నేటి బిజినెస్ వార్తలు-౧౨/౧౦

*సుమారు పదమూడు వందల శాఖాల పేర్లు, ఐ.ఎఫ్.ఎస్. సి కోడ్లను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మార్చింది. ముంబాయి, డిల్లి , బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ , కోల్ కతా సహా పలు నగరాలలోని శాఖాల్లో బ్యాంక్ ఈ మార్పులు చేసింది. ఎస్బీఐ శాఖల్లో అనుబంధ బ్యాంకులు విలీనం కావడంతో కోడ్ లను మార్చినట్లు ఎస్ బీ ఐ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ గుప్తా పేర్కొన్నారు. కోడ్ ల మార్పునకు సంబందించిన సమాచారాన్ని వినియోగదారులకు అందించామని తెలిపారు. పాత, కొత్త పేర్లు కోడ్ లను మార్చిన సాఖాల జాబితాను బ్యాంక్ వెబ్ సైట్ లో ఉంచింది.
*ప్రముఖ సంస్థ జాన్ డీర్ దేశంలోకి అతి పెద్ద ట్రాక్టర్ తీసుకొస్తుంది. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన తోలి ట్రాక్టర్ ను డిల్లీలోని భారత్ వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ఎరాప్టు చేసిన అగ్రీమేక్ ఎగ్జిబీషన్ లో ప్రదర్శనకు ఉంచింది. మోడల్ 6120బీ పేరుతొ తీసుకొస్తున్న 127హెచ్ పీ ట్రాక్టర్ ధర రూ .25లక్షల దాకా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
*బ్యాంక్ డిపాజిట్ల పై ఇచ్చే హామీ మొత్తాన్ని పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం రూ. లక్షగా ఉన్న ఈ మొత్తాన్ని మరింత పెంచాలని భావిస్తోంది. ఫైనాన్షియల్ రిసోల్యుషన్ అండ్ డిపాజిట్ ఇన్సురెన్స్ బిల్ 2017 లో దీన్ని పొందుపరచాలని సన్నాహాలు చేస్తునంట్లు అత్యంత విశ్వాసనీయ వర్గాలకు వూటంకిస్తూ ఒక ఆంగ్ల పత్రిక తన కధనంలో తెలిపింది.
*స్మార్ట్ ఫోన్ రూ. ముప్పై వేలు నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఏడెనిమిది వెల్ రూపాయలు ధరల శ్రేణిలోనే త్రీజీ ర్యాం ముప్పై రెండు జీబీ మెమొరీలో ఫోన్లు లభిస్తున్నాయి. యాపిల్ మినహా ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ ధరలు ఆరునెలల నుంచి ఏడాది వ్యవధిలోనే గణనీయగా తగ్గుతున్నాయి. విపణిలో ఉన్న ఫోన్ కంటే మరింత అధునాతన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసినపుడు పాత మోడళ్ళు ధరలను కంపీనీలు తగ్గించడం సహజ పరిణామమే దీనికి అదనంగా ఆన్ లైన్ పోర్టల్లలో ఒప్పదం చేసుకుంటూ ఆకర్షణీయ ఎక్సేంజ ఆఫర్లు కూడా ప్రకటిస్తూనే పైగా వడ్డీ లేని సులభ వాయిదాలలో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. వీటికి కళాశాల విద్యార్ధుల ఉద్యోగం చేస్తున్న యువత అధికంగా ఆకర్షితులవుతున్నారు.
*స్టాక్ ఎక్చేంగ్లో నమోదు కాని కంపెనీలు తాజా షేర్లను జారీ చేయడం ద్వారా ప్రజల నుంచి నిధులను సమీకరిస్తాయి. దీని ఐపీఓ అంటారు. ఆ తర్వాత కొత్త మదుపర్లకు లేదా ప్రస్తుత వాటాదార్లకు తాజా షేర్లను జారీ చేసే విధానాన్ని ఎఫ్పీఓ అంటారు. కానీ ఓఎఫ్ఎస్లో మాత్రం ఒక నమోదిత కంపెనీకి ప్రమోటర్ల వాటాను విక్రయిస్తారు. ఐవోపీ ఎఫ్పీఓల్లాగా ఇక్కడ తాజా షేర్లు జారీ చేయరు. వాటిలా మూడు నలుగు రోజులు బిడ్డింగ్ జరగదు. ఒక రోజుల్లోనే బ్రిద్దింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
*కంపెనీలు మెయిన్ ప్రేమ్స్ వంటి ఎంటర్ ప్రైజ్ సాఫ్ట్ వేర్ల పై పని చేసే రోజులకు కాలం చెల్లింది. కృతిమ మేదను ప్రవేశక పెట్టకపోతే కొన్ని రోజుల తర్వాత వ్యాపారం పొందడం కూడా కష్టంగా మారగలదని కంపెనీల ముఖ్య కార్యనిర్వాహక అధికారులు భావిస్తున్నారు. అన్ని రంగాల్లో కంపెనీలు ఎఐని అందిపుచ్చుకోవాల్సిందే అని అంటున్నారు. భారత ఐటీ పరిశ్రమ విషయానికొస్తే ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. ఇప్పటి వరకు తక్కువ వ్యాయం వ్యుహన్నే ఐటీ కంపెనీలు అనుచరిస్తున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com