నేటి నేర వార్తలు-06/13

*విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. కాశీ నుంచి వస్తోన్న యాత్రికుల బస్సును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
*ఉత్తరప్రదేశ్‌లోని విధాన సభ ఎదుట ఓ జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. సమాజ్‌వాది కార్యకర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఆ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు.
* రైలు కిందపడి పొదిలికి చెందిన గ్రంధిశిల శివపార్వతి(24) మంగళవారం మృతి చెందింది. ఉదయం 11 గంటల సమయంలో డోన్‌ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్‌ మార్కాపురం స్టేషన్‌కు చేరుకునే సమయంలో తర్లుపాడు వైపు ట్రాక్‌పైకి వెళ్లిన యువతి రైలుకిందపడి అక్కడికక్కడే మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
* అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ వి. శ్రవణ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయడంతోపాటు విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ పోలీసు కమిషనర్‌ వి. రవీందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు
* కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు గ్రామీణ మండలం పేయనకండ్రిగలో చోటుచేసుకుంది.
* శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ బ్రిడ్జి కింద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పల్సర్ బైకును లారీ ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
* మంచిర్యాల పట్టణంలోని ఓవర్‌బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలో పడి సోమవారం రాత్రి బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు గాయపడ్డారు. మంచిర్యాలకు చెందిన ఎండీ అఫ్సర్, యాసీన్‌ నస్పూరుకు వెళ్లి సాయంత్రం తిరిగి మంచిర్యాలకు వస్తుండగా ఒక్కసారిగా సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఇద్దరూ గుంతలో పడ్డారు.
* నల్లగొండ పట్టణం సమీపంలోని పానగల్ ఉదయ సముద్రంలో పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఘటనలో అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో భూతగాదాల నేపథ్యంలో అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
* నల్లగొండ జిల్లాలో ఇవాళ ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా మరొకరి హత్య జరిగింది. నిడమనూరులో వెంపటి శ్రీకాంత్(22) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నా. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
* రోహ్‌తక్‌లోని టోల్‌ప్లాజా సిబ్బందిపై జాట్ లీడర్ సొంబిర్ జాసియా దాడి చేశాడు. అతడిపై ఇదివరకే పలు కేసులు ఉన్నాయి.
* సికింద్రాబాద్ బొల్లారం రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరిని అమరావతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను నాందేడ్‌కు చెందిన సీతమ్మ(50), పంకజ(1)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
* చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక ఓ నిండు గర్భిణీ, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకొంది.
* రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ తగాదాల కారణగా తండ్రీ కొడుకులు దారుణహత్యకు గురయ్యారు. ఇల్లంతకుంట మండలం కిష్టారావుపల్లి గ్రామంలో మంగళవారం వేకువజామున జరిగిన జంట హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి.
*అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
*ఎదుటివారి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తున్న తండ్రీ కుమారులు హేమ్‌రాజ్‌ జైస్వాల్‌, సాయిబాబా జైస్వాల్‌ను రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.
*అమెరికాలో నివసిస్తున్న గుజరాత్‌కు చెందిన ఓ ప్రవాస భారతీయుణ్ని ఆఫ్రికాకు చెందిన అమెరికాజాతీయుడు కాల్చి చంపాడు. జార్జియాలోని అట్లాంటాలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
* ఓ మహిళ కురులను కత్తిరించి, ఆమెపై దాడికి పాల్పడి వివస్త్రను చేసిన అమానుష ఘటన ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా లొహిసింగా ఠాణా పరిధిలోని కొరెకొచియా గ్రామంలో చోటుచేసుకుంది.
*అమెరికాలో నివసిస్తున్న గుజరాత్‌కు చెందిన ఓ ప్రవాస భారతీయుణ్ని ఆఫ్రికాకు చెందిన అమెరికాజాతీయుడు కాల్చి చంపాడు. జార్జియాలోని అట్లాంటాలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. హరికృష్ణ అలియాస్‌ హరీష్‌మిస్త్రి(51) పెట్రోల్‌పంపుతో పాటు చిన్నదుకాణం నడుపుతున్నారని వడోదరలో ఉంటున్న ఆయన మేనల్లుడు చెప్పారు.
*సామూహిక అత్యాచార కేసు నుంచి తప్పిస్తామని చెప్పి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.5 కోట్లు బలవంతంగా రాబట్టాలని చూసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
*సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన సోమవారం కాకినాడ గ్రామీణ మండలంలోని సూర్యారావుపేట ఎన్టీఆర్‌ బీచ్‌లో చోటుచేసుకుంది.
*దక్షిణ దిల్లీ ప్రాంతంలోని ఫతేపూర్‌ బేరికి చెందిన దాతి మహారాజ్‌ అనే బాబాపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది.
*నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందంపల్లి స్టేజ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.
* తూర్పుగోదావరి జిల్లా అంజాబీపేట మార్కెట్‌ యార్డులోని కొబ్బరి గోదాం మంగళవారం ఉదయం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కొబ్బరి గోదాంలో కొబ్బరికాయలు, కొబ్బరి బస్తాలతో పాటు ఇతర సామాగ్రి సైతం పూర్తిగా కాలిపోయింది.
*తమిళనాడులోని తిరువళ్ళూరులో ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ఏడుగురు యువకులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
.*ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త భయ్యూజి మహరాజ్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహరాజ్ ఇండోర్‌లోని తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
*నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. భూ తగాదాలే ఇందుకు కారణంగా సమాచారం.
*నాటు సారా తయారీకి ఉపయోగించే పటిక నిల్వలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
*నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండల కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వెంపటి శ్రీకాంత్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు
*ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త భయ్యూజి మహరాజ్ (50)అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహరాజ్ ఇండోర్‌లోని తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్రగాయాలతో ఉన్న ఆయనను ఇండోర్‌లోని బాంబే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మహరాజ్ నివాసంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* నాటు సారా తయారీకి ఉపయోగించే పటిక నిల్వలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
* కరీంనగర్ శివారులోని చింతకుంట రాజీవ్ గృహకల్ప వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com