నేటి నేర వార్తలు -07/04

* త్రిపురారం మండల కేంద్రం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాధిత గొర్రెల యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
* విజయవాడలో ఓ కానిస్టేబుల్‌, తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
*కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో పాత నోట్లు కలకలం సృష్టించాయి. బస్టాండ్ ప్రాంతంలో ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.
*గుంటూరు జిల్లా వెంగలాయపాలెం హత్యకు గురై శివుడు అనే వ్యక్తీ.
*అనంతపురం జిల్లా చిలమట్టూరి మండలం కోడికొండ వద్ద జాతీయ రహదారి పై బుదవారం ఉదయం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్న ట్రాలీ లేని ట్రాక్టర్ ను డీ కొట్టింది.
*నర్సీపట్నం నుండి నాగ పూర్ తరలిస్తున్న సుమారు కోటిపోలీసులు. విలువైన గంజాయిని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న
*రంప చోడవరం
* వరంగల్‌ కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌ వర్స్క్ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
*అమర్‌నాథ్‌ యాత్రికులు వెళుతున్న బల్టాల్‌ మార్గంలో మంగళవారం కొండచరియలు విరిగిపడి అయిదుగురు మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్ము-కశ్మీరులోని గండేర్బల్‌ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.నను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు రాష్ట్రానికి చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం విజయవాడలో సంచలనం సృష్టించింది.
*దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం సబర్బన్‌లోని అంధేరి రైల్వేస్టేషన్‌ సమీపంలో పాదచారుల వంతెన కొంత భాగం మంగళవారం రైలు మార్గంపై కూలింది.
*బహుళజాతి కంపెనీలపై మంగళవారం ఆకస్మికదాడులు చేసిన తూనికలు, కొలతలశాఖ రూ.12.30 కోట్ల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకుంది.
*కోల్‌కతాలోని అమెరికన్‌ సెంటర్‌పై దాడి సూత్రధారి అయిన అఫ్తాబ్‌ అన్సారీకి ఆయుధాల స్మగ్లింగ్‌ కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. అహ్మదాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
*ఇక్కడి ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌.ప్రియాంక (27) ఆత్మహత్య చేసుకుంది. తన కార్యాలయం భవంతిలోని తొమ్మితో అంతస్తునుంచి కిందకు దూకి ప్రాణం తీసుకుంది.
*ఓ టిప్పర్‌ ముందు వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌ సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట – కాకినాడ రహదారిలో సాంబమూర్తి రిజర్వాయర్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
*రెండున్నర దశాబ్దాల కిందట కర్నూలు జిల్లా గడివేముల మండలం చిందుకూరులో ప్రకంపనలు సృష్టించిన నలుగురి హత్య కేసులో సుప్రీంకోర్టు 9 మందికి జీవిత ఖైదు విధించింది.
* నిర్మల్‌ జిల్లా కొండాపూర్‌ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
* అపోహలు, వదంతుల వ్యాప్తి కారణంగా మహారాష్ట్రలో ఐదుగురు వ్యక్తులు బలయ్యారు. ధులే జిల్లాలోని రాయిన్‌పాడా గిరిజన గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.
* ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో జగ్గు అనే నక్సలైట్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఏప్రిల్‌లో బడేసత్తి గ్రామ సర్పంచిని హత్య చేసిన కేసులో ఇతడు ప్రధాన నిందితుడు.
* జాతీయ రహదారి 16పై పెద్ద ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి చెన్నై వెళుతున్న సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ట్యాంకర్‌ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో గుంటూరు జిల్లా కాజ టోల్‌గేట్‌ వద్ద బోల్తా పడింది.
* నెల్లూరు, కడప జిల్లాల్లో జాతీయ రహదారులపై ఆదివారం ఉదయం రెండు రోడ్డు ప్రమాదాలలో ఆరుగురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని రాచర్లపాడు వద్ద ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
* భారతదేశంలో పర్యటించడానికి వచ్చిన ఇటలీ దేశస్థురాలి మీద ముంబయికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దానిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
* హైదరాబాద్‌ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందు అదృశ్య ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం యల్లమ్మ తండాకు చెందిన విజయ గత వారం ఆడశిశువుకు జన్మనిచ్చింది. కదల్లేని స్థితిలో ఉన్న ఆమెను గమనించిన గుర్తు తెలియని మహిళ తనను తాను ఆస్పత్రి సిబ్బందిగా పరిచయం చేసుకొని శిశువుకు టీకా ఇప్పిస్తానని నమ్మబలికి శిశువుతో పాటు పరారైంది.
* నిర్మల్ జిల్లా ముథోల్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో చిన్న నగేష్ అనే యువకుడు తండ్రిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు.
* గుంటూరు జిల్లాలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. తాడేపల్లి మండలం పొలకంపాడుకు చెందిన యువతి గుంటూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. జూన్‌ 29న విధులు ముగిసిన తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆమె మంగళగిరి-తెనాలి మార్గంలోని కోకోకోలా కంపెనీ సమీపంలోకి వెళ్లింది. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆమె స్నేహితుడిని బెదిరించి యువతిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
* సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగామలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన అక్కాతమ్ముళ్లు గంట వ్యవధిలోనే మృతి చెందారు.
* కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అమెరికాలో ప్రమాదవశాత్తూ మృతిచెందాడు.
* కుభీరులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో సోమవారం తెల్లవారుజామున ఓ విద్యార్థిపై కత్తితో దాడి జరిగిన సంఘటన కలకలం రేపింది.
* శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.
*తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణ శివారులోని సాంబమూర్తి రిజర్వాయర్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
* సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగామలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన అక్కాతమ్ముళ్లు గంట వ్యవధిలోనే మృతి చెందారు.
*నిర్మల్‌ జిల్లా కుభీరులో సోమవారం తెల్లవారుజామున మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు.
*మహారాష్ట్రలో పిల్లలను అపహరించే ముఠా సభ్యులుగా అనుమానిస్తూ… ఐదుగురిని కొట్టిచంపిన ఘటనకు సంబంధించి 23 మందిని పోలీసులు అరెస్టుచేశారు.
*ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా జయపురం పట్టణంలో ఓ శిశువు మృతదేహాన్ని శునకాలు నోటితో పట్టుకుని కొట్లాడుకుంటున్న ఘటన ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది.
*కన్న కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన సంఘటన సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. భర్త ప్రవర్తనపై విసుగు చెందిన భార్య పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది.
* మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యంను జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా కరీంనగర్‌ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం రిలీజు ఆర్డరు జారీ చేసింది.
*చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శెట్టేరి గ్రామానికి చెందిన ఓ రైతు మామిడితోటలో ఏనుగు మృతి చెందింది.
*మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామస్థులు నిరూడి జైలు(65)అనే వ్యక్తిపై దాడి చేసి కొట్టడంతో మృతిచెందాడు.
* కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
* బతుకు దెరువు కోసం ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా బస్‌ డిపోలో పనిచేస్తున్న యువకుడు బస్సు టైరు పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన సంఘటన జనగామ ఆర్టీసీ డిపోలో జరిగింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com