నేటి నేర వార్తలు -07/06

*అమర్‌నాథ్ యాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. కొండపై నుంచి బండరాళ్లు దొర్లిపడటంతో ఓ మహిళా యాత్రికురాలు చనిపోయింది. శేర్‌లింగంపల్లికి చెందిన పులిచెర్ల లక్ష్మి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. యాత్ర చేస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన బండరాయి లక్ష్మిని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
*ముంబయి నగరంలోని జుహు బీచ్‌ వద్ద గురువారం సాయంత్రం ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురు యువకులలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
*ముంబయిలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి పెద్దమొత్తంలో విదేశీ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలోని విమాన నిఘా విభాగం రూ.1,48,500 అమెరికా డాలర్లను కారు బోర్డులో ప్యాక్‌ చేసి తరలిస్తుండగా పట్టుకుంది. నగదును తరలిస్తున్న ప్రయాణికుడిని అధికారులు అరెస్ట్‌ చేశారు.
*హైదరాబాద్‌ శివారు బీరంగూడలో సంచలనం సృష్టించిన నగల దుకాణం దోపిడి కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. దోపిడికి పాల్పడిన వారు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
*జమ్ముకశ్మీర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన జవాను ఔరంగజేబు హత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. కశ్మీర్‌ యువతితో ప్రేమాయణమే ఆయనను హత్య చేయడానికి అవకాశం కల్పించిందని తేలింది.
*పల్లీ గింజ గొంతులో ఇరుక్కుని 16 నెలల బాలుడు మృతి చెందాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలంలో బుధవారం జరిగిన ఘటనతో కుటుంబంలో విషాదం అలముకుంది.
* అక్రమ సంబంధం సజీవ దహనానికి దారితీసిన సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం పంచాయతీ పరిధిలోని కోళ్లమిట్టలో బుధవారం చోటుచేసుకుంది.
*అక్రమంగా తరలిస్తున్న రూ.1.15 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి కోయంబత్తూరుకు వచ్చిన విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన అమల్‌రాజ్‌ (25) వద్ద లగేజీలో బంగారు కడ్డీలు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.1.15 కోట్లు ఉంటుందని వారు తెలిపారు. నిందితుడిని జైలుకు తరలించారు.
* నిద్రలో ఉండగా కుక్కలు దాడి చేయడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండలం గాలీపూర్‌కు చెందిన చెట్లకింద దుర్గవ్వ(80) ఆరుబయట నిద్రిస్తుండగా కుమారుడు, కోడలు, పిల్లలు ఇంట్లో పడుకున్నారు. మంగళవారం మధ్యరాత్రి కుక్కల గుంపు దుర్గవ్వపై దాడి చేసి ముఖం, కాళ్లు, చేతులను పీక్కుతిన్నాయి. దీంతో ఆమె చనిపోయింది.
*త అమర్‌నాథ్‌ యాత్రికులు వెళుతున్న బల్టాల్‌ మార్గంలో మంగళవారం కొండచరియలు విరిగిపడి అయిదుగురు మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్ము-కశ్మీరులోని గండేర్బల్‌ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.నను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు రాష్ట్రానికి చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం విజయవాడలో సంచలనం సృష్టించింది.
*దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం సబర్బన్‌లోని అంధేరి రైల్వేస్టేషన్‌ సమీపంలో పాదచారుల వంతెన కొంత భాగం మంగళవారం రైలు మార్గంపై కూలింది.
*బహుళజాతి కంపెనీలపై మంగళవారం ఆకస్మికదాడులు చేసిన తూనికలు, కొలతలశాఖ రూ.12.30 కోట్ల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకుంది.
*కోల్‌కతాలోని అమెరికన్‌ సెంటర్‌పై దాడి సూత్రధారి అయిన అఫ్తాబ్‌ అన్సారీకి ఆయుధాల స్మగ్లింగ్‌ కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. అహ్మదాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
*ఇక్కడి ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్‌.ప్రియాంక (27) ఆత్మహత్య చేసుకుంది. తన కార్యాలయం భవంతిలోని తొమ్మితో అంతస్తునుంచి కిందకు దూకి ప్రాణం తీసుకుంది.
