నేటి నేర వార్తలు -07/10

* నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో లత అనే యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
* నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ పట్టణంలో ఈ నెల 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ సందర్భంగా జాబ్ మేళా నిర్వహణపై వీఓఏలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
* భూపాలపల్లిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న దొంగను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన బైరి శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ. ల నగదువిలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో సోమవారం ఇసుక లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ- కరీంనగర్‌ ప్రధాన రహదారిపై అనుపురం- రుద్రవరం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది.
*ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారులు మరో దళారీని పట్టుకున్నారు. ఒక ప్రముఖ కార్పొరేట్‌ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులతో విజయవాడ నుంచి కటక్‌ వెళ్లి క్యాంపు నిర్వహించిన నేరంపై బెంగళూరుకు చెందిన వైద్య విద్యార్థి గణేష్‌ ప్రసాద్‌ను అరెస్టు చేశారు.
* ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యంతో పాటు ఉపాధ్యాయులు పట్టించుకోక పోవడంతో పాఠశాల ఆవరణలోనే ఓ బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
*చత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల మందుపాతరకు ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సోమవారం బలైపోయారు. కంకేర్‌ జిల్లా తాడ్‌బౌలి అటవీ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ 121 బెటాలియన్‌కు చెందిన బృందం సాయంత్రం మోటారుసైకిళ్లపై గస్తీ తిరుగుతున్న సమయంలో భూమిలో పాతిపెట్టిన మందుపాతరను నక్సలైట్లు పేల్చినట్లు డీఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.
* గుంటూరు జిల్లా నిజాంపట్నం ఓడరేవులో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. రెండు చేపల వేట పడవలు దగ్ధమై సుమారు రూ.70 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
*కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఇద్దరు అమర్‌నాథ్‌ యాత్రికులు మృత్యువాతపడ్డారు.
*ఉత్తర్‌ప్రదేశ్‌లో కరడుగట్టిన నేరగాడు ప్రేమ్‌ ప్రకాశ్‌ సింగ్‌ అలియాస్‌ మున్నా బజరంగీని మరో గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ రాఠీ సోమవారం కాల్చి చంపాడు.
*ఎస్సై కొట్టాడనే మనస్తాపంతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని పెరుమాళ్లపల్లె సమీపంలో సోమవారం చోటు చేసుకుంది.
*ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తకు అత్తమామలు మాయమాటలు చెప్పి వేరే మహిళతో వివాహం చేసి, తన నుంచి దూరం చేశారని, రెండు నెలల బిడ్డతో తాను ఇప్పుడు రోడ్డునపడ్డానని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత మహిళ కన్నీరు పెట్టారు.
*గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
*అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధి తారామతిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. శాంతినికేతన్ స్కూల్‌కు చెందిన బస్సు కిరోడ్డు మీద ఆడుకుంటుండగా.. చిన్నారిని గమనించని బస్సు డ్రైవర్ బస్సును చిన్నారి మీది నుంచి పోనిచ్చాడు. దీంతో తన్వీష్ బస్సు చక్రాల కింద పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు.
* అశ్వారావుపేట మండలం వినాయకపురం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com