నేటి నేర వార్తలు -07/13

* విజయవాడలో పట్టపగలు దారుణం జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసేందుకు ఇద్దరు కుర్రాళ్లు ప్రయత్నించారు. ఈ ఘటన విజయవాడలోని సత్యనారాయణపురంలో శుక్రవారం చోటుచేసుకుంది.
*ఇక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత సంతతి చిన్నారులు ఇద్దరు మరణించగా…వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ట్రుంగానినాలోని హాప్‌కిన్స్‌ రోడ్డులో ఆదివారం ఈ ప్రమాదం సంభవించినట్లు మీడియా వార్తలు తెలిపాయి.
*ముందు వెళ్తున్న లారీని బోలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
*వెంకటాచలం మండలంలోని కసుమూరులో జరిగిన గుంజి రమణమ్మ హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.
*తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ సరఫరా చేసే నీలికిరోసిన్‌ను అక్రమంగా ఆంధ్ర ప్రాంతంలోని పెట్రోల్‌ బంక్‌ల యజమానులకు విక్రయిస్తున్న ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
* జమ్మూ-కశ్మీర్‌లో సోపియాన్‌ జిల్లా కుందల్లాన్‌ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ పాకిస్థానీ సహా ఇద్దరు జైషే మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రవాదులను భద్రతదళాలు మంగళవారం మట్టుపెట్టాయి. ఈ సందర్భంగా స్థానికులు, భద్రత సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఓ పౌరుడు మృతి చెందగా 20 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
*పంజాబ్‌లో ఐదేళ్ల చిన్నారి సామూహిక అత్యాచారానికి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పైశాచిక చర్యకు ఒడిగట్టారు.
*బంధువుల ఇంటికి వెళ్లిన బాలికను నమ్మించి ఆటోలో ఎక్కించుకున్న యువకులు..ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.
* అఫ్గానిస్థాన్‌లో జలాలాబాద్‌ నగరంలో జరిగిన ఒక ఆత్మాహుతి దాడిలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే.
* రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో సోమవారం ఇసుక లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ- కరీంనగర్‌ ప్రధాన రహదారిపై అనుపురం- రుద్రవరం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది.
*ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారులు మరో దళారీని పట్టుకున్నారు. ఒక ప్రముఖ కార్పొరేట్‌ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులతో విజయవాడ నుంచి కటక్‌ వెళ్లి క్యాంపు నిర్వహించిన నేరంపై బెంగళూరుకు చెందిన వైద్య విద్యార్థి గణేష్‌ ప్రసాద్‌ను అరెస్టు చేశారు.
* ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యంతో పాటు ఉపాధ్యాయులు పట్టించుకోక పోవడంతో పాఠశాల ఆవరణలోనే ఓ బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
*చత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల మందుపాతరకు ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సోమవారం బలైపోయారు. కంకేర్‌ జిల్లా తాడ్‌బౌలి అటవీ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ 121 బెటాలియన్‌కు చెందిన బృందం సాయంత్రం మోటారుసైకిళ్లపై గస్తీ తిరుగుతున్న సమయంలో భూమిలో పాతిపెట్టిన మందుపాతరను నక్సలైట్లు పేల్చినట్లు డీఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.
* గుంటూరు జిల్లా నిజాంపట్నం ఓడరేవులో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. రెండు చేపల వేట పడవలు దగ్ధమై సుమారు రూ.70 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
*కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం ఇద్దరు అమర్‌నాథ్‌ యాత్రికులు మృత్యువాతపడ్డారు.
*ఉత్తర్‌ప్రదేశ్‌లో కరడుగట్టిన నేరగాడు ప్రేమ్‌ ప్రకాశ్‌ సింగ్‌ అలియాస్‌ మున్నా బజరంగీని మరో గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ రాఠీ సోమవారం కాల్చి చంపాడు.
*ఎస్సై కొట్టాడనే మనస్తాపంతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని పెరుమాళ్లపల్లె సమీపంలో సోమవారం చోటు చేసుకుంది.
*ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తకు అత్తమామలు మాయమాటలు చెప్పి వేరే మహిళతో వివాహం చేసి, తన నుంచి దూరం చేశారని, రెండు నెలల బిడ్డతో తాను ఇప్పుడు రోడ్డునపడ్డానని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత మహిళ కన్నీరు పెట్టారు.
*గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రోడ్డు మీద ఆడుకుంటుండగా.. చిన్నారిని గమనించని బస్సు డ్రైవర్ బస్సును చిన్నారి మీది నుంచి పోనిచ్చాడు. దీంతో తన్వీష్ బస్సు చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
*అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధి తారామతిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. శాంతినికేతన్ స్కూల్‌కు చెందిన బస్సు కింద పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. బుర్ర తన్వీష్(
*కళాశాలలో నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ కారణంగా ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయింబత్తూరు నగరంలో చోటుచేసుకుంది.
* కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా తిరువూరు రైతుబజారు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన భార్యను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com