నేటి బిజినెస్-౦౨/౦౬

*దేశీయ వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ భారత విపణిలోకి మరో సరికొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఎన్‌టార్క్‌ 125 పేరుతో తీసువచ్చిన ఈ ద్విచక్ర వాహనం ధర రూ.58,790(ఎక్స్‌ షోరూమ్‌ న్యూదిల్లీ). 2016 ఆటోఎక్స్‌పోలో ఈ కాన్సెప్ట్‌తో స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
*దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ వారసుడైన జే వై.లీని అక్కడి అప్పీళ్ల కోర్టు విడుదల చేయాలని ఆదేశించింది.
*దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్లు, మొబైళ్లపై కస్టమ్స్‌ సుంకాన్ని 15 శాతం నుంచి 20శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
*125 సీసీ స్కూటర్‌ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ ప్రకటించింది. ఈ విభాగంలో తొలి స్కూటర్‌ ఎన్‌టార్క్‌ ను రూ.58,750 (ఎక్స్‌షోరూం, దిల్లీ)కి విక్రయిస్తామని తెలిపింది.
*జనవరిలో సేవల రంగం 3 నెలల్లోనే వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. కొత్త వ్యాపార ఆర్డర్లు విస్తరించడమే ఇందుకు ప్రధాన కారణమని ఒక ప్రైవేట్‌ సర్వే వెల్లడించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో టాటా మోటార్స్‌ గ్రూప్‌ నికర లాభం రూ.1215 కోట్లకు చేరింది. 2016-17 ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.111.6 కోట్లతో పోలిస్తే ఇది 11 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇదే సమయంలో గ్రూప్‌ ఆదాయం 16.1 శాతం హెచ్చి రూ.74,156 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం కోల్గేట్‌- పామోలివ్‌ ఇండియా రూ.170.65 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి మోల్డ్‌ టెక్‌ ప్యాకేజింగ్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.6.78 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*ద్రవరూప సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతిని త్వరలో ప్రారంభించేందుకు బీపీ పీఎల్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) సంయుక్తంగా సన్నాహాలు చేస్తున్నాయి.
*జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నిందితుల జాబితాలో ఉన్న ఇందూ టెక్‌ జోన్‌, తీసుకున్న రుణం చెల్లించనందున దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ ఆర్థిక సంస్థ ఐఎఫ్‌సీఐ లిమిటెడ్‌ దాఖలు చేసిన దరఖాస్తుపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ ధర్మాసనం సోమవారం నిర్ణయాన్ని వాయిదా వేసింది.
*పతంజలి దుకాణాల వినియోగదారులకు ఈ నెల 22 నుంచి పరిహార బీమా (లాయల్టీ ఇన్సూరెన్స్‌) వర్తింపజేయనున్నట్లు పతంజలి రామ్‌దేవ్‌బాబా తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com