నేటి పంచాంగం-౦౨/౦౬

శుభమస్తు-06/02/2018

తిథి: 

షష్ఠి మ.12.02; కలియుగం – 5119 శాలివాహన శకం – 1939

నక్షత్రం: 

చిత్త మ.2.50;

వర్జ్యం: 

రా.08.38 నుండి 10.17 వరకు

దుర్ముహూర్తం: 

ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు

రాహు కాలం: 

మ.3.00 నుండి 4.30 వరకు

మేషం: 

(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆకస్మిక ధనలాభం ఉంది. రాజకీయరంగంలోనివారు, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయానే్న సాధిస్తారు.బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగరంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.

వృషభం: 

(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రహస్య శత్రుబాధలుండే అవకాశం ఉంది. దైవ ప్రార్థన కోసం దేవాలయ సందర్శన చేస్తారు.

మిథునం: 

(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆందోళన దూరమవుతుంది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థాన చలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.అనుకొన్న పనులు చేయడానికి దీర్ఘ శ్రమ అవసరం అవుతుంది.

కర్కాటకం: 

(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆత్మీయుల మిత్రుల సహకారం లభిస్తుంది. ధననష్టమేర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధ వలన బలహీనులవుతారు. అధికార భయం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకొంటారు. గురువుల సందర్శన యోగం ఉంది. తీర్థయాత్రల ప్రణాళిక వేస్తారు.

సింహం: 

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. స్థాన చలన సూచనలున్నాయి. సన్నిహితులతో జాగ్రత్తగా మసలాలి. రహస్య శత్రుబాధలుండే అవకాశం ఉంది.

కన్య: 

(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఋణబాధలు తొలిగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.

తుల: 

(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. వాయిదా పనులన్నీ పూర్తిచేస్తారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిరనివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మవిషయాలను గ్రహిస్తారు.

వృశ్చికం: 

(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) గౌరవమర్యాదలకు లోపముండదు. వ్యయప్రయాసలు అధికమవుతాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. వృధా ప్రయాణాలెక్కువ. మానసికాందోళన ఉంటుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.

ధనుస్సు: 

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) కళాకారులకు మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు మెండు. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు పొందుతారు.

మకరం: 

(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఋణప్రయత్నాలు ఫలించును. పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కాని మానసిక ఆందోళన కూడా ఉంటుంది. ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలసి విందులువినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకొంటారు. స్ర్తీల తో చేసే వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం: 

(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించ బడుతాయ. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయ.

మీనం: 

(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభకార్యాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలసి విందుల్లో పాల్గొంటారు. ధనలాభం,వస్త్ర లాభం కలుగుతుంది. ధైర్యంగా అనుకొన్న పనులను పూర్తిచేస్తారు. దైవం అనుకూలంగా ఉంటుంది. స్రీలు వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com