*ఓ టిప్పర్‌ ముందు వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌ సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట – కాకినాడ రహదారిలో సాంబమూర్తి రిజర్వాయర్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
*రెండున్నర దశాబ్దాల కిందట కర్నూలు జిల్లా గడివేముల మండలం చిందుకూరులో ప్రకంపనలు సృష్టించిన నలుగురి హత్య కేసులో సుప్రీంకోర్టు 9 మందికి జీవిత ఖైదు విధించింది.
* నిర్మల్‌ జిల్లా కొండాపూర్‌ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
* అపోహలు, వదంతుల వ్యాప్తి కారణంగా మహారాష్ట్రలో ఐదుగురు వ్యక్తులు బలయ్యారు. ధులే జిల్లాలోని రాయిన్‌పాడా గిరిజన గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.
* ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో జగ్గు అనే నక్సలైట్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఏప్రిల్‌లో బడేసత్తి గ్రామ సర్పంచిని హత్య చేసిన కేసులో ఇతడు ప్రధాన నిందితుడు.
* జాతీయ రహదారి 16పై పెద్ద ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి చెన్నై వెళుతున్న సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ట్యాంకర్‌ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో గుంటూరు జిల్లా కాజ టోల్‌గేట్‌ వద్ద బోల్తా పడింది.
* నెల్లూరు, కడప జిల్లాల్లో జాతీయ రహదారులపై ఆదివారం ఉదయం రెండు రోడ్డు ప్రమాదాలలో ఆరుగురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని రాచర్లపాడు వద్ద ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
* భారతదేశంలో పర్యటించడానికి వచ్చిన ఇటలీ దేశస్థురాలి మీద ముంబయికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దానిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
* హైదరాబాద్‌ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందు అదృశ్య ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం యల్లమ్మ తండాకు చెందిన విజయ గత వారం ఆడశిశువుకు జన్మనిచ్చింది. కదల్లేని స్థితిలో ఉన్న ఆమెను గమనించిన గుర్తు తెలియని మహిళ తనను తాను ఆస్పత్రి సిబ్బందిగా పరిచయం చేసుకొని శిశువుకు టీకా ఇప్పిస్తానని నమ్మబలికి శిశువుతో పాటు పరారైంది.
* నిర్మల్ జిల్లా ముథోల్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో చిన్న నగేష్ అనే యువకుడు తండ్రిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు.
* గుంటూరు జిల్లాలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. తాడేపల్లి మండలం పొలకంపాడుకు చెందిన యువతి గుంటూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. జూన్‌ 29న విధులు ముగిసిన తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆమె మంగళగిరి-తెనాలి మార్గంలోని కోకోకోలా కంపెనీ సమీపంలోకి వెళ్లింది. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆమె స్నేహితుడిని బెదిరించి యువతిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
* సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగామలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన అక్కాతమ్ముళ్లు గంట వ్యవధిలోనే మృతి చెందారు.
* కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అమెరికాలో ప్రమాదవశాత్తూ మృతిచెందాడు.
* కుభీరులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో సోమవారం తెల్లవారుజామున ఓ విద్యార్థిపై కత్తితో దాడి జరిగిన సంఘటన కలకలం రేపింది.
* శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.
*తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణ శివారులోని సాంబమూర్తి రిజర్వాయర్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
* సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జలిగామలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన అక్కాతమ్ముళ్లు గంట వ్యవధిలోనే మృతి చెందారు.
*నిర్మల్‌ జిల్లా కుభీరులో సోమవారం తెల్లవారుజామున మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు.
*మహారాష్ట్రలో పిల్లలను అపహరించే ముఠా సభ్యులుగా అనుమానిస్తూ… ఐదుగురిని కొట్టిచంపిన ఘటనకు సంబంధించి 23 మందిని పోలీసులు అరెస్టుచేశారు.
*ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా జయపురం పట్టణంలో ఓ శిశువు మృతదేహాన్ని శునకాలు నోటితో పట్టుకుని కొట్లాడుకుంటున్న ఘటన ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది.
*కన్న కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన సంఘటన సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. భర్త ప్రవర్తనపై విసుగు చెందిన భార్య పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది.
* మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యంను జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా కరీంనగర్‌ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం రిలీజు ఆర్డరు జారీ చేసింది.
*చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శెట్టేరి గ్రామానికి చెందిన ఓ రైతు మామిడితోటలో ఏనుగు మృతి చెందింది.
*మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామస్థులు నిరూడి జైలు(65)అనే వ్యక్తిపై దాడి చేసి కొట్టడంతో మృతిచెందాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com