నేటి నేర వార్తలు-06/12

* భద్రతా బలగాల ఆయుధాలను చోరీ చేసిన ఇద్దరు యువకులను జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. రాజౌరి జిల్లా షైన్ ప్రాంతంలో ఆయుధాలను చోరీ చేసి షోపియాన్ జిల్లాకు వెళ్తుండగా యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువకుల నుంచి తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* గోవాలోని కలన్‌గ్యూట్ తీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో మునిగి ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఒకరు పోలీసు ఉన్నారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 14 మంది పర్యాటకులు ఇవాళ ఉదయం 4 గంటలకు గోవాకు చేరుకున్నారు.
* హైదరాబాద్నగరంలోని అడిక్‌మెట్ ఫ్లైవోర్‌పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న రెండు కార్లు పరస్పరం బలంగా ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు
* నల్లధనం కేసులో ఆదాయపుపన్ను శాఖ వారెంట్‌ జారీచేయడంతో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి ముందస్తు బెయిల్‌ కోరుతూ శనివారం రాత్రి 11.30 గంటలకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
*పాక్‌ ఆక్రమిత కశ్మీరు నుంచి మనదేశంలోకి చొరబడటానికి ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి.
*శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం ఆరింటి ప్రాంతంలో పలువురిపై దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
*స్మార్ట్‌ఫోన్‌లో సరదాగా నిధుల కోసం అన్వేషణ(ట్రెజర్‌హంట్‌) అనే ఆట ఆడుతున్న నలుగురికి ఊహించని పరిణామం ఎదురైంది. భారీవర్షాల వల్ల భూగర్భంలోని డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ఒక మహిళ(27) ప్రాణాలు కోల్పోయింది.
* చేతబడి చేస్తున్నాడనే నెపంతో సొంత తాతనే ఓ మనవడు హతమార్చిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి శివారులోని ఏడోమైలు చెంచుకాలనీకి చెందిన శీలం నరసింహం(75) శనివారం రాత్రి ఇంట్లో ఉండగా, మనవడు అంజి వచ్చి అతనితో గొడవ పెట్టుకున్నాడు. అర్ధరాత్రి తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి తాతను చంపుతున్నానని చెప్పాడు.
*అర్హతలేని విద్యార్థులను కూడా క్రీడా కోటా కింద వైద్యవిద్య ప్రవేశాలలో ముందుంచారన్న ఆరోపణలపై అవినీతి నిరోధకశాఖ(అనిశా) నమోదు చేసిన కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటరమణను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
*మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా తడోది అటవీప్రాంతంలోని నెరీ వన పరిక్షేత్రంలో మహాద్వాడి గ్రామానికి చెందిన మహిళలపై ఆదివారం పులి దాడి చేసింది. ఈ దాడిలో దేవాంగనా నికేసర్‌ (35) అనే మహిళ మృతి చెందింది. ఇప్పపువ్వు సేకరణకు మహిళలు ఆదివారం అడవిలోకి వెళ్లగా అక్కడ సంచరిస్తున్న పులి వారిపై దాడి చేసింది. మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
* నాలుగేళ్ల క్రితం శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ‘కిడ్నీ’ రాకెట్‌ కుంభకోణంపై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణ ప్రారంభించింది.
* పోలీసు శాఖలో తనకు ఉద్యోగం వచ్చిందని భార్య తరఫు బంధువులను నమ్మించేందుకే సూర్యాపేటకు చెందిన తిరుపతి లింగరాజు శనివారం సూర్యాపేట గ్రామీణ సీఐ వాహనాన్ని అపహరించినట్లు ఎస్పీ ప్రకాశ్‌ జాదవ్‌ తెలిపారు.
*స్నేహితులతో సరదాగా గడపడానికి కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌కు వెళ్లిన యువకుడు సెల్ఫీ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన కాకినాడ గ్రామీణం తిమ్మాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
* శిరస్త్రాణమే శ్రీరామరక్ష అంటారు. కానీ శిరస్త్రాణం ధరించి వాహనాన్ని నడుపుతున్నా.. మృత్యువు వారిని టిప్పర్‌ రూపంలో వెంటాడింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌ ఢీ కొనడంతో.. వాహనం మీద వెళుతున్న భార్యాభర్తలు మృతి చెందారు.
*ఉరి వేసుకొని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
*బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని హరియాణా పోలీసులు వెల్లడించారు. హరియాణా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ సంపత్‌ నెహ్రాను ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
*సముద్రంలో నిత్యం ప్రయాణించే నేవీ ఉద్యోగి హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లాలోని లోకేశ్వరం మండలం రాజూరా గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.
*గోడకూలి ఇద్దరు మృతి చెందిన ఘటన నేడు విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. గవరపాలెం సతకంపట్టు వద్ద పాత ఇంటిని కూలుస్తున్న ఘటనలో గోడకూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు.
*చదివింది బీటెక్‌, చేసేది రైల్వేలో ఉద్యోగం అయినా బుద్ధి పక్కదారి పట్టింది. జల్సాలకు జీతం సరిపోవడం లేదని చిన్ననాటి స్నేహితురాలి ఇంట్లో దొంగతనానికి పాల్పడి కటకటపాలయ్యాడు ఓ యువకుడు. మీర్‌పేట్‌ ఠాణా పరిధిలో జరిగిన సంఘటన వివరాలను ఆదివారం ఎల్బీనగర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.
* స్నేహితురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన మోయిజ్ అహ్మద్ అనే సౌత్ సెంట్రల్ రైల్వే ఉగ్యోగిని మీర్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడకు చెందిన మోయిజ్ అహ్మద్ సికింద్రాబాద్‌లోని రైల్వే కార్యాలయంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
*సికింద్రాబాద్ నగరంలోని తుకారంగేట్ పరిధి వెంకటనగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఏఎస్‌ఐ వీరయ్య తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*వికారాబాద్ జిల్లాలోని మద్గుల్ చిట్టంపల్లి బండల వాగులో అదుపు తప్పి కారు బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌ వేపై కన్నౌజ్‌ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
* దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా ద్విచక్రవాహనంపై సత్తుపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో భార్యా, భర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారులు సురక్షితంగా ఉన్నారు.
* ఔరంగాబాద్ జిల్లా చందగావ్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దొంగలు అనే అనుమానంతో ఎనిమిది మందిని గ్రామస్థులు చితకబాదారు. దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
* మద్యం తాగి ఇంటికి వచ్చిన తనకు మాంసాహారం వండి పెట్టలేదని భార్యను కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ దారుణ సంఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా పచ్వాన్‌ కాలనీలో చోటు చేసుకుంది.
*ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
*ఎ.కొండూరు మండల కేంద్రమైన ఎ.కొండూరు తండాకు చెందిన భూక్యా ఆదా(68) మూడు సంవత్సరాల క్రితం కిడ్నీ వ్యాధికి గురయ్యాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com