నేటి నేర వార్తలు -06/07

* కడపనగరంలోని సాయిపేటలో విషాదం చోటుచేసుకుంది. నిన్న ఉదయం అదృశ్యమైన బాలుడు కాలువలో శవమై తేలాడు. దీంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తౌసిఫ్ అనే 4 ఏళ్ల బాలుడు నిన్న ఉదయం నుంచి కనిపించకుండా అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుప్రక్కల అణువణువూ గాలించారు. అయినా ఫలితం దక్కలేదు. ఈరోజు కాలువలో శవమై కనిపించాడు.
* విజయనగర పట్టణంలోని కలెక్టరేట్‌ సమీపంలో బుధవారం రాత్రి లారీ ఢీకొట్టిన సంఘటనలో యువతి మృతి చెందింది.
* మొబైల్‌లో పిడుగు ఫొటోను తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో బుధవారం చోటు చేసుకుంది.
* యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూటకొండూరు మండలం కొండాపూర్‌లో దారుణం జరిగింది. రవీందర్ రెడ్డి అనే రైతు విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా ఆయన ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో స్తంభంపైనే రవీందర్ రెడ్డి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు.
* ఓ కామాంధుడు ఏడేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. గుర్తించిన బాలిక కుటుంబసభ్యులు నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
* హైదరాబాద్ ఉప్పల్‌లో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ మెట్రో సమీపంలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
* అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి మృతి చెందడంతో హైదరాబాదు నుంచి వస్తుండగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతానికి చెందిన బావామరదళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
*కెన్యా రాజధాని నైరోబీ పరిసరాల్లో పది మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం గల్లంతైంది.
*భార్యపై అనుమానంతో భర్త అత్యంత కిరాతకంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె అవయవాలను కోసి కారం చల్లాడు. నిప్పుతో కాల్చి పైశాచికంగా వ్యవహరించాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని ఓ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
*కన్నబిడ్డలిద్దరితో సహా ఓ తల్లి కదులుతున్న రైల్లోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాదఘటన బుధవారం విశాఖపట్నంలోని గోపాలపట్నం సమీపంలో చోటు చేసుకుంది.
*మహారాష్ట్రలోని భీమా-కొరేగాంలో జనవరి ఒకటిన జరిగిన అల్లర్ల వ్యవహారంలో పోలీసులు అయిదుగుర్ని అరెస్టు చేశారు.
*ప్రముఖ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు రావాలంటే రూ.25 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని సైబర్‌ నేరస్థులు అంతర్జాలంలో ప్రకటనలు గుప్పిస్తున్నారని వీటిపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచించారు.
*ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పి.చిదంబరంను సీబీఐ బుధవారం దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించింది.
*తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో బుధవారం విద్యుదాఘాతానికి గురై నల్లి వరలక్ష్మి(52), నల్లి పైడికుమారి(22) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు.
* ఓ కామాంధుడి చేతిలో లైంగిక దాడికి గురైన 17 ఏళ్ల బాలిక.. అవమానభారంతో ఆత్మహత్యకు యత్నించింది. 90 శాతం కాలిన గాయాలతో ఆస్ప్రతిలో మృత్యువుతో పోరాడుతోంది.
*జమ్ముకశ్మీర్‌లో సంచలనం సృష్టించిన వ్యభిచార ఉదంతానికి సంబంధించిన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
*తమ అకాడమిక్‌ మార్కులను ఎక్కువచేసి చూపడం ద్వారా వక్రమార్గంలో ఉద్యోగాలు దక్కించుకున్నారన్న ఆరోపణలతో జాతీయ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) ప్రిన్సిపల్‌ ఓం ప్రకాశ్‌ శుక్లా సహా మరో నలుగురు బోధనాసిబ్బందిపై సీబీఐ కేసు నమోదుచేసింది.
*లండన్‌లోని మాండరిన్‌ ఓరియెంటల్‌ హోటల్లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అగ్నికీలల్ని అదుపు చేయడానికి 120 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగాల్సి వచ్చింది.
*విశాఖ జిల్లా పాయకరావుపేటలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పర్యటనకు సంబంధించి ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి గురైన ఇద్దరు అభిమానులు దుర్మరణం చెందారు.
*విజయనగరం జిల్లా మండలంలోని సీతయ్యపేట సమీపంలో నడుస్తున్న రైలునుంచి జారిపడి శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మాణిక్యపురం గ్రామానికి చెందిన పార్వతీ బిసాయి(23) మృతిచెందింది.
*విజయనగరం పట్టణంలోని కలెక్టరేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
* నవనిర్మాణ దీక్షకు వెళ్లి వస్తున్న మహిళలపై అయిదు కుక్కలు దాడిచేసి గాయపరిచిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది.
* తడ మండలం పరిధిలోని పులికాట్‌ సరస్సులో బుధవారం సాయంత్రం మరో పడవ ప్రమాదం త్రుటిలో తప్పింది.
*తన సోదరిని వేధిస్తున్న బావకు బుద్ధిచెప్పాలనే ఉద్దేశంతో సినీఫక్కీలో దాడి చేయించిన ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు.
* ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని.. కర్నూలు- గుంటూరు జాతీయ రహదారిపై కారు, సిమెంటు లారీ ఢీకొనడంతో నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
* ఓ వ్యక్తి రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన జేబులోని ఫోన్‌ పేలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
* బందరులో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఓ చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలో మురికి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఓగీసుపేటలోని మురుగు కాల్వలో పడి మూడేళ్ళ బాలుడు ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు.
* మంచిర్యాల జిల్లాలోని సీసీసీ శ్రీరాంపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లిక్కర్ లోడ్‌తో వెళ్తున్న ట్రాలీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో మద్యం అంతా నేల పాలయింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com