నేటి నేర వార్తలు -07/09

*రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అజ్మేర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో 21మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* విశాఖ జిల్లా చీడికాడ మండలం చుక్కపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పదంగా ముగ్గురు మహిళలు బావిలో పడి మృతి చెందారు. తల్లి చామంతుల భవానీ(40) తన కూతళ్లు జయంతి(13), వరలక్ష్మి (9)లతో కలిసి శనివారం గడ్డి కోయాడానికి పొలంలోకి వెళ్లింది. సాయంత్రం వరకు రాకపోయోసరికి కుటంబ సభ్యులు పోలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 10 గంటల సమయంలో నెల బావిలో వీరి మృత దేహాలను గుర్తించారు. బంధువులు, స్థానికులు వచ్చి మృత దేహలను వెలికి తీశారు. దీనిపై పోలీసులు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సురేశ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* బీజేపీ కార్యాలయం నూతన భవనం నిర్మాణానికి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం భూమిపూజ నిర్వహించారు. నిన్న జరిగిన పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన కన్నా అక్కడే ఉండి ఆదివారం ఉదయం జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
*నీటిపారుదల చీఫ్‌ ఇంజినీరు కె.సురేష్‌కుమార్‌ ఆస్తుల సోదాలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు కరీంనగర్‌లోని సురేష్‌ కుమార్‌ ఇంటిని సోదా చేయడంతో పాటు మూడు బ్యాంకు లాకర్లను తెరిచి రూ.95 లక్షలు విలువైన ఆస్తులను గుర్తించారు.
*తాను చెప్పిన బాలికకు ప్రేమలేఖ రాయబారం నడపలేదని ఓ ఇంటర్‌ విద్యార్థి ఏడో తరగతి చదువుతున్న బాలుడిపై పెట్రోలు పోసి నిప్పటించాడు. ప్రకాశంజిల్లా అర్థవీడులో జరిగిన ఈ ఘాతుకం సంచలనం సృష్టించింది.
* ప్రియుడితోపాటు ఓ గిరిజన మహిళను వివస్త్రనుచేసి ఊరేగించిన దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి తొమ్మిది మందిని అరెస్టుచేసినట్లు పోలీసులు తెలిపారు.
*ఇంటికి వచ్చిన తన కుమార్తె స్నేహితురాలిపై ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకొంది. విదేశాల్లో చదువుకుంటున్న స్నేహితురాలు సెలవులపై వచ్చినందుకు ఆమెను చూసేందుకు బాధితురాలు వెళ్లిందని పోలీసులు తెలిపారు.
*కర్నూలు జిల్లా సున్నిపెంట అడవుల్లో దాచిన మావోయిస్టు డంప్‌ను శనివారం రెండో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లింగాలగట్టు సమీప మామిడిసెల నల్లమల అడవులలో ఈ డంప్‌ను గుర్తించినట్లు ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి చెప్పారు.
*1992లో వెలుగుచూసిన సెక్యూరిటీస్‌ కుంభకోణంలో సీనియర్‌ బ్యాంకు అధికారులు సహా అయిదుగురికి కారాగార శిక్షలు విధిస్తూ ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల తీర్పు చెప్పింది.
*సోమాలియా హోంశాఖ కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 9 మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందారు.
*మేఘాలయ రాష్ట్రం పశ్చిమ జయంతియా జిల్లా బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఆవుల దొంగలు జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందారు.
*నిర్భయ కేసులో మరణ శిక్ష పడ్డ ముగ్గురు ముద్దాయిలు దాఖలు చేసిన పునఃసమీక్ష వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నలుగురికి మరణశిక్ష పడగా ముగ్గురు ముద్దాయిలు…పవన్‌, వినయ్‌, ముఖేష్‌లు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
*గ్యాంగ్‌స్టర్‌నని బెదిరించి ఓ స్థిరాస్తి వ్యాపారి నుంచి రూ.10 కోట్లు గుంజడానికి యత్నించిన ఓ వ్యక్తినిపోలీసులు శనివారం అరెస్టు చేశారు.
*ఉట్నూరు మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పేర్ల అనిల్‌(29)హత్య కేసులో నిందితుడు టేకుల గంగాధర్‌ అలియాస్‌ చంటిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
*తెల్లవారితే పెళ్లి చూపులకు వెళ్లాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో ఆ యువకుడు మృత్యువాత పడ్డాడు. సంతోషంగా ఉండాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది.
*చెప్పిన మాట వినకుండా తనపై ఎదురు తిరిగాడన్న ఆక్రోశంతో ఓ ఇంటర్‌ విద్యార్థి తన జూనియర్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకుంది.
గంటలకు తారకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.గుండెపోటుతో మృతి చెందారు.
*జనగామ మండలం చీటకోడూరు గ్రామంలో దారుణ సంఘటన జరిగింది. సొంత భావను అతని బావమరిది అతి దారుణంగా హత్య చేశాడు.
* ఆన్‌లైన్లో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. మూడు నెలలుగా ఈ ముఠా సభ్యులు నగరంలోని రాపర్తి నగర్‌లో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ పట్టణానికి చెందిన నలుగురు బుకీలతో సంబంధం పెట్టుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ..55వేల నగదు, ఐదు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
* గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జెట్టిలోని రెండు వేట బోట్లు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.70 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
* హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను రాంపల్లి వాసులుగా గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
*రోడ్డుమధ్యలో బలవంతంగా కారు ఆపించి బెంగాలీ నటీమనులను బెదిరించ్న బుల్లితెర నటుడు అరెస్తుయ్యాడు.
* అనర్హత ఎమ్మెల్యేల కేసులో తీర్పు ఇచ్చిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుందర్‌కు బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన కేసులో సభాపతి నిర్ణయాన్ని సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ తీర్పు ఇవ్వగా…మరో న్యాయమూర్తి జస్టిస్‌ సుందర్‌ విభేదిస్తూ తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో అడయారులోని గ్రీన్‌వేస్‌ రోడ్డులో ఉన్న ఆయన నివాస చిరునామాకు బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశమైంది.
*వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా మారిన ఉత్తరప్రదేశ్ భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి నోరుపారేసుకున్నారు. రాముడే దిగివచ్చినా అత్యాచారాలు అపలేదంటూ ఆయన శనివారం వ్యాఖ్యానించారు. ఉన్నావ్ లో ఓ మహిళను ఇటీవల కొందరు అటవీ ప్రాంతానికి లాకేళ్లి వేధింపులకు గురి చేసారు. దీనికి సంబందించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విలేకరులతో సింగ్ మాట్లాడుతూ మనసు కలుషితం కావడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సమాజంలో ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా పరిగణించడం తప్పనిసరి కావాలి. విలువలతోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
*ఘర్షణలు రెచ్చగొట్టారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను కలిసేందుకు జైలుకు వెళ్ళడంతో మరో కేంద్ర మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com