నమోదైన మరో కేసులో హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది.
*మిజోరాంలోని లుంగ్లే పట్టణంలో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడటంతో 10 మంది మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలున్నారు.
*భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం నేలకూలిన ప్రమాదంలో మంగళవారం సీనియర్‌ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
*హైదరాబాద్‌ నగరం బంజారాహిల్స్‌లోని హీరా గ్రూప్‌ సంస్థ కార్యాలయంలో కర్ణాటక పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు.
* భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం నేలకూలిన ప్రమాదంలో మంగళవారం సీనియర్‌ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
*గుంటూరు స్వామి థియేటర్‌ సమీపంలోని నార్త్‌క్లబ్‌పై మంగళవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. 247 మందిని అరెస్ట్‌ చేసి రూ.20,28,522 నగదు స్వాధీనం చేసుకున్నారు.
*రాజస్థాన్‌లో అంబులెన్స్‌ల నిర్వహణ కుంభకోణంలో జికిట్‌జా హెల్త్‌ కేర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ డైరక్టరు రవి కృష్ణపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది.
* కడప జిల్లాలో మైదుకూరు – బద్వేలు రహదారి బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున కారు, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
* రివర్స్‌ ఓస్మోసిస్‌ (ఆర్వో) ప్లాంట్లు నెలకొల్పుతామంటూ రూ.28 కోట్ల మేర మోసగించారని ఆరోపిస్తూ… హైదరాబాద్‌కు చెందిన స్విస్‌ టెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌టీఐపీఎల్‌) యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు చేసింది.
*ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముందస్తు పథకం ప్రకారం ఇద్దరు మహిళలు ఓ మైనర్‌ బాలికను ఇద్దరు యువకులకు అప్పగించారు.
*ప్లేటు బిర్యానీకి రూ.190లు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసినందుకు ఆ దుకాణం యజమాని దారుణహత్యకు గురైనారు. నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది.
*ఒకరు అనారోగ్యంతో మరణించగా.. మరొకరు వేదనతో తనువు చాలించారు. దీంతో తండ్రి, తనయుడికి ఏకకాలంలో అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది.
*ఉత్తర కశ్మీరులోని బందిపొర జిల్లాలో మంగళవారం రాత్రి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హజ్జన్‌ పోలీసుస్టేషన్‌కు ఆనుకుని ఉన్న సైనిక స్థావరంపైకి గ్రెనేడ్లు విసిరారు.
*నీట్‌పరీక్షలో నెగ్గుకు రాలేకపోయాననే ఆవేదనతో తమిళనాడులోని విలుపురం జిల్లా చెంజి పెరవలూరుకు చెందిన ప్రతిభ(19) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొంది.
*ఓ పరిశోధక విద్యార్ధినిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కేసులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రం విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న డా.కిరణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
*వెంట్రుకల వ్యాపారం చేస్తూ అవకాశం దొరికినప్పుడు చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు మహిళలను కడప జిల్లా రాజంపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
* విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురువారం పాయకరావుపేట రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం అర్ధరాత్రి దాటాక పాయకరావుపేట ప్రధాన రహదారి పక్కన భవనంపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 33కేవీ విద్యుత్‌ తీగలకు ఫ్లెక్సీ ఇనుప రాడ్స్‌ తగిలి టి.నాగరాజు(28), భీమవరపు శివ(31) అక్కడికక్కడే మృతిచెందారు. శివ పాయకరావుపేట వాసి కాగా.. నాగరాజు స్వస్థలం తుని. ఈ ఘటనపై ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
* కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడినట్లు మంగళవారం రూరల్‌ పోలీసులకు ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ గురిమీడి సతీష్‌ ఫిర్యాదు చేశాడు. రెండు వెండి కంచాలు, రెండు వెండిగ్లాసులు ఎత్తుకెళ్లారు.
* కొమరోలు మండలం వర్ధనపల్లె గ్రామ సమీపంలోని నల్లగుంట్ల బీట్‌ పరిధిలోని అడవుల్లో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం ఆనవాళ్లు కలకలం రేపాయి. వర్ధనపల్లె గ్రామ సమీపంలోని తూరువాగులో మృతదేహానికి సంబంధించిన ఆస్తిపంజరం బయట పడడంతో అటు వైపుగా వెళ్ళిన మేకల కాపరులు చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ అబ్దుల్‌రెహమాన్‌ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
* కరీంనగర్జిల్లాలో మరో విషాద ఘనట చోటు చేసుకుంది. పోలీసు వాహనం సైరన్ చప్పుడు విని భయపడి పారిపోతూ మరో యువకుడు బావిలో పడి మృతి చెందాడు. కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
* అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదో తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. భూదేవినగర్‌కు చెందిన సంగీత(13) అనే విద్యార్థిని ఉదయం స్కూల్ ఉందంటూ ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థిని తండ్రి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* మేడ్చల్ జిల్లా కీసర దగ్గర ఔటర్‌రింగ్‌రోడ్డుపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాచిగూడ ఎస్‌ఐ నరసింహారావు(52) మృతి చెందారు. ఔటర్‌ రింగురోడ్డుపై వెళ్తున్న ఎస్‌ఐ నరసింహారావు ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
* సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ రసాయన పరిశ్రమలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతంమొత్తాన్ని కమ్మేసింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర పొగలు వ్యాపించారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
* ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. లారీ – కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో నలుగురు మృతి చెందారు.
* బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త అయిన రాజ్‌కుంద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మనీలాండరింగ్ కేసు పెట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com