నేటి నేర వార్తలు -06/14

*నంద్యాల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలకొండ హాల్‌ వీధికి చెందిన అక్బర్‌ భార్య ఆసియా బేగం (38) అనే గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
*కుటుంబ కలహాలతో ఓ మహిళను ఆమె భర్త గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని నెరమెట్ల గ్రామంలో చోటు చేసుకుంది.
*మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం దుబ్బపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలికపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నట్లుగా సమాచారం.
*ఉత్తర్‌ ప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో 17 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.
*మేడ్చల్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఇంట్లో బుధవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు సోదాలు చేశారు.
*కేరళ తీరంలో ఓ వాణిజ్య నౌక బుధవారం అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిలో ప్రయాణిస్తున్న 22 మందిని కాపాడేందుకు నావికా దళం సహాయక చర్యలను మొదలుపెట్టింది.
*హిందువులు, హిందూ సంస్థలను కించపరుస్తూ ప్రసంగాలు చేస్తున్నందునే పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ను తుపాకీతో కాల్చి హత్య చేశానని కీలక నిందితుడు పరశురామ్‌ వాగ్మోరే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులవద్ద తన నేరాన్ని అంగీకరించాడు.
*ప్రమాదంలో కాళ్లు విరిగినా ధైర్యం కోల్పోని బస్సు చోదకుడు..చాకచక్యంగా వ్యవహరించి 33 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఘటన ఇది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం ఈ ఘటనకు వేదికైంది.
*ముంబయిలోని ప్రభాదేవి ప్రాంతంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ సహా పలువురు ప్రముఖులు నివాసముండే భవన సముదాయంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది.
*మూడో కాన్పులోనైనా మగబిడ్డ పుట్టాలని అత్తింటి వారు పెట్టే వేధింపులు భరించలేక ఇద్దరు ఆడబిడ్డలతో సహా గర్భిణి బావిలో దూకి ఆత్మహత్యకు ఒడిగట్టింది.
*ప్రేమను నిరాకరించినందుకు యువతిపై కోపం పెంచుకున్న యువకుడు..ఆమెపై కత్తితో దాడిచేసిన ఘటన బుధవారం మంచిర్యాల జిల్లాలో జరిగింది.
* నకిలీ విత్తనాల గుట్టురట్టు చేసేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ నడుం బిగించింది. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన కంపెనీలు, గోదాములపై దాడులు నిర్వహిస్తోంది.
*జాతీయ రహదారిపై కంటెయినర్‌లో మంటలు చెలరేగిన ఘటన వాహనదారుల్లో ఆందోళన కలిగించింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్‌ చౌరస్తా టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఘటన జరిగింది.
*విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు వ్యక్తులను బలితీసుకుంది. భోగాపురం మండలం పోలిపల్లి కూడలి సమీపంలో బుధవారం మధ్యాహ్నం 2.20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
*ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ మధ్య మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.
*దక్షిణ ముంబయిలోని వర్లి ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అబ్బాసాహేబ్‌ మరాఠే మార్గ్‌లో ఉన్న బ్లూమౌంట్‌ టవర్స్‌లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
* విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది.
*హైదరాబాద్నగరంలోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ఆవరణలో మహిళను దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు మహిళ కాళ్లు నరికి ఈ ఘటనకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు..? పాత కక్షలే కారణమా? లేక ఇంకా ఏమైన ఉండొచ్చా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